Unstoppable With NBK Season 2 First Episode: అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 2 ఫ‌స్ట్ ఎపిసోడ్ గెస్ట్‌లు ఎవ‌రంటే-unstoppable with nbk season 2 first episode guests revealed full details here ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Unstoppable With Nbk Season 2 First Episode: అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 2 ఫ‌స్ట్ ఎపిసోడ్ గెస్ట్‌లు ఎవ‌రంటే

Unstoppable With NBK Season 2 First Episode: అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 2 ఫ‌స్ట్ ఎపిసోడ్ గెస్ట్‌లు ఎవ‌రంటే

Nelki Naresh Kumar HT Telugu
Oct 02, 2022 02:39 PM IST

Unstoppable With NBK Season 2 First Episode: మ‌రోసారి హోస్ట్‌గా సంద‌డి చేసేందుకు బాల‌కృష్ణ రెడీ అవుతున్నాడు. అన్‌స్టాప‌బుల్ టాక్ షో సెకండ్ సీజ‌న్ త్వ‌ర‌లో మొద‌లుకానుంది. ఈ టాక్ షో ఫ‌స్ట్ ఎపిసోడ్‌కు ఎవ‌రు గెస్ట్‌గా హాజ‌రుకానున్నారంటే...

<p>బాల‌కృష్ణ</p>
<p>బాల‌కృష్ణ</p> (Twitter)

Unstoppable With NBK Season 2 First Episode: బాల‌కృష్ణ (Balakrishna)హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించిన అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ వ‌న్ టాక్‌షోల‌లో ట్రెండ్‌సెట్ట‌ర్‌గా నిలిచింది. ఫ‌స్ట్ సీజ‌న్ మొద‌ల‌వ్వ‌డానికి ముందు బాల‌య్య షోను ఎలా న‌డిపిస్తారోన‌ని అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూశారు. కానీ త‌న కామెడీ టైమింగ్‌, ముక్కుసూటిత‌నంతో హోస్ట్‌గా అభిమానుల మ‌న‌సుల్ని గెలుచుకున్నారు.

రెగ్యుల‌ర్ టాక్‌షోల‌కు భిన్నంగా గెస్ట్‌ల నుంచి స‌మాధానాలు రాబ‌డుతూ హోస్ట్‌గా మెప్పించాడు. ఫ‌స్ట్ సీజ‌న్ పెద్ద స‌క్సెస్‌గా నిల‌వ‌డంతో సెకండ్ సీజ‌న్ కోసం అభిమానులు ఎగ్జ‌టింగ్‌గా ఎదురుచూస్తున్నారు. త్వ‌ర‌లోనే సెకండ్ సీజ‌న్ మొద‌లుకానుంది.

సెకండ్ సీజ‌న్ ట్రైల‌ర్‌ను అక్టోబ‌ర్ 4న విజ‌య‌వాడ‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేయ‌బోతున్నారు. ప్ర‌స్తుతం ట్రైల‌ర్ షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. ఈ ట్రైల‌ర్‌కు ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బాల‌కృష్ణ ప్రీలుక్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

ఈ ప్రీలుక్ పోస్ట‌ర్‌లో సూట్ ధ‌రించి క‌త్తి ప‌ట్టుకొని స్టైలిష్‌గా క‌నిపించారు బాల‌కృష్ణ‌. ఫ‌స్ట్ సీజ‌న్‌లో కేవ‌లం సినిమా హీరోహీరోయిన్లు మాత్ర‌మే గెస్ట్‌లుగా వ‌చ్చారు. సెకండ్ సీజ‌న్‌లో సినిమా తార‌ల‌తో పాటు పొలిటిక‌ల్ లీడ‌ర్స్ క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

సెకండ్ సీజ‌న్ ఫ‌స్ట్ ఎపిసోడ్‌కు బాల‌కృష్ణ వియ్యంకుడు, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడితో(Chandrababu Naidu) పాటు ఆయ‌న త‌న‌యుడు నారా లోకేష్ (Nara lokesh) హాజ‌రుకానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ఈ ఫ‌స్ట్‌ ఎపిసోడ్ తాలూకు షూటింగ్‌ను పూర్తిచేసిన‌ట్లు తెలిసింది.

ఇందులో ఎన్టీఆర్‌తో ఉన్న‌ అనుబంధంతో పాటు టీడీపీ భ‌విష్య‌త్ కార్య‌చ‌ర‌ణ‌కు సంబంధించి చంద్ర‌బాబు ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని పంచుకోబోతున్న‌ట్లు చెబుతున్నారు. ఈ ప‌స్ట్ ఎపిసోడ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ద‌స‌రా రోజున రివీల్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

Whats_app_banner