చలికాలంలో గొంతు నొప్పి సమస్య వస్తూ ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం గొంతు నొప్పి కఫా, వాత అసమతుల్యత ఫలితంగా ఉంటుంది. శీతాకాలంలో గొంతు నొప్పిని నయం చేసేందుకు ఆయుర్వేద నివారణలు ఉన్నాయి.
Unsplash
By Anand Sai Nov 25, 2023
Hindustan Times Telugu
సూప్‌లు, ఉడకబెట్టిన పులుసు వంటి వెచ్చని, వండిన ఆహారాన్ని తినండి. అల్లం, పసుపు, నల్ల మిరియాలు, దాల్చినచెక్క వంటి సుగంధ ద్రవ్యాలు తీసుకోవచ్చు.
Unsplash
అల్లం లేదా తులసితో చేసిన హెర్బల్ టీలు గొంతు నొప్పిని తగ్గిస్తాయి. గొంతులో మంటను తగ్గించడంలో సహాయపడతాయి.
Unsplash
శీతల పానీయాలు, పాల ఉత్పత్తులు కఫాన్ని పెంచుతాయి. వాటి వినియోగాన్ని తగ్గించాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు.
Unsplash
చల్లని గాలికి వెళ్లకూడదు. వెచ్చని దుస్తులు ధరించండి. ముఖ్యంగా మెడ చుట్టూ వెచ్చని బట్టలు ధరించండి.
Unsplash
నీటిని వేడి చేయండి. అందులో ఉప్పు కలిపి పుక్కిలించడం వల్ల వాపు, అసౌకర్యం తగ్గుతాయి.
Unsplash
పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలిపి తాగడం మంచిది.
Unsplash
గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగడం వల్ల గొంతు మంట తగ్గుతుంది. గొంతు నొప్పి నుంచి కూడా బయటపడొచ్చు.
Unsplash
వర్షాకాలానికి అనుగుణంగా డైట్ మార్చుకుంటే రకరకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.