Woman delivers Baby In RTC Bus : ఆర్టీసీ బస్సులో మహిళకు పురిటినొప్పులు, పురుడు పోసిన తోటి ప్రయాణికులు
Woman delivers Baby In RTC Bus : ఆర్టీసీ బస్సులో పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళలకు సిబ్బంది, తోటి ప్రయాణికులు సాయం చేసి ఉదారత చాటుకున్నారు. నొప్పులు ఎక్కువ కావడంతో బస్సులోని తోటి మహిళా ప్రయాణికులు ఆమెకు పురుడుపోశారు. మహిళకు పండంటి ఆడ శిశువు జన్మించింది.
Woman delivers Baby In RTC Bus : ఆర్టీసీ బస్సులో పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు సకాలంలో కాన్పు చేయించి టీజీఎస్ఆర్టీసీ సిబ్బంది తమ ఉదారతను చాటుకున్నారు. కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శనివారం సూర్యాపేట నుంచి కోదాడకు వెళ్తోంది. అందులో గుడిబండ గ్రామానికి చెందిన గర్భిణి అలివేలు ప్రయాణిస్తున్నారు. బస్సు మునగాల మండలం తాడ్వాయి వద్దకు రాగానే ఆమెకు ఒక్కసారిగా పురిటినొప్పులు మొదలయ్యాయి.
కండక్టర్ నరేశ్ బాబు అప్రమత్తమై.. డ్రైవర్ నరేశ్‌కు చెప్పి బస్సును ఆపించారు. వెంటనే అంబులెన్స్ కోసం 108 కాల్ చేశారు. నొప్పులు ఎక్కువ కావడంతో బస్సులోని తోటి మహిళా ప్రయాణికులు ఆమెకు పురుడుపోశారు. మహిళకు ఆడ శిశువు జన్మించింది. వారిని అంబులెన్స్ సాయంతో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. బస్సులో పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణికి కాన్పు చేసిన మహిళా ప్రయాణికులకు, సమయస్పూర్తితో వ్యవహారించిన ఆర్టీసీ సిబ్బందికి ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అభినందనలు తెలిపారు. వారు అప్రమత్తమై సకాలంలో స్పందించడం వల్లే తల్లిబిడ్డా క్షేమంగా ఉన్నారని ఆయన అన్నారు.
ఆర్టీసీ ఐటీఐ కాలేజీలో ప్రవేశాలు
ఐటీఐ విద్యను అభ్యసించే వారికి తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ హాకీంపేటలోని ఆర్టీసీ ఐటీఐ కాలేజీలో వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు ఎండీ సజ్జనార్ ఇటీవల ఓ ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి గల విద్యార్థులు వీటికి దరఖాస్తు చేసుకోవాలని ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ ట్రేడ్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఆర్టీసీ డిపోల్లో అప్రెంటిస్‌షిప్ సౌకర్యాన్ని కల్పిస్తారు. అర్హత కలిగిన విద్యార్థులు సెప్టెంబర్ 28 తేదీలోపు https://iti.telangana.gov.in లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మెకానిక్ డిజీల్, మెకానిక్ మోటార్ వెహికిల్, వెల్డర్, పెయింటర్ ట్రేడ్ లో ప్రవేశాలు ఉంటాయి. మెకానిక్ డీజిల్ కోర్సు వ్యవధి ఏడాది మాత్రమే ఉంటుంది. మోటర్ వెహికిల్ మెకానిక్ 2 సంవత్సరాలు ఉంటుంది. వెల్డర్ ఒక ఏడాది, పెయింటర్ రెండేళ్ల వ్యవధి ఉంటుంది. పూర్తి వివరాలకు 9100664452, 040 -2345 -0033 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు. అంతేకాకుండా zstchpt@gmail.com కు మెయిల్ కూడా చేయవచ్చు.
సంబంధిత కథనం
టాపిక్