Stomach Bloating : అవి తగ్గిస్తే కడుపు ఉబ్బరం కూడా తగ్గుతుంది-you must avoid these food to reduce you stomach bloating problem ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  You Must Avoid These Food To Reduce You Stomach Bloating Problem

Stomach Bloating : అవి తగ్గిస్తే కడుపు ఉబ్బరం కూడా తగ్గుతుంది

Geddam Vijaya Madhuri HT Telugu
Aug 26, 2022 01:29 PM IST

కొందరికి అన్ని వేళల కడుపు ఉబ్బరంగా ఉంటుంది. మన మొత్తం ఆరోగ్యంలో మన గట్ ఆరోగ్యం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి తీసుకునే ఆహారంపై కచ్చితంగా శ్రద్ధ వహించాలి. కొన్ని ఆహారాలు తీసుకుంటే ఈ బ్లోటింగ్ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. కాబట్టి గ్యాస్ కలిగించే ఆహారాన్ని తీసుకోసవడం మానేయాలి అంటున్నారు నిపుణులు.

కడుపు ఉబ్బరం
కడుపు ఉబ్బరం

Stomach Bloating : కడుపు ఉబ్బరం అనేది అధిక గ్యాస్ లేదా జీర్ణవ్యవస్థలో ఆటంకాలు కారణంగా కడుపులో ఏర్పడే ఓ రకమైన అనుభూతి. ఈ పరిస్థితిని ఎదుర్కోనేవారు ఎప్పుడూ కడుపు నిండిన అనుభూతితో ఉంటారు. అంతేకాకుండా వారి కడుపు పెద్దదిగా ఉంటుంది. అయితే ఎక్కువసార్లు ఇలాంటి ఇబ్బంది ఎదుర్కొంటే కచ్చితంగా వైద్యుని సంప్రదించాల్సిందే. కొన్ని చిట్కాలను పాటించడం వల్ల కూడా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫైబర్ ఆహారాలు

అధిక ఫైబర్ ఆహారాల వినియోగాన్ని తగ్గించాలి. కొన్నిసార్లు అధిక-ఫైబర్ ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పెద్ద మొత్తంలో గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. బీన్స్, కాయధాన్యాలు, తృణధాన్యాలు ఈ జాబితాలోనివే.

మీరు ప్రతిసారి కడుపు నిండుగా ఉన్నట్లు భావిస్తే.. కడుపు ఉబ్బరానికి కారణమయ్యే ఆహారాలను గుర్తించి.. వాటిని తీసుకోవడంలో పరిమితం చేయాలి.

షుగర్ ఆల్కహాల్..

షుగర్ ఆల్కహాల్‌లు మీకు ఉబ్బిన అనుభూతిని కలిగిస్తాయి. చక్కెర ఆల్కహాల్‌లు సురక్షితమైన చక్కెర ప్రత్యామ్నాయాలుగా పరిగణిస్తారు కానీ కడుపు ఉబ్బరాన్ని కలిస్తాయి. ఇవి సాధారణంగా క్యాండీలు, కుకీలు, శీతల పానీయాలు, చూయింగ్ గమ్‌లలో కనిపిస్తాయి.

ఇవి పెద్ద పేగులలోని బ్యాక్టీరియా ద్వారా జీర్ణం అయినప్పుడు.. అవి వాయువును ఉత్పత్తి చేస్తాయి. తద్వారా కడుపు ఉబ్బరం కలుగుతుంది. వాటిని తీసుకునే ముందు లేబుల్స్ పరిశీలించండి. జిలిటోల్, సార్బిటాల్, మన్నిటాల్ వంటి పదార్థాలను దూరంగా పెట్టండి.

ప్రోబయోటిక్స్

ఆరోగ్యకరమైన జీర్ణ ప్రక్రియ కోసం ఆహారంలో ప్రోబయోటిక్స్ చేర్చండి. ఆరోగ్యకరమైన గట్, కడుపు ఉబ్బరం వచ్చే అవకాశాలను తగ్గించడంలో ప్రోబయోటిక్స్ కీలక పాత్ర పోషిస్తాయి. కొన్ని అధ్యయనాలు ప్రోబయోటిక్స్ జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులలో గ్యాస్ ఉత్పత్తి, కడుపు ఉబ్బరం తగ్గించడంలో సహాయపడతాయని రుజువు చేశాయి.

ప్రోబయోటిక్స్ కలిగి ఉన్న పెరుగు, కేఫీర్ వంటి ఆహారాలను మీ డైట్​లో చేర్చుకోండి. తద్వార మెరుగైన జీర్ణక్రియ ప్రక్రియలో సహాయపడుతుంది. ఇది ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.

సోడాలు మానేస్తే బెటర్

సోడాలు, కార్బోనేటేడ్ పానీయాలకు దూరంగా ఉండడమే మంచిది. జీర్ణవ్యవస్థలో గట్ బాక్టీరియా ద్వారా విడుదలయ్యే వాయువుల మిశ్రమం ఉంటుంది. ఇది అనివార్యమైనప్పటికీ.. సోడాలు, ఫిజీ డ్రింక్స్ తీసుకోవడం వల్ల మన కడుపులోని గ్యాస్ మొత్తం పెరుగుతుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండడమే బెటర్.

WhatsApp channel

సంబంధిత కథనం