తెలుగు న్యూస్ / ఫోటో /
Skin Barrier Repair । చర్మంపై రక్షణ పొరను రక్షించండి.. వీటి వినియోగం తగ్గించండి!
- Skin Barrier Repair: చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి రకరకాల ట్రిక్స్ పాటిస్తూ ఉంటాం. కానీ చర్మం పైన ఉండే రక్షణ త్వచం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
- Skin Barrier Repair: చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి రకరకాల ట్రిక్స్ పాటిస్తూ ఉంటాం. కానీ చర్మం పైన ఉండే రక్షణ త్వచం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
(1 / 6)
చర్మం మన అన్ని అవయవాలను కప్పి ఉంచుతుంది, వాటిని సరిగ్గా రక్షిస్తుంది. దుమ్ము, మురికి మొదలైన బాహ్య కారకాలు లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటుంది. ఇందుకు చర్మంపై ప్రత్యేక రక్షణ ఉంటుంది. దీనిని ఎపిడెర్మిస్ లేదా చర్మ త్వచంగా పిలుస్తారు. (Unsplash)
(2 / 6)
కాస్మొటిక్స్, సౌందర్య సాధనాల వాడకం వల్ల చర్మం పొర దెబ్బతింటుంది. దీంతో ఇన్ఫెక్షన్ రేట్లు పెరుగుతాయి. ఇది తీవ్రమైన వ్యాధులకు కూడా కారణమవుతుంది(Unsplash)
(3 / 6)
చర్మంపై త్వచం దెబ్బతిన్నపుడు చర్మం పొడిబారడం, పగుళ్లు ఏర్పడటం జరుగుతుంది. కాబట్టి చర్మ పైపొర దెబ్బతినకుండా తేమగా ఉంచడం, నూనె రాయడం చేయాలి. (Unsplash)
(4 / 6)
సౌందర్య ఉత్పత్తుల అధిక వినియోగం చర్మం సహజ నిర్మాణాన్ని ప్రభావితం చేస్తుంది. చర్మ త్వచం ఎక్కువగా ప్రభావితమవుతుంది. కాబట్టి సౌందర్య సాధనాల వినియోగాన్ని తగ్గించాలి(Unsplash)
(5 / 6)
పాడైన చర్మ త్వచాన్ని సరిచేయడం కూడా చాలా ముఖ్యం. హైలురోనిక్ యాసిడ్ సీరం లేదా వెజిటెబుల్ ఆయిల్ చర్మం బయటి పొరను నయం చేస్తుంది. విటమిన్ సి సీరమ్ కూడా చర్మానికి చాలా మేలు చేస్తుంది(Pixabay)
ఇతర గ్యాలరీలు