After Dinner Mistakes : రాత్రి భోజనం చేసిన తర్వాత మీరు చేసే 4 తప్పులివే.. ఇకపై వద్దొద్దు
After Dinner Mistakes In Telugu : భోజనం చేసిన వెంటనే కొందరు కొన్ని తప్పులు చేస్తుంటారు. తెలియకుండా చేసినా అవి మీ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. ఇంతకీ ఆ తప్పులు ఏంటి?
ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యకరమైన అలవాట్లు ఫాలో అవ్వాలి. అవి చాలా ముఖ్యమైనవి. ఆరోగ్యకరమైన ఆహారం మిమ్మల్ని శారీరకంగా చురుకుగా ఉంచడంలో అతిపెద్ద పాత్ర పోషిస్తుంది. ప్రస్తుత జీవనశైలి, ఆహారంతో ఫిట్‌గా ఉండటం ఒక సవాలుతో కూడుకున్న పని. చాలా మంది ప్రజలు బయట కొన్న ఆహారాన్ని తింటారు, దీని కారణంగా అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. ఎక్కువ నూనె, జిడ్డు పదార్థాలు, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉండే ప్రయత్నం ప్రారంభించాలి. ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోండి.
ఆహారం, జీవనశైలి పూర్తిగా బ్యాలెన్స్‌లో ఉన్నా ఎలా ఫిట్‌గా ఉండాలనేది ప్రశ్న. ఈ విషయంలో మనం తినే ఆహారాన్ని సరైన పద్ధతిలో ఉంచుకుని, తప్పులు చేయకుండా ఉంటే మనం ఎప్పటికీ ఫిట్‌గా ఉంటాం. రాత్రి భోజనం తర్వాత ఏ తప్పు చేయకపోతే 30 ఏళ్ల తర్వాత కూడా ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండగలరు.
ఈ రోజుల్లో చాలా మంది రాత్రి భోజన సమయంలో లేదా తర్వాత మొబైల్ లేదా టీవీ చూస్తున్నారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ పద్ధతి అస్సలు సరైనది కాదు. దీనివల్ల ఒత్తిడి హార్మోన్ స్థాయిలు పెరగడంతోపాటు రాత్రి నిద్ర సరిగా ఉండదు. రాత్రి భోజనం చేసిన తర్వాత స్క్రీన్ చూడకూడదు.
రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇదే అతి పెద్ద తప్పు. దీని కారణంగా, ఆహారం జీర్ణం కావడానికి ఎంజైమ్‌లు విడుదల కావు. వివిధ సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి భోజనం చేసిన వెంటనే నిద్రపోకండి. అవసరమైతే ఒక 100 అడుగులు నడవండి.
కొందరికి రాత్రి భోజనం తర్వాత మద్యం లేదా సిగరెట్ తాగడం అలవాటు ఉంటుంది. ఈ పద్ధతి కూడా చాలా సమస్యలు తెస్తుంది. దీని కారణంగా కడుపులో యాసిడ్ రిఫ్లెక్స్, గుండె మంట, అజీర్ణం వెంటనే సంభవించవచ్చు. ఇలా ఎక్కువ కాలం చేస్తే శరీరం వ్యాధుల కేంద్రంగా మారుతుంది.
ఫిట్ గా ఉండాలంటే డిన్నర్ తర్వాత కొద్దిసేపు నడవండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొంచెం అలసిపోయే పని అయినప్పటికీ, ఇది మీకు ప్రశాంతమైన నిద్రను ఇస్తుంది. మిమ్మల్ని ఫిట్‌గా ఉంచుతుంది. అందుకే తిన్న వెంటనే పైన చెప్పిన తప్పులు అస్సలు చేయకండి. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా చేయెుచ్చు.