తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap Receives 340 Investment Proposals For The Investment Of <Span Class='webrupee'>₹</span>13lakh Crores During The Gis 2023

GIS 2023 at Vizag: తొలిరోజు రూ.11 లక్షల కోట్ల పెట్టుబడులు.. 92 ఎంఓయూలపై సంతకాలు

HT Telugu Desk HT Telugu

03 March 2023, 18:22 IST

    • global investors summit 2023 updates: విశాఖ వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పెట్టుబడుల వర్షం కురుసింది. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ ద్వారా తొలిరోజు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు 340 సంస్థలు ముందుకొచ్చాయని సీఎం జగన్ వెల్లడించారు. 20 సెక్టార్లలో రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని సమ్మిట్ లో ప్రకటించారు
గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌-2023
గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌-2023

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌-2023

Global Investors Summit 2023 at Vizag: విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. తొలిరోజు రాష్ట్రంపై పెట్టుబడుల వర్షం కురిసింది. సమ్మిట్ తొలిరోజు రూ. 11, 87, 756 కోట్ల మొత్తంతో 92 ఎంవోయూలు చేసుకున్నట్టు సీఎం జగన్ వెల్లడించారు. ఫలితంగా దాదాపు 4 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. మిగిలిన 248 ఎంవోయూలను శనివారం (మార్చి 4వ తేదీన) కుదుర్చుంటామన్నారు. రెండో రోజు స‌మ్మిట్‌లో రూ. 1.15 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు చేసుకోబోతున్నామని, దీని ద్వారా మరో 2 లక్షల మందికి పైగా ఉపాధి లభిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సమ్మిట్ ద్వారా మొత్తం 6 లక్షల మందికిపైగా ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయని ముఖ్యమంత్రి ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు

AP Welfare pensions: ఏపీలో రెండు రోజుల్లో 96.67శాతం సామాజిక పెన్షన్ల పంపిణీ, చాలా చోట్ల బ్యాంకు ఫీజులుగా కోత.

Maddalachervu Suri: మద్దలచెర్వు సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవ శిక్ష ఖరారు చేసిన తెలంగాణ హైకోర్టు

AP TS Weather Update: ఏపీలో ఎర్రటి ఎండలు, తెలంగాణలో భానుడి భగభగలు, ప్రకాశంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు

Railway UTS APP: రైల్వే జనరల్ టిక్కెట్ల కొనుగోలు మరింత సులభం, మొబైల్‌లోనే జనరల్ టిక్కెట్లు కొనొచ్చు…

ఏపీ రాజధాని అంశంపై కూడా సీఎం జగన్ స్పందించారు. విశాఖ పరిపాలన రాజధాని అవుతుందన్నారు. రాష్ట్రంలో మూడు పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయన్న ఆయన.. భౌగోళికంగా పరిశ్రమలకు ఏపీ అనుకూలమని చెప్పుకొచ్చారు. ఏపీలో క్రియాశీలక ప్రభుత్వం ఉందన్న ముఖ్యమంత్రి... విశాఖ త్వరలో పరిపాలన రాజధాని కాబోతోందని స్పష్టం చేశారు. తాను కూడా విశాఖ నుంచే పాలన చేయబోతున్నట్లు ప్రకటించారు.

పెట్టుబడుల వివరాలు…

ప్రధాన పెట్టుబడిదారులలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) రూ. 2,35,000 కోట్ల పెట్టుబడితో 77,000 మందికి ఉపాధి కల్పించే 3 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. ఏబీసీ లిమిటెడ్ రూ. 1.2 లక్షల కోట్ల పెట్టుబడితో ఎంఓయూపై సంతకం చేసి ఆంధ్రప్రదేశ్‌లోని 7000 మందికి ఉపాధి కల్పించబోతోంది. JSW గ్రూప్ 6 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. రూ. 50,632 కోట్ల పెట్టుబడితో 9,500 మందికి ఉపాధిని కల్పించనుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ రూ. 21,820 కోట్ల పెట్టుబడితో 14,000 మందికి ఉపాధి కల్పించే 2 అవగాహన ఒప్పందాలు చేసుకుంది. అరబిందో గ్రూప్ రూ. 10,365 కోట్ల పెట్టుబడితో 5 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. దీని ద్వారా 5,250 మందికి ఉపాధి ఇవ్వనుంది. ఆదిత్య బిర్లా గ్రూప్ 2,850 మందికి ఉపాధి కల్పించే రూ.9,300 కోట్ల పెట్టుబడితో 2 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. జిందాల్ స్టీల్ రూ. 7,500 కోట్ల పెట్టుబడితో 2,500 మందికి ఉపాధి కల్పించే ఎంఓయూపై సంతకం చేసింది. మొదటి రోజు మొత్తం 64 కంపెనీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

రాజధానిపై సీఎం ప్రకటన…

ఏపీ రాజధాని అంశంపై కూడా సీఎం జగన్ స్పందించారు. విశాఖ పరిపాలన రాజధాని అవుతుందన్నారు. రాష్ట్రంలో మూడు పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయన్న ఆయన.. భౌగోళికంగా పరిశ్రమలకు ఏపీ అనుకూలమని చెప్పుకొచ్చారు. ఏపీలో క్రియాశీలక ప్రభుత్వం ఉందన్న ముఖ్యమంత్రి... విశాఖ త్వరలో పరిపాలన రాజధాని కాబోతోందని స్పష్టం చేశారు. తాను కూడా విశాఖ నుంచే పాలన చేయబోతున్నట్లు ప్రకటించారు.

ముఖేష్‌ అంబానీ, కుమార మంగళం బిర్లా, కరణ్‌ అదానీ, సంజీవ్‌ బజాజ్, అర్జున్‌ ఒబెరాయ్, సజ్జన్‌ జిందాల్, నవీన్‌ జిందాల్, మార్టిన్‌ ఎబర్‌ హార్డ్డ్, హరిమోహన్‌ బంగూర్, సజ్జన్‌ భజాంకా వంటి 30కి పైగా కార్పొరేట్‌ దిగ్గజ ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఆంధ్రా యూనివర్శిటీలోని సువిశాలమైన గ్రౌండ్లో సుమారు 200 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇందులో 30 స్టాల్స్‌తో సహా ప్రభుత్వం గుర్తించిన 13 కీలక రంగాలలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే వివిధ ప్రయోజనాలను ప్రదర్శిస్తారు. భారత్, చైనా, అమెరికా సహా 40 ఇతర దేశాల నుంచి 8,000 మంది ప్రముఖులు మరియు పెట్టుబడిదారులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.