IND vs SL | 'అన్​స్టాపబుల్​' శ్రేయస్​​.. సిరీస్​ క్లీన్​స్వీప్​-ind vs sl india wins the match and clean sweeps the 3 match t20 series ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Ind Vs Sl, India Wins The Match And Clean Sweeps The 3 Match T20 Series

IND vs SL | 'అన్​స్టాపబుల్​' శ్రేయస్​​.. సిరీస్​ క్లీన్​స్వీప్​

HT Telugu Desk HT Telugu
Feb 27, 2022 10:23 PM IST

IND vs SL 3rd T20 | ధర్మశాల వేదికగా జరిగిన మూడో టీ20లో విజయం సాధించిన టీమ్​ఇండియా.. శ్రీలంకతో సిరీస్​ను క్లీన్​స్వీప్​ చేసింది. 147పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్​కు​.. శ్రేయస్​ అయ్యర్​ అర్థశతకంతో విజయాన్ని అందించాడు.

శ్రేయస్​ అయ్యర్​
శ్రేయస్​ అయ్యర్​ (BCCI TWITTER)

IND vs SL 3rd T20 live updates | శ్రీలంకతో మూడో టీ20ని కూడా టీమ్​ఇండియా తన ఖాతాలో వేసుకుంది. ఫలితంగా సిరీస్​ను క్లీన్​స్వీప్​ చేసింది. ధర్మశాల వేదికగా జరిగిన మూడో టీ20లో.. శ్రేయస్​ అయ్యర్(45 బంతుల్లో 73*)​ మరోమారు దుమ్మురేపడంతో.. 147పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించేసింది భారత జట్టు.

మొత్తం మీద లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి.. 16.5ఓవర్లలోనే సాధించింది భారత జట్టు.

అన్​స్టాపబుల్​ శ్రేయస్​..

Shreyas Iyer news| లక్ష్యఛేదనలో టీమ్​ఇండియాకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్​, కెప్టెన్​ రోహిత్​ శర్మ మరోమారు విఫలమయ్యాడు. తొమ్మిది బంతుల్లో కేవలం 5 పరుగులే చేసి చమీర బౌలింగ్​లో వెనుదిరిగాడు. అప్పటికి టీమ్​ఇండియా స్కోర్​ 6/1(1.4ఓవర్లు).

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్​ అయ్యర్​.. మరో ఓపెనర్​ సంజూ శాంసన్(18)​తో కలిసి ఇన్నింగ్స్​ను చక్కదిద్దాడు. ఇద్దరు కలిసి వేగంగా పరుగులు రాబట్టారు. ఈ దశలో శాంసన్​ను కరుణరత్నే ఔట్​ చేశాడు.

ఓవైపు వికెట్లు పడుతున్నా.. శ్రేయస్​ మాత్రం దూకుడు తగ్గించలేదు. శాంసన్​ ఔటైన తర్వాత దీపక్​ హుడా(21)తో కలిసి జట్టును ముందుకు నడిపించాడు​. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ దూకుడు ప్రదర్శన చేశాడు. కొద్ది సేపటికి హుడా సైతం వెనుదిరిగాడు. అప్పటికి టీమ్​ఇండియా స్కోర్​.. 89/3(10.5)

భీకర ఫామ్​ను కొనసాగిస్తూ.. అర్థశతకాన్ని నమోదు చేశాడు శ్రేయస్​. హుడా తర్వాత క్రీజులోకి వచ్చిన వెంకటేష్​ అయ్యర్​(4) ఎక్కువ సేపు క్రీజులో ఉండలేదు. భారీ షాట్​కు ప్రయత్నించి పెవీలియన్​కు చేరాడు. ఆ తర్వాత వచ్చిన జడేజా(22*).. శ్రేయస్​కు మద్దతుగా నిలిచాడు. ఇద్దరు కలిసి చూడచక్కటి షాట్లు ఆడి.. జట్టును విజయతీరాలకు చేర్చారు.  మొత్తం మీద జట్టు.. 16.5ఓవర్లలో 148 పరుగులు చేసింది.

శ్రీలంక బౌలర్లలో లహీరు కుమార రెండు వికెట్లు పడగొట్టడు. చమీర, కరుణరత్నే తలో వికెట్​ను తమ ఖాతాలో వేసుకున్నారు.

అంతకుముందు టాస్​ గెలిచి బ్యాటింగ్​కు దిగిన శ్రీలంక.. 20ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి.. 146 పరుగులు చేసింది. టాప్​ ఆర్డర్​ విఫలమైనా.. షానక కెప్టెన్​ ఇన్నింగ్స్​తో జట్టును ఆదుకున్నాడు.

ఒక నెలలో మూడో వైట్​వాష్​లు..

శ్రీలంకతో మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​ను 3-0తో కైవసం చేసుకుంది రోహిత్​ సేన. ఈ నెల ఆరంభంలో.. ఇండియాలో పర్యటించిన వెస్టిండీస్​ను అటు వన్డేల్లో, ఇటు టీ20ల్లో వైట్​వాష్​ చేసింది టీమ్​ఇండియా.

ప్రస్తుతం శ్రీలంకతో టీ20 సమరం ముగిసింది. ఇక రెండు మ్యాచ్​ల టెస్ట్​ సిరీస్​.. మార్చ్​​ 4న ప్రారంభంకానుంది. మొహాలీలో జరగనున్న తొలి మ్యాచ్​.. టీమ్​ఇండియా మాజీ సారథి విరాట్​ కోహ్లీకి 100వ టెస్ట్​కానుంది.

WhatsApp channel

సంబంధిత కథనం