Detoxing Tips | ఉదయాన్నే జీర్ణవ్యవస్థ ఇలా శుభ్రం!-detoxing tips for stomach health ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Detoxing Tips For Stomach Health

Detoxing Tips | ఉదయాన్నే జీర్ణవ్యవస్థ ఇలా శుభ్రం!

Feb 28, 2022, 08:49 PM IST HT Telugu Desk
Feb 28, 2022, 08:49 PM , IST

  • రాత్రి విందు-వినోదాల్లో మునిగిపోయి పసందైన భోజనాన్ని బాగా లాగించేశారా? కడుపు ఉబ్బిపోయినట్లు అనిపిస్తుందా? అయితే మీ జీర్ణవ్యవస్థను రీసెట్ చేయడానికి ఇక్కడ కొన్ని నివారణలు ఉన్నాయి.

Lemonade: నిమ్మకాయ నీటిని తాగతే అది మీ శరీరానికి సహజమైన ఎలక్ట్రోలైట్‌లను అందిస్తుంది. దీనికి కొద్దిగా పుదీనా కూడా కలుపుకుంటే దాని చల్లదనంతో కడుపు మంటను తగ్గిస్తుంది. రాత్రి చేసుకున్న విందుతో ఉదయం దిమ్మ తిరుగుతుంటే ఇలాంటి ఒక జ్యూస్ తాగితే తలనొప్పి, వికారం తగ్గుతుంది. ప్రతిరోజూ తాగితే బరువును నియంత్రించుకోవచ్చు.

(1 / 6)

Lemonade: నిమ్మకాయ నీటిని తాగతే అది మీ శరీరానికి సహజమైన ఎలక్ట్రోలైట్‌లను అందిస్తుంది. దీనికి కొద్దిగా పుదీనా కూడా కలుపుకుంటే దాని చల్లదనంతో కడుపు మంటను తగ్గిస్తుంది. రాత్రి చేసుకున్న విందుతో ఉదయం దిమ్మ తిరుగుతుంటే ఇలాంటి ఒక జ్యూస్ తాగితే తలనొప్పి, వికారం తగ్గుతుంది. ప్రతిరోజూ తాగితే బరువును నియంత్రించుకోవచ్చు.(Pixabay)

Triphala Juice : రోజూ ఉదయాన్నే ఉసిరి, కరక్కాయ, వాకకాయలతో చేసిన త్రిఫల రసాన్ని తీసుకుంటే అది జీర్ణవ్యవస్థపై అద్భుతంగా పనిచేస్తుంది. కడుపు శుభ్రం అవుతుంది, మలబద్ధం లాంటి సమస్యలు ఉండవు. శరీరం లోపల వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.

(2 / 6)

Triphala Juice : రోజూ ఉదయాన్నే ఉసిరి, కరక్కాయ, వాకకాయలతో చేసిన త్రిఫల రసాన్ని తీసుకుంటే అది జీర్ణవ్యవస్థపై అద్భుతంగా పనిచేస్తుంది. కడుపు శుభ్రం అవుతుంది, మలబద్ధం లాంటి సమస్యలు ఉండవు. శరీరం లోపల వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.(Pinterest)

విందులో అధికంగా జంక్ ఫుడ్, ఆల్కాహాల్ తీసుకున్నట్లయితే శరీరం నిర్జలీకరణ (డీహైడ్రేషన్)కు గురవుతుంది. కాబట్టి శరీరంలోని వివిధ అవయవాల్లో పేరుకు పోయిన టాక్సిన్లను బటకు పంపాలంటే మంచి నీటికి మించింది మరొకటి లేదు. కాబట్టి శుద్ధమైన మంచినీరు సమృద్ధిగా తీసుకుంటూ ఉండాలి. కొబ్బరి నీళ్లు కూడా తీసుకున్నా మంచిదే.

(3 / 6)

విందులో అధికంగా జంక్ ఫుడ్, ఆల్కాహాల్ తీసుకున్నట్లయితే శరీరం నిర్జలీకరణ (డీహైడ్రేషన్)కు గురవుతుంది. కాబట్టి శరీరంలోని వివిధ అవయవాల్లో పేరుకు పోయిన టాక్సిన్లను బటకు పంపాలంటే మంచి నీటికి మించింది మరొకటి లేదు. కాబట్టి శుద్ధమైన మంచినీరు సమృద్ధిగా తీసుకుంటూ ఉండాలి. కొబ్బరి నీళ్లు కూడా తీసుకున్నా మంచిదే.(Pixabay)

విందులో భారీగా తిన్న తర్వాత జీర్ణవ్యవస్థకు కొంచెం గ్యాప్ అవసరం. అలాగని ఏం తినకుండా ఉండాలని చెప్పడం లేదు. ఆ తినేదేదో కొద్దికొద్దిగా తినాలి, అది మంచి పోషకాహారం అయి ఉండి తేలికగా జీర్ణం కావాలి. కిచిడీ, గంజి, సూప్‌ల లాంటివి తీసుకుంటే తేలిగా ఉంటాయి. మంచి శక్తి శరీరానికి అందుతుంది.

(4 / 6)

విందులో భారీగా తిన్న తర్వాత జీర్ణవ్యవస్థకు కొంచెం గ్యాప్ అవసరం. అలాగని ఏం తినకుండా ఉండాలని చెప్పడం లేదు. ఆ తినేదేదో కొద్దికొద్దిగా తినాలి, అది మంచి పోషకాహారం అయి ఉండి తేలికగా జీర్ణం కావాలి. కిచిడీ, గంజి, సూప్‌ల లాంటివి తీసుకుంటే తేలిగా ఉంటాయి. మంచి శక్తి శరీరానికి అందుతుంది.(Pinterest)

మంచి మసాలాలతో మీ కడుపును నింపితే ఆ మంటను తగ్గించడానికి యాంటీఆక్సిడెంట్లు అవసరం. ఆకుకూరల్లో ఇవి పుష్కలంగా ఉంటాయి, అలాగే తేలికగా జీర్ణమవుతాయి. కాబట్టి కడుపు ఉబ్బరాన్ని తగ్గించటాని, జీర్ణాశయ పేరులను శుభ్రం చేసేందుకు 'క్రూసిఫెరస్' సమ్మేళనం కలిగిన ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవాలి.

(5 / 6)

మంచి మసాలాలతో మీ కడుపును నింపితే ఆ మంటను తగ్గించడానికి యాంటీఆక్సిడెంట్లు అవసరం. ఆకుకూరల్లో ఇవి పుష్కలంగా ఉంటాయి, అలాగే తేలికగా జీర్ణమవుతాయి. కాబట్టి కడుపు ఉబ్బరాన్ని తగ్గించటాని, జీర్ణాశయ పేరులను శుభ్రం చేసేందుకు 'క్రూసిఫెరస్' సమ్మేళనం కలిగిన ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవాలి.(Pixabay)

ఇక చివరగా చెప్పేది, అందరికీ తెలిసిందే. మన శరీరంలో చేరిన ఆ అదనపు కేలరీలను తగ్గించుకోవాలంటే, మీ ఫిట్‌నెస్ కాపాడుకోవాలంటే వ్యాయామాలు చేయాల్సిందే.

(6 / 6)

ఇక చివరగా చెప్పేది, అందరికీ తెలిసిందే. మన శరీరంలో చేరిన ఆ అదనపు కేలరీలను తగ్గించుకోవాలంటే, మీ ఫిట్‌నెస్ కాపాడుకోవాలంటే వ్యాయామాలు చేయాల్సిందే.(Pixabay)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు