తెలుగు న్యూస్ / తెలంగాణ /
LIVE UPDATES
Telangana News Live September 28, 2024: Khammam News : ఖమ్మంలో "గురు"వింద, విద్యార్థినిలపై కీచక చేష్టలు
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sat, 28 Sep 202405:00 PM IST
Telangana News Live: Khammam News : ఖమ్మంలో "గురు"వింద, విద్యార్థినిలపై కీచక చేష్టలు
- Khammam News : ఖమ్మం జిల్లాలో ఓ కీచక ప్రధానోపాధ్యాయుడి బాగోతం వెలుగుచూసింది. హెడ్ మాస్టర్ విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో...వారు అసలు విషయాన్ని తల్లిదండ్రులు తెలిపారు. తల్లిదండ్రులు, గ్రామస్థులు పాఠశాలకు రాగా...విషయం తెలుసుకుని హెడ్ మాస్టర్ పరారయ్యాడు.
Sat, 28 Sep 202404:54 PM IST
Telangana News Live: Karimnagar Congress : కరీంనగర్ కాంగ్రెస్ లో గజిబిజి..! అయోమయంలో క్యాడర్
- కరీంనగర్ లో కాంగ్రెస్ గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవైపు జిల్లా మంత్రి బిజీబిజీగా ఉంటున్నారు.. మరోవైపు కీలక నేతలు పెద్దగా లైన్ లో ఉండటం లేదు. కేవలం ప్రకటనల వరకు పరిమితమవుతున్నారన్న భావన చాలా మంది నాయకుల్లో ఉంది. పట్టించుకునేవారు కానరాక పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి.
Sat, 28 Sep 202403:16 PM IST
Telangana News Live: RTC Electric Buses : రోడ్డెక్కనున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు, రేపు కరీంనగర్ లో 35 బస్సులు ప్రారంభం
- RTC Electric Super Luxury Buses : టీజీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులను అందుబాటులోకి తెస్తుంది. కరీంనగర్ కు కేటాయించిన 70 బస్సుల్లో 35 ఎలక్ట్రిక్ బస్సులను రేపు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రారంభించనున్నారు.
Sat, 28 Sep 202402:53 PM IST
Telangana News Live: HYDRA : అక్రమ కట్టడాల వెనుక పెద్దోళ్ల హస్తం, పేదలను హైడ్రా ఇబ్బంది పెట్టదు - కమిషనర్ రంగనాథ్
- HYDRA : సోషల్ మీడియాలో హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కమిషనర్ రంగనాథ్ అన్నారు. అక్రమ కట్టడాల వెనుక పెద్దవాళ్లు ఉన్నారని ఆరోపించారు. హైడ్రా అక్రమ కట్టడాలను మాత్రమే కూల్చివేస్తుందన్నారు. పేదలకు ఇబ్బంది పెట్టాలని హైడ్రా అభిమతం కాదన్నారు.
Sat, 28 Sep 202401:50 PM IST
Telangana News Live: TG Govt Digital Health Cards : డిజిటల్ హెల్త్ కార్డులో మహిళే యజమాని - సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
- ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలను జారీ చేశారు. డిజిటల్ హెల్త్ కార్డులో మహిళనే ఇంటి యజమానిగా గుర్తించాలని స్పష్టం చేశారు. మిగతా వారి వివరాలను కార్డు వెనక ఉంచాలని సూచించారు. మంత్రివర్గ ఉప సంఘం సూచనల మేరకు కార్డుల రూపకల్పన జరగాలని దిశానిర్దేశం చేశారు.
Sat, 28 Sep 202401:36 PM IST
Telangana News Live: ACB Trap : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
- సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ పరిధిలో లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి చిక్కాడు. ఇంటి ధ్రువపత్రం కోసం రూ. 5 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. అరెస్ట్ చేసిన అధికారులు కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలించారు.
Sat, 28 Sep 202412:27 PM IST
Telangana News Live: ACB Raid : ఇంటి నివాస ధ్రువపత్రం కోసం రూ. 5 వేలు లంచం, ఏసీబీకి చిక్కిన కొండాపూర్ పంచాయతీ కార్యదర్శి
- ACB Raid : సంగారెడ్డి జిల్లా కొండాపూర్ లో ఇంటి నివాస ధ్రువపత్రం కోసం రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
Sat, 28 Sep 202412:21 PM IST
Telangana News Live: Sangareddy : గీతం యూనివర్సిటీలో విషాదం... ఫ్యాన్ కు ఉరి వేసుకొని విద్యార్థిని సూసైడ్
- సంగారెడ్డిలోని గీతం యూనివర్శిటీలో విషాదం చోటు చేసుకుంది. హాస్టల్ గదిలోని ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఓ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు… అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. చనిపోయిన విద్యార్థిని ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన నాగల్లి వర్షగా గుర్తించారు.
Sat, 28 Sep 202411:05 AM IST
Telangana News Live: Jani Master Remand : ముగిసిన జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ, చంచల్ గూడా జైలుకు తరలింపు
- Jani Master Remand : కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 3వ తేదీ వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఇవాళ్టితో జానీ మాస్టర్ నాలుగు రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. దీంతో అతనిని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.
Sat, 28 Sep 202410:11 AM IST
Telangana News Live: Woman delivers Baby In RTC Bus : ఆర్టీసీ బస్సులో మహిళకు పురిటినొప్పులు, పురుడు పోసిన తోటి ప్రయాణికులు
- Woman delivers Baby In RTC Bus : ఆర్టీసీ బస్సులో పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళలకు సిబ్బంది, తోటి ప్రయాణికులు సాయం చేసి ఉదారత చాటుకున్నారు. నొప్పులు ఎక్కువ కావడంతో బస్సులోని తోటి మహిళా ప్రయాణికులు ఆమెకు పురుడుపోశారు. మహిళకు పండంటి ఆడ శిశువు జన్మించింది.
Sat, 28 Sep 202408:55 AM IST
Telangana News Live: TG ICET Counselling 2024 : తెలంగాణ ఐసెట్ ప్రవేశాలు - స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, ముఖ్య తేదీలు
- TG ICET 2024 Counselling : తెలంగాణ ఐసెట్ ప్రవేశాలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ పూర్తి కావటంతో తాజాగా ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఫేజ్ కు సంబంధించి సెప్టెంబర్ 30వ తేదీ అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
Sat, 28 Sep 202408:50 AM IST
Telangana News Live: BRS Harish Rao : మూసీలో పేదల కన్నీళ్లు పారిస్తున్నారు, సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
- BRS Harish Rao : మూసీలో పేద, మధ్య తరగతి ప్రజల కన్నీళ్లు పారిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. మూసీ నిర్వాసితులతో మాట్లాడిన ఆయన....కాంగ్రెస్ సర్కార్ పై విమర్శలు చేశారు. పేదల కన్నీళ్లపై అభివృద్ధి చేయడం ఏంటని హరీశ్ రావు ప్రశ్నించారు.
Sat, 28 Sep 202408:35 AM IST
Telangana News Live: Karimnagar : కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులపై.. మంత్రి పొన్నం ప్రభాకర్ అసంతృప్తి
- Karimnagar : కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులపై మంత్రి పొన్నం ప్రభాకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులను మందలించారు. పెండింగ్ పనులన్ని నెలరోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం నిర్మిస్తున్న కట్టడాలను త్వరలోనే విజిట్ చేస్తానని.. ఎక్కడ నిర్లక్ష్యం కనిపించినా సహించేది లేదని హెచ్చరించారు.
Sat, 28 Sep 202407:03 AM IST
Telangana News Live: Johnny master Case : జానీ మాస్టర్ కేసులో కొత్త ట్విస్ట్.. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు సుమలత ఫిర్యాదు
- Johnny master Case : జానీ మాస్టర్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. జానీ మాస్టర్ భార్య బాధితురాలిపై ఫిర్యాదు చేసింది. తనకు ఐదేళ్లు నరకం చూపించిందని ఫిర్యాదులో పేర్కొంది. ఇప్పుడు ఈ ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏం చేయబోతోందనే ఉత్కంఠ నెలకొంది.
Sat, 28 Sep 202404:55 AM IST
Telangana News Live: Hyderabad : తుపాకీతో కాల్చుకొని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య.. కారణం అదేనా?
- Hyderabad : రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆఫీసులో విషాదం జరిగింది. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్ తుపాకితో కాల్చుకొని సూసైడ్ చేసుకున్నారు. ఆన్‌లైన్ గేమ్స్ కారణంగా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు.
Sat, 28 Sep 202403:28 AM IST
Telangana News Live: PSTU Admissions 2024 : అక్టోబర్ 3, 4 తేదీల్లో తెలుగు వర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్.. హాల్ టికెట్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకొండి
- PSTU Admissions 2024 : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం.. కీలక ప్రకటన చేసింది. వచ్చే నెల 3, 4 తేదీల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్టు వర్సిటీ రిజిస్ట్రార్ వెల్లడించారు. యూనివర్సిటీ అధికారిక వెబ్ సైట్ నుంచి హాట్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.
Sat, 28 Sep 202401:59 AM IST
Telangana News Live: Hydra : హైడ్రా భయంతో మహిళ ఆత్మహత్య.. కారణం వేరే ఉందన్న ఏవీ రంగనాథ్!
- Hydra : హైడ్రా.. ఇప్పుడు హైదరాబాద్, తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల స్పీడ్ పెంచిన హైడ్రా.. కూల్చివేతల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ వ్యవహారంపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. ఈ ఘటనతో హైడ్రాకు సంబంధం లేదని చెప్పారు.
Sat, 28 Sep 202412:48 AM IST
Telangana News Live: TG ACB : పెట్రోల్ బంక్ ఎన్‌వోసీ కోసం లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన ఇద్దరు అధికారులు
- TG ACB : జనగామ జిల్లాలో ఏసీబీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఇదివరకే మున్సిపల్ కమిషనర్, ఇరిగేషన్ ఏఈ ఏసీబీకి చిక్కిన ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా.. పెట్రోల్ బంక్ ఏర్పాటు కోసం ఎన్‌వోసీ ఇచ్చేందుకు ఆర్‌అండ్‌బీ ఈఈ లంచం డిమాండ్ చేశారు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడ్డారు.
Sat, 28 Sep 202412:14 AM IST
Telangana News Live: Sangareddy : ఎగువన భారీ వర్షాలు.. ఉప్పొంగుతున్న మంజీరా, సింగూర్, నిజాంసాగర్
- Sangareddy : కర్ణాటక, తెలంగాణలోని మంజీరా నది కాచ్‌మెంట్ ఏరియాలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. ఎగువ ప్రాంతాల నుండి వరద కొనసాగుతుండడంతో.. సంగారెడ్డి జిల్లా లోని సింగూరు ప్రాజెక్ట్ నిండు కుండలా మారింది. దీంతో అధికారులు రెండు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Sat, 28 Sep 202411:30 PM IST
Telangana News Live: Sircilla : సంక్షోభంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ.. ఉపాధి లేక నేతన్నల అవస్థలు
- Sircilla : సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో పడింది. పనిలేక పరిశ్రమ మూత పడే పరిస్థితి వచ్చింది. బతుకమ్మ చీరల ఆర్డర్స్ లేక.. చేతి నిండా పని కానరాక నేత కార్మికులు రోడ్డున పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నెలకొంది. నేత కార్మికుల సమస్యలపై రాజకీయ విమర్శలు దుమారం రేపుతున్నాయి.