Intermittent Fasting : ఇలా ఉపవాసం ఉండండి.. బరువు తగ్గుతారు
intermittent fasting Rules : బరువు తగ్గేందుకు చాలా దారులు వెతుక్కుంటున్నారు జనాలు. అందులో ఒకటి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్(అప్పుడప్పుడు ఉపవాసం లేదా అడపాదడపా ఉపవాసం). దీని ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కొన్ని నియమాలు పాటించాలి.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్(intermittent fasting) అనేది ప్రత్యేకంగా మీ భోజనం కోసం సమయాన్ని సెట్ చేస్తుంది. ఇది బరువు తగ్గడంలో(Weight Loss) సహాయపడుతుంది. ఈ ఉపవాసం అనేది బరువు తగ్గడం కోసం చాలా మంది పాటిస్తున్నారు. దీనిని ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. ఈ డైట్ ప్రకారం కేలరీలు ఎక్కువగా తీసుకోకుండా ఉండాలి. పానీయాలు ఎక్కువగా తీసుకోవాలి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటి అంటే.. అల్పాహారం నుంచి అల్పాహారం వరకూ లేదా లంచ్ నుంచి లంచ్ వరకూ ఉపవాసం చేయెుచ్చు. అయితే కొందరు బ్రేక్ ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకూ ఫాస్టింగ్ చేస్తుంటారు. మీ శరీరాన్ని బట్టి ఈ ఉపవాసం ఎంచుకోవచ్చు. వారంలో ఒక్కరోజైనా ఇలా చేస్తే ఫలితం ఉంటుంది. కొత్తగా ట్రై చేసేవారు డాక్టర్‌ను సంప్రదించాలి.
ఇంటర్మిటెంట్ ఉపవాసం తినడం మధ్య గ్యాప్ క్రియేట్ చేస్తుంది. ఇది బరువు తగ్గడానికి, జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, మీ ఆహారాన్ని సులభతరం చేయడానికి ఉపయోగపడుతుంది. అడపాదడపా ఉపవాసంతో కొసం కొన్ని చిట్కాలు ఉన్నాయి.
మీరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడం కొత్త అయితే, క్రమంగా దాన్ని తగ్గించుకోవడం ఉత్తమం. 10 లేదా 12 గంటల వంటి చిన్న ఉపవాసాలతో ప్రారంభించండి. కాలక్రమేణా వాటిని క్రమంగా పెంచండి. ఈ విధానం మీ శరీరాన్ని నిరసంగా కాకుండా చూస్తుంది. తర్వాత ఉపవాస సమయాన్ని పెంచేందుకు ఉపయోగపడుతుంది. దీనికోసం కొన్ని చిట్కాలు పాటించాలి.
మీ భోజనాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవడం వల్ల మీరు మీ ఉపవాస షెడ్యూల్‌కు కట్టుబడి ఉండవచ్చు. మీరు తినే సమయంలో మీరు తీసుకునే భోజనాన్ని నిర్ణయించండి. వాటిని ముందుగానే సిద్ధం చేయండి. ఆరోగ్యకరమైన, సమతుల్య భోజనం తక్షణమే అందుబాటులో ఉండటం వలన ఆరోగ్యంగా ఉండొచ్చు. ముందుగానే రెండు మూడు భోజనాలు రెడీ చేసుకోండి.
మీ ఉపవాస సమయంలో తగినంత నీరు తాగడం(Drinking Water) చాలా అవసరం. ఇది ఆకలిని అరికట్టడంలో సహాయపడటమే కాకుండా మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. మొత్తం శ్రేయస్సుకు మద్దతు ఇస్తుంది. మిమ్మల్ని మీరు హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి, ఆకలి కోరికలను తగ్గించుకునేందుకు హెర్బల్ టీలు, బ్లాక్ కాఫీ లేదా సాధారణ నీటిని తాగండి.
ఆహారం గురించిన ఆలోచనల నుండి మిమ్మల్ని మీరు మరల్చుకోవాలి. ఇది ఉపవాసాన్ని మరింత నిర్వహించగలిగేలా చేస్తుంది. మిమ్మల్ని ఏదో ఒక విషయం నిమగ్నమై ఉంచుతుంది. సో.. వాటి మీద మీ దృష్టి పెట్టాలి. వ్యాయామం, పని, అభిరుచులు, చదవడం లేదా స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడపడం వంటివి మీ మనస్సును ఆహారం నుండి దూరంగా ఉంచడానికి గొప్ప మార్గాలు.
ఏ విషయంలోనై మనిషికి మద్దతు అనేది చాలా అవసరం. అందుకే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, మీ లక్ష్యాలను స్నేహితులు, కుటుంబ సభ్యులు, లేదంటే ఈ డైట్ పాటించేవారితో పంచుకోండి. వారి మార్గదర్శకత్వం, ప్రేరణ మీకు మోటివేషన్ ఇస్తాయి. తద్వారా మీరు ఉపవాసం ఉండేందుకు సాయపడుతుంది.
ఏదైనా కొత్త ఆహారం, ఉపవాస నియమాన్ని ప్రారంభించే ముందు ఆరోగ్య నిపుణులను సంప్రదించడం చాలా అవసరం. ప్రత్యేకించి మీకు ఆరోగ్య సమస్యలు ఉంటే కచ్చితంగా నిపుణులతో మాట్లాడాలి. స్థిరంగా ఉండి బరువు తగ్గడానికి ప్రయత్నించండి. అయితే కేవలం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మాత్రమే బరువు తగ్గడానికి సహాయం చేయదని గమనించాలి. జీవనశైలి మార్పులు(Lifestyle Changes), ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామాలు చేస్తేనే బరువు తగ్గుతారు.