Yoga Asanas For Skin : మెరిసే చర్మం కోసం 6 యోగాసనాలు-try these 6 yoga asanas that will help you get glowing skin details inside ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Try These 6 Yoga Asanas That Will Help You Get Glowing Skin Details Inside

Yoga Asanas For Skin : మెరిసే చర్మం కోసం 6 యోగాసనాలు

HT Telugu Desk HT Telugu
Mar 05, 2023 04:45 PM IST

Yoga Asanas For Skin : యోగా చేయడం మీ ఆరోగ్యానికి మాత్రమే కాదు.., మీ చర్మానికి, అందానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. యోగా చేయడం ద్వారా, మీరు శారీరకంగా దృఢంగా, ఆకర్షణీయంగా మారవచ్చు. మెరిసే చర్మాన్ని కూడా పొందవచ్చు.

యోగాసనాలు
యోగాసనాలు

స్త్రీ అయినా, పురుషుడైనా అందమైన, మెరిసే చర్మం(Skin) కలిగి ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్, ట్రీట్‌మెంట్స్ తీసుకుంటారు. అయితే ఇవి చాలా ఖరీదైనవి. అలాగే ఈ ఉత్పత్తులు కొందరి చర్మానికి హాని కలిగిస్తాయి. మీరు రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్, ట్రీట్‌మెంట్స్‌ని ప్రయత్నించి ఫలితం లేకపోతే... ఒకసారి కొన్ని యోగాసనాలను(Yoga Asanas) ప్రయత్నించవచ్చు. ఈ యోగాసనాలు మీ చర్మాన్ని యవ్వనంగా, మెరిసేలా చేయడమే కాకుండా చర్మాన్ని టోన్‌గా మారుస్తాయి. యోగా ఒత్తిడిని తగ్గిస్తుంది, శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. ఇది చర్మానికి కొత్త మెరుపును ఇస్తుంది. అందమైన చర్మాన్ని పొందడానికి ఏ యోగాసనాలు ఉపయోగపడతాయో ఇక్కడు తెలుసుకుందాం..

భుజంగాసనం

ఇది మీ ఛాతీని తెరిచినట్టుగా చెస్తుంది. శరీరం నుండి అలసటను తగ్గించడంలో సహాయపడుతుంది. దీనితో, మీ శరీరానికి అదనపు ఆక్సిజన్(Oxygen) అందుతుంది. శరీరంలో ఘనీభవించిన టాక్సిన్స్ బయటకు వస్తాయి. ఇది మీ చర్మాన్ని పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. స్త్రీ గర్భవతిగా ఉన్నట్లయితే లేదా మెడ, చేతులు మరియు కాళ్ళ వంటి అవయవాలలో గాయం ఉన్నట్లయితే ఈ ఆసనం చేయడం మానుకోండి. కీళ్ల నొప్పులతో బాధపడే రోగులు కూడా ఈ ఆసనం వేయకూడదు.

ఒంటె భంగిమ(ఉష్ట్రాసనం)

ఈ ఆసనం సమయంలో మీరు పూర్తిగా వెనుకకు వంగి ఉండాలి. ఇది మీ పక్కటెముకలకు మంచిది. మీ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది. మరింత శ్వాస తీసుకోవడం సహాయపడుతుంది. మీ మెదడు వరకు రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది. ఈ యోగాసన సాధన వల్ల జుట్టు రాలే సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఈ ఆసనం మీ శరీరం(Body)లోని హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. దీని కారణంగా శరీరంలో ఒత్తిడి తగ్గుతుంది. చర్మం మెరుస్తుంది.

మత్స్యాసనం

ఈ ఆసనం మీ గొంతు, నోటి కండరాలను టోన్ చేస్తుంది. ఇది మీ చర్మానికి ఒక రకమైన అద్భుత భంగిమ. ఇది చర్మాన్ని(Skin) గట్టిగా, మృదువుగా చేస్తుంది. థైరాయిడ్, పిట్యూటరీ గ్రంధి పనితీరుకు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ భంగిమ హార్మోన్లను సాధారణీకరించడంలో కూడా మీకు సహాయపడుతుంది. చర్మ సంబంధిత సమస్యలు(Skin Problems) ఏవైనా ఉంటే వైద్యుల సలహా మేరకు మాత్రమే ఈ ఆసనం వేయండి.

హలాసానా

ఈ ఆసనం సహాయంతో, మొత్తం శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. శరీరంలోని ప్రతి భాగానికి తగినంత పోషకాలు చేరుతాయి. నిద్రలేమి వంటి నిద్ర(Sleep) సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో కూడా ఈ ఆసనం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మనం బాగా నిద్రపోతే, ఒత్తిడి తక్కువగా ఉంటే మన చర్మం బాగుంటంది.

త్రికోనాసనం

ఈ ఆసనం మీ మనస్సు, శరీరాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. చేతులు, కాళ్ళను దృఢంగా, బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది మీ ఛాతీ, ఊపిరితిత్తులు, గుండెకు మంచిది. మీ శరీరం(Body)లోకి మరింత ఆక్సిజన్‌ను చేరేలా చేస్తుంది. ఇది మీకు ఫ్రెష్‌గా అనిపించేలా చేస్తుంది. ఈ ఆసనాన్ని రెండు వైపులా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా, మెరుస్తూ ఉంటుంది.

పవనముక్తాసనం

ఆసనం జీర్ణక్రియకు మంచిది. ఇది మీ నాడీ వ్యవస్థపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది అన్ని కండరాలను సడలించడంలో సహాయపడుతుంది. ఈ ఆసనం మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుంది. ఇది మచ్చలేని చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడుతుంది.

WhatsApp channel

టాపిక్