టార్గెట్ల కాలంలో పని ఒత్తిడి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. సవాళ్ల కూడిన ఉద్యోగాల్లో ఒత్తిడి దీర్ఘకాలికంగా ఉంటుంది. పని ఒత్తిడి ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావితం చూపిస్తుంది.
unsplash
By Bandaru Satyaprasad Nov 25, 2023
Hindustan Times Telugu
పని ఒత్తిడి దీర్ఘకాలికంగా ఉంటే మీ శరీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇటీవలి ఓ పరిశోధనలో పని సంబంధిత బర్న్‌అవుట్, నిరాశ, ఆందోళన మధ్య సంబంధాన్ని సూచిస్తుంది.
unsplash
ఒత్తిడికి సంకేతాలు- అలసట, తలనొప్పి, నిద్రలేమి, ఆకలిలో మార్పులు, జీర్ణ సమస్యలు, హార్ట్ బీట్ పెరగడం, చెమటలు పట్టడం, తక్కువ ఆత్మగౌరవం, సెక్స్ డ్రైవ్ కోల్పోవడం, తరచుగా అనారోగ్యాలు
unsplash
మీ ఒత్తిడికి కారణాలను గుర్తించి, వాటిని పేపర్ పై రాసుకోండి. ఇలా చేయడంతో ఏ అంశాలు మీ ఒత్తిడికి కారణమో తెలుస్తుంది. అసౌకర్యమైన వర్క్ ప్లేస్, ఎక్కువ కాలం ఒకే పనిచేయడం పని ఒత్తిడికి కారణాలు కావొచ్చు.
unsplash
మీ ఒత్తిడిని ట్రిగ్గర్ చేసి వాటిని ఒక వారం పాటు నమోదు చేసుకుండి. మీకు శారీరక, మానసిక లేదా భావోద్వేగ స్పందనకు కారణమైన వ్యక్తులు, ప్రదేశాలు, ఈవెంట్‌లను రికార్డు చేసుకోండి.
unsplash
మీ ఒత్తిడికి కారణాలు నమోదు చేసుకున్నప్పుడు మిమల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒత్తిడితో నాకు భయం, కోపం, బాధ కలిగాయా? వాటిపై నా స్పందన ఏమిటి? అనే విషయాలను ప్రశ్నించుకోండి.
unsplash
ఒత్తిడిని అధిగమించడానికి మార్గాలను మీకు మీరే ఎంచుకోండి. రీఛార్జ్ అవ్వడానికి సమయాన్ని కేటాయించుకోండి. బిజీగా ఉన్న రోజులో కొన్ని నిమిషాల పాటు వ్యక్తిగత సమయాన్ని గడపడంతో బర్న్‌అవుట్‌ను నివారించవచ్చు.
unsplash
ఆసక్తికరమైన పాడ్‌కాస్ట్ వినడం లేదా ఫన్నీ Youtube వీడియోలను చూడటం వలన ఒత్తిడి నుంచి కాస్త విశ్రాంతిని పొందవచ్చు.
unsplash
సెలవు సమయంలో పనికి సంబంధించిన ఈ-మెయిల్‌లను తనిఖీ చేయకుండా ఉండడం, మీ ఫోన్ నుంచి దూరంగా ఉండడం, మీ ఉద్యోగం గురించి ఆలోచించకుండా విరామం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.
unsplash
మీ వర్క్, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేయడం చాలా ముఖ్యం. విరామ సమయాల్లో కుటుంబం, స్నేహితులతో గడపడానికి ప్రాధాన్యత ఇవ్వండి.
unsplash
మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి, వర్క్ అవుట్స్, పుస్తకాలు చదవడం, యోగా, పిల్లలతో ఆడుకోవడంతో పని ఒత్తిడిని అధిగమించవచ్చు.
unsplash
ఆఫీసు గాసిప్ ల నుంచి దూరంగా ఉండండి. ఇది మీ మానసిక శ్రేయస్సుకు చాలా మంచిది. మీ సహోద్యోగులు ఎక్కువగా గాసిప్ లు చెబుతుంటే... ఆ సంభాషణను మార్చేందుకు ప్రయత్నించండి.
unsplash
చలికాలంలో మైగ్రేన్ సమస్య పెరిగిందా? ఇలా తగ్గించండి..