Body Aches Reasons : నిద్ర లేచిన తర్వాత శరీరంలో నొప్పులు ఎందుకు వస్తాయి?-why you feel body aches after waking up all you need to know ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Body Aches Reasons : నిద్ర లేచిన తర్వాత శరీరంలో నొప్పులు ఎందుకు వస్తాయి?

Body Aches Reasons : నిద్ర లేచిన తర్వాత శరీరంలో నొప్పులు ఎందుకు వస్తాయి?

Anand Sai HT Telugu
Nov 26, 2023 11:00 AM IST

Body Aches Reasons : కొంతమందికి నిద్రలేచిన తర్వాత శరీరంలో నొప్పి వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? దానికి కారణాలు ఏంటి? ఇక్కడ చూడవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

కొంతమందికి నిద్రలేవగానే శరీరంలోని కొన్ని భాగాల్లో నొప్పి వస్తుంది. మీకు కండరాల నొప్పులు, తీవ్రమైన తలనొప్పి లేదా శరీర నొప్పులు అనిపించినప్పుడు ఏ పని చేయకండి. నిద్రలేచిన తర్వాత నొప్పికి అనేక కారణాలు ఉన్నాయి. వీటిలో నిద్ర రుగ్మతలు, అంతర్లీన ఆరోగ్య సమస్యలు కూడా కారణంగా ఉంటాయి. నిద్రలేవగానే నొప్పులు ఎందుకు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

హైపోకాల్సెమియా, లేదా తక్కువ కాల్షియం, మీ శరీరంలో తగినంత విటమిన్ డి లేనప్పుడు నొప్పి సంభవిస్తుంది. మీ శరీరంలోని మీ మూత్రపిండాలు, కండరాలు వంటి అనేక ముఖ్యమైన అవయవాలు సరిగ్గా పనిచేయడానికి కాల్షియం అవసరం. మీ ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి కాల్షియం కూడా ముఖ్యం. కాల్షియం గ్రహించడానికి మీకు తగినంత విటమిన్ డి అవసరం. ఈ విటమిన్ లోపం ఈ అవయవాలు, మీ ఎముకలలో నొప్పిని కలిగిస్తుంది.

మీ శరీరంలోని ఎర్ర రక్త కణాలు సరిగా పనిచేయనప్పుడు రక్తహీనత ఏర్పడుతుంది. మీ శరీర కణజాలాలకు తగినంత ఆక్సిజన్ అందదు. రక్తహీనత మీ శరీరంలోని అనేక భాగాలను బలహీనపరుస్తుంది. ఆరోగ్యంగా ఉండటానికి లేదా సరిగ్గా పనిచేయడానికి తగినంత ఆక్సిజన్ పొందరు.

రక్తహీనత ఇతర లక్షణాలు లక్షణాలు అలసట, అసాధారణ హృదయ స్పందన, మైకము లేదా తలనొప్పి లేదా ఛాతీ నొప్పి వంటివి కలుగుతూ ఉంటాయి.

అధిక బరువు మీ వెనుక, మెడపై ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది నొప్పికి కారణమవుతుంది. అధిక బరువు నిద్ర, శ్వాస సమస్యలకు దారితీస్తుంది. ఇది నిద్ర నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మేల్కొన్న తర్వాత నొప్పులు వస్తాయి. అందువల్ల, బరువు తగ్గడం మీ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.

నాసిరకం పరుపుపై ​​పడుకోవడం శరీర నొప్పికి ప్రధాన కారణాలలో ఒకటి. అందుకే మీరు ఎంచుకునే పరుపు కూడా నిద్రకు చాలా ముఖ్యం. సరైన పరుపును కొనుక్కోండి.

మీరు నిద్రించే భంగిమ కూడా శారీరక నొప్పిని కలిగిస్తుంది. సైడ్ స్లీపింగ్ సాధారణంగా చాలా మందికి ఉత్తమమైనది. ముఖ్యంగా స్లీప్ అప్నియా వంటి స్లీప్ డిజార్డర్స్ ఉన్నవారికి ఉపయోగపడుతుంది. కొంతమంది చేతిని శరీరం కింద పెట్టి అలాగే రాత్రంతా నిద్రపోతారు. ఈ కారణంగా చేయి నొప్పి వస్తుంటుంది. నిద్రపోయే పొజిషన్ కూడా మీ బాడీ పెయిన్స్ కూ కారణమవుతుంది.

Whats_app_banner