బరువు తగ్గేందుకు చేసే డైట్ లలో వాటర్ ఫాస్టింగ్ ఒకటి. ఈ నీటి ఉపవాసం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మరికొన్ని దుష్ర్పభావాలు కూడా ఉంటాయి.
Unsplash
By Anand Sai Dec 02, 2023
Hindustan Times Telugu
నీటి ఉపవాస సమయంలో ఒక వ్యక్తి నీరు తప్ప మరేదైనా తినడు లేదా తాగడు. ఈ ఉపవాస సమయంలో నీరు మాత్రమే తాగుతారు.
Unsplash
ఈ ఉపవాసం సాధారణంగా 24 నుండి 72 గంటల వరకు ఉంటుంది. బరువు తగ్గడానికి ఇది ప్రభావవంతమైన మార్గంగా పరిగణిస్తారు. ఈ ఫాస్ట్‌ని ఎక్కువగా పాటిస్తున్నారు. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. కొవ్వు తగ్గడం వల్ల బరువును కూడా తగ్గిస్తుంది.
Unsplash
నీటి ఉపవాసం మన కణాలను రీసైకిల్ చేయడానికి లేదా క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమయ్యే దెబ్బతిన్న భాగాలను తొలగించడంలో సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
Unsplash
కేలరీల కొరత కారణంగా మన శరీరం నీటి ఉపవాసం సమయంలో శక్తి కోసం నిల్వ చేసిన కొవ్వును ఉపయోగిస్తుంది. ఈ కారణంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దీని వల్ల మీరు అకస్మాత్తుగా బరువు కోల్పోతారు.
Unsplash
వాటర్ ఫాస్టింగ్‍తో ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే తగ్గిన బరువు తర్వాత ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఈ ఉపవాస సమయంలో కొవ్వుతో పాటు కండరాలు కూడా బలహీనపడతాయి.
Unsplash
నీరు మాత్రమే తాగడం వల్ల శరీరంలో శక్తి లోపించి అలసట, తల తిరగడం వంటి సమస్యలు వస్తాయి. నీరు మాత్రమే తాగడం, ఏమీ తినకపోవడం మంచిది కాదు.
Unsplash
బరువు తగ్గేందుకు చిట్కాలు పాటించే ముందు నిపుణులను సంప్రదించడం మంచిది. లేదంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
Unsplash
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి