Digestive Health : తిన్న వెంటనే కడుపు ఉబ్బరంగా ఉందా? అయితే ఈ ఆసనాలు వేసేయండి..-yoga asanas for digestive health after a big meal ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Yoga Asanas For Digestive Health After A Big Meal

Digestive Health : తిన్న వెంటనే కడుపు ఉబ్బరంగా ఉందా? అయితే ఈ ఆసనాలు వేసేయండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Aug 31, 2022 03:10 PM IST

Digestive Health : మనం తరచుగా జీర్ణవ్యవస్థను నిర్లక్ష్యం చేస్తుంటాము. కానీ రోజువారీ జీవితంలో యోగాను చేర్చడం ద్వారా.. మీరు జీర్ణక్రియను మెరుగుపరచవచ్చు.. బరువు తగ్గడాన్ని వేగవంతం చేయవచ్చు అంటున్నారు నిపుణులు. పైగా భోజనం చేసిన తర్వాత కూడా ఆసనాలు వేయొచ్చు అంటున్నారు. తిన్న తర్వాత ఆసనాలు ఏంటి అనుకుంటున్నారా?

జీర్ణసమస్యలను తగ్గించే యోగా ఆసనాలు
జీర్ణసమస్యలను తగ్గించే యోగా ఆసనాలు

Yoga Asanas For Digestive Health : అతిగా తినడం, సరైన ఆహారపు అలవాట్లను పాటించకపోవడం వల్ల మీ శరీరం, జీర్ణ ఆరోగ్యం అప్పుడప్పుడు ఒత్తిడికి గురవుతుంది. యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం వంటి లక్షణాలు ఇబ్బంది పెడతాయి. ఇవి వికారం, నిద్రలేమికి కూడా కారణమవుతాయి. చివరకి బరువు పెరగడానికి దారితీయవచ్చు. అయితే ఏదైనా భోజనం చేసిన తర్వాత కొన్ని యోగా ఆసనాలు చేస్తే.. మెరుగైన జీర్ణక్రియ, ప్రశాంతమైన నిద్ర, బరువు తగ్గడం వంటి ప్రయోజనాలు మీరు పొందవచ్చు అంటున్నారు యోగా శిక్షకురాలు నివేదిత జోషి. మరి భోజనం తర్వాత కూడా చేయగలిగే ఆసనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

భోజనం తర్వాత చేయగలిగే యోగా ఆసనాలు:

1. వజ్రాసనం

మధ్యాహ్నం, రాత్రి భోజనం లేదా మీరు ఏదైనా భోజనం తీసుకున్న తర్వాత వజ్రాసనం చేయడం జీర్ణక్రియలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకం నుంచి ఉపశమనం అందిస్తుంది. కడుపు సమస్యలను దూరం చేస్తుంది. నిజానికి ఇది ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. మీరు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.

2. సుప్త బద్ధ కోనసనా

ఈ భంగిమ లోపలి తొడలు, మోకాళ్లను సాగదీస్తుంది. పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను పెంచడం ద్వారా జీర్ణక్రియను సక్రియం చేస్తుంది. ఇది అలసట, నిద్రలేమి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

3. ఊర్ధ్వ ప్రసరిత పదసానా

ఇది కోర్ మీద పని చేయడంలో సహాయపడుతుంది. మీరు వేగంగా కదిలే చర్యలో దీన్ని చేస్తే.. అది దిగువ, మధ్య, ఎగువ అబ్స్‌పై పని చేస్తుంది. కడుపు సంబంధిత సమస్యలను నయం చేయడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

4. మార్జర్యాసనం

ఈ భంగిమ తుంటి, వీపు, పొత్తికడుపులోని కండరాలను సాగదీస్తుంది. అంతేకాక ఇది జీర్ణశయాంతర ప్రేగులతో సహా అవయవాలను ప్రేరేపిస్తుంది. ఫలితంగా జీర్ణవ్యవస్థ సమర్థవంతంగా పని చేస్తుంది.

5. పర్వత భంగిమ

తిన్న తర్వాత చేయడానికి ఇది ఉత్తమమైన భంగిమ. కడుపు నిండా తిన్నా సరే దీనిని నిర్భయంగా చేయవచ్చు. ఇది మీ జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. జీవక్రియను పెంచుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం