Vrat Alu Puri: ఈ పిండితో పూరీలు, ఆలూ కర్రీ చేయండి.. ఉపవాసం రోజు కూడా తినొచ్చు..
Vrat Alu Puri: ఉపవాసం రోజు తినడానికి ఆలూ కర్రీ, పూరీలు ఎలా తయారు చేసుకోవచ్చో వివరంగా, పక్కా కొలతలతో చూసేయండి. కడుపు నిండిపోతుంది.
రాజ్‌గిరా పూరీ, ఆలూ కర్రీ (flickr)
ఉపవాసం రోజు కూడా తినగలిగే అల్పాహారం ఏదైనా ఉందా అని చూస్తున్నారా? అయితే సులభంగా రాజ్‌గిరా పూరీ, వ్రత్ ఆలూ కర్రీ తయారు చేసుకోండి. పావుగంటలో సిద్ధమైపోతాయి. వాటి తయారీ ఎలాగో వివరంగా పక్కా కొలతలతో చూసేయండి.
1. రాజ్‌గిరా పూరీలు:
కావాల్సిన పదార్థాలు:
1 కప్పు రాజ్‌గిరా పిండి
1 బంగాళదుంప, ఉడకించింది
1 చెంచా నెయ్యి
తగినంత సైందవ లవణం
డీప్ ఫ్రై కి సరిపడా నూనె
తయారీ విధానం:
- ముందుగా నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
- కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పూరీల పిండిలాగా కాస్త గట్టిగానే కలుపుకోవాలి.
- చిన్న చిన్న ఉండలు చేసుకుని పూరీలు ఒత్తుకోవాలి.
- నూనె పెట్టుకుని వేడెక్కాక ఈ పూరీల్ని వేసుకుని రెండు వైపులా కాల్చుకోవడమే.
2. వ్రత్ ఆలూ:
కావాల్సిన పదార్థాలు:
పావు కేజీ బంగాళదుంపలు, ఉడికించుకోవాలి
2 టమాటాలు, ముక్కలు
3 పచ్చిమిర్చి, తరుగు
పావు టీస్పూన్ వాము
2 చెంచాల నూనె
తగినంత ఉప్పు లేదా సైందవ లవణం
తయారీ విధానం:
- ఒక ప్యాన్‌లో నూనె పోసుకుని వేడి చేసుకోవాలి. వేడెక్కాక జీలకర్ర వేసుకుని చిటపటలాడనివ్వాలి.
- పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని కలుపుకోవాలి. అందులో టమాటా ముక్కలు వేసుకుని బాగా కలియబెట్టాలి.
- ముక్కలు మెత్తబడ్డాక ఉడికించుకున్న బంగాళదుంపలను చేతితో మెదుపుకుని వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి.
- అందులో 1 కప్పు నీళ్లు పోసుకుని మూత పెట్టి మగ్గనివ్వాలి. కాస్త సైందవ లవణం కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లుకుని దించేసుకుంటే సరి.
టాపిక్