Gastric Pain : గ్యాస్ నొప్పితో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలు మీకోసమే..-home remedies for gastric pain to cure your gas pain ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Gastric Pain : గ్యాస్ నొప్పితో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలు మీకోసమే..

Gastric Pain : గ్యాస్ నొప్పితో బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలు మీకోసమే..

Geddam Vijaya Madhuri HT Telugu
Jun 17, 2022 01:29 PM IST

సరైన సమయంలో తినకపోవడం.. మంచి ఆహారం తీసుకోకపోవడం.. సరైనా ఆహార పద్ధతులను పాటించకపోవడం వల్ల గ్యాస్​ సమస్య వస్తుంది. సమస్య తీవ్రంగా అనిపించినప్పుడు వైద్యుని సంప్రదించాల్సిందే అంటున్నారు వైద్యులు. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో ఈ సమస్యనుంచి బయటపడొచ్చు అని సూచనలిస్తారు.

<p>గ్యాస్ నొప్పి</p>
గ్యాస్ నొప్పి

Gastric Pain : ఛాతీలో నొప్పి అంటే గుండెపోటు అని అర్థం కాదు. ఒక్కోసారి గ్యాస్ వల్ల కూడా తీవ్రమైన నొప్పి కలుగుతుంది. లాక్టోస్ అసహనం, గ్లూటెన్ సెన్సిటివిటీ, చాలా కృత్రిమ స్వీటెనర్ ఆధారిత ఆహారాలు తినడం, ఎక్కువ కార్బోనేటేడ్ పానీయాలు లేదా కోలాలు, సోడాలు తాగడం వంటి ఇతర కారకాలు జీర్ణవ్యవస్థలో గణనీయమైన గ్యాస్‌ను కలిగిస్తాయి. దీనివల్ల దడ, తీవ్ర భయాందోళనలు కలుగుతాయని డాక్టర్ ధరోద్ వెల్లడించారు. మీరు ఛాతీ నొప్పి లేదా.. అసౌకర్యాన్ని అనుభవిస్తే.. మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. అయితే కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల గ్యాస్​ నొప్పినుంచి రిలీఫ్ పొందవచ్చని అంటున్నారు వైద్యులు. ఇంతకీ ఏమి ఆహారాలు మీ డైట్​లో చేర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. గోరువెచ్చని నీరు

గ్యాస్‌తో సహా అనేక సమస్యలను నివారించడానికి మీరు రోజంతా తగినంత నీరు తాగాలి. నీరు జీర్ణవ్యవస్థ ద్వారా అదనపు వాయువును బయటకు పంపడంలో సహాయపడుతుంది. గ్యాస్ నొప్పి, అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. వెచ్చని నీరు లేదా హెర్బల్ టీలు చాలా విశ్రాంతిని కలిగిస్తాయి. కొబ్బరి నీరు, సోంపు వాటర్ మీకు చాలా రిలీఫ్ ఇస్తుంది.

2. అల్లం

గ్యాస్ వంటి జీర్ణ సమస్యలకు సహాయపడే మరొక ఇంటి నివారణ అల్లం. అల్లం టీ తాగండి. మీరు కచ్చితంగా తేడాను గమనిస్తారు. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు గ్యాస్, యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. దీన్ని సూప్‌లు, సబ్జీలు, కూరల్లో కూడా వేసుకోవచ్చు. గ్యాస్ పైన్​ నుంచి తక్షణ ఉపశమనం కోసం ఒక కప్పు అల్లం టీ తాగడం ఉత్తమ మార్గం.

3. గ్లూటెన్, పాల ఉత్పత్తులను మానేయండి..

మీ ఛాతీలో గ్యాస్ నొప్పిని గమనించినట్లయితే.. కార్బోనేటేడ్ పానీయాలు, సోడాలు, పాలు, పాల ఉత్పత్తులు, గ్లూటెన్‌ల పదార్థాలకు దూరంగా ఉండేలా చూసుకోండి.

4. ప్రతిరోజూ వ్యాయామం చేయండి

శారీరకంగా చురుకుగా ఉండటం జీర్ణ ఆరోగ్యానికి కీలకం. వాకింగ్, స్విమ్మింగ్, యోగా, లేదా ఏదైనా ఇతర వ్యాయామ పద్ధతిలో మీరు గ్యాస్‌ సమస్యను తగ్గించుకోవచ్చు. ఇవి మీ ఛాతీ నొప్పిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

5. సే నో టూ మసాలా

ఎసిడిటీ, గ్యాస్ సాధారణంగా మసాలా, నూనె లేదా కలుషితమైన ఆహారాన్ని తినడం వల్ల కలుగుతాయి. కాబట్టి.. మీరు గ్యాస్‌ సమస్యకు దూరంగా ఉండాలనుకుంటే.. మసాల, నూనె వంటలకు బాయ్ చెప్పేయండి. బదులుగా మీ ఆహారంలో ఓట్స్, కిచ్డీ, ఆకుకూరలు, విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు, గింజలు, గుడ్డులోని తెల్లసొనను చేర్చుకోవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం