Apple Cider Vinegar : వర్షాకాలంలో అజీర్ణ సమస్యలా? అయితే ఇవి ట్రై చేయండి..-apple cider vinegar benefits for good digestion in rainy season ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Apple Cider Vinegar Benefits For Good Digestion In Rainy Season

Apple Cider Vinegar : వర్షాకాలంలో అజీర్ణ సమస్యలా? అయితే ఇవి ట్రై చేయండి..

Jul 16, 2022, 03:34 PM IST Geddam Vijaya Madhuri
Jul 16, 2022, 03:34 PM , IST

  • వర్షాకాలంలో అజీర్ణం అనేది ఒక సాధారణ సమస్య. అయితే దీన్ని నిర్లక్ష్యం చేయకుండా.. ఇంటి నివారణలతో చికిత్స చేసుకోవాలి అంటున్నారు పోషకాహార నిపుణులు. యాపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించి.. ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు అంటున్నారు.

అజీర్ణం అనేది చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్య. వేయించిన లేదా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం వల్ల.. జీర్ణ సమస్యలు తప్పవు. కడుపు నొప్పి సమస్యలు వస్తాయి. అయితే పోషకాహార నిపుణులు అజీర్తిని ఎదుర్కోవటానికి కొన్ని రోజువారీ చిట్కాలను సూచిస్తున్నారు. అయితే మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతుంటే.. ఈ చిట్కాలు ట్రై చేయండి.

(1 / 7)

అజీర్ణం అనేది చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్య. వేయించిన లేదా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం వల్ల.. జీర్ణ సమస్యలు తప్పవు. కడుపు నొప్పి సమస్యలు వస్తాయి. అయితే పోషకాహార నిపుణులు అజీర్తిని ఎదుర్కోవటానికి కొన్ని రోజువారీ చిట్కాలను సూచిస్తున్నారు. అయితే మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతుంటే.. ఈ చిట్కాలు ట్రై చేయండి.(Unsplash)

న్యూట్రిషనిస్ట్ అంజలి ముఖర్జీ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ద్వారా యాపిల్ సైడర్ గురించి ఓ పోస్ట్‌ చేసింది. అందులో అజీర్ణానికి ఉత్తమ నివారణలలో ఒకటిగా ఆపిల్ సైడర్ వెనిగర్‌ తీసుకోవాలని సూచించారు. పులియబెట్టిన యాపిల్ జ్యూస్ నుంచి తయారైన ఆపిల్ సైడర్ వెనిగర్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుందని వెల్లడించారు.

(2 / 7)

న్యూట్రిషనిస్ట్ అంజలి ముఖర్జీ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ద్వారా యాపిల్ సైడర్ గురించి ఓ పోస్ట్‌ చేసింది. అందులో అజీర్ణానికి ఉత్తమ నివారణలలో ఒకటిగా ఆపిల్ సైడర్ వెనిగర్‌ తీసుకోవాలని సూచించారు. పులియబెట్టిన యాపిల్ జ్యూస్ నుంచి తయారైన ఆపిల్ సైడర్ వెనిగర్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుందని వెల్లడించారు.(Unsplash)

యాపిల్ సైడర్ వెనిగర్ యాంటీఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది వివిధ పరిస్థితులతో పోరాడటానికి సహాయపడుతుంది.

(3 / 7)

యాపిల్ సైడర్ వెనిగర్ యాంటీఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది వివిధ పరిస్థితులతో పోరాడటానికి సహాయపడుతుంది.(Unsplash)

యాపిల్ సైడర్ వెనిగర్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గిస్తుంది. కానీ ముఖ్యంగా ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

(4 / 7)

యాపిల్ సైడర్ వెనిగర్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గిస్తుంది. కానీ ముఖ్యంగా ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.(Unsplash)

యాపిల్ సైడర్ వెనిగర్ శరీరాన్ని మెరుగ్గా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. మంచి మినరల్స్‌ను గ్రహించడంలో శరీరానికి సహాయం చేస్తుంది.

(5 / 7)

యాపిల్ సైడర్ వెనిగర్ శరీరాన్ని మెరుగ్గా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. మంచి మినరల్స్‌ను గ్రహించడంలో శరీరానికి సహాయం చేస్తుంది.(Unsplash)

ఆపిల్ సైడర్ వెనిగర్ మరింత పిత్తాన్ని ఉత్పత్తి చేయడానికి గాల్ బ్లాడర్‌ను ప్రేరేపించి.. జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

(6 / 7)

ఆపిల్ సైడర్ వెనిగర్ మరింత పిత్తాన్ని ఉత్పత్తి చేయడానికి గాల్ బ్లాడర్‌ను ప్రేరేపించి.. జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.(Unsplash)

యాపిల్ సైడర్ వెనిగర్ మరింత ప్యాంక్రియాటిక్ ఎంజైమ్‌లను విడుదల చేస్తుంది. ఇది శరీరంలో ప్యాంక్రియాస్‌ను ప్రేరేపించి.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

(7 / 7)

యాపిల్ సైడర్ వెనిగర్ మరింత ప్యాంక్రియాటిక్ ఎంజైమ్‌లను విడుదల చేస్తుంది. ఇది శరీరంలో ప్యాంక్రియాస్‌ను ప్రేరేపించి.. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.(Unsplash)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు