Sushmita Sen health update: నాకొచ్చింది తీవ్రమైన గుండెపోటు.. అదృష్టవంతురాలినే.. సుస్మితా సేన్ స్పష్టం-sushmita sen shares video about her health update said it was massive heart attack ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Sushmita Sen Shares Video About Her Health Update Said It Was Massive Heart Attack

Sushmita Sen health update: నాకొచ్చింది తీవ్రమైన గుండెపోటు.. అదృష్టవంతురాలినే.. సుస్మితా సేన్ స్పష్టం

సుస్మితా సేన్
సుస్మితా సేన్ (PTI)

Sushmita Sen health update: బాలీవుడ్ నటి సుస్మితా సేన్‌కు ఇటీవలే గుండెపోటు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తన ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియా వేదికగా వీడియోను షేర్ చేసింది. తనకు తీవ్రమైన హార్ట్ ఎటాక్ వచ్చినట్లు పేర్కొంది.

Sushmita Sen health update: బాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ ఇటీవలే గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేసిన ఆమె.. తాజాగా తన ఆరోగ్యం గురించి అప్డేట్ ఇచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వీడియోను షేర్ చేసింది. తను చాలా ఎంతో అదృష్టవంతురాలినని, గుండెపోటు తీవ్రంగా వచ్చిందని సుస్మితా సేన్ ఈ వీడియోలో తెలిపింది. అంతేకాకుండా ప్రధాన రక్తనాళం చాలా వరకు మూసుకుపోయిందని, సకాలంలో వైద్యులు చికిత్స అందించడంతో తాను ఆరోగ్యంగా ఉన్నానని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు

"ప్రపంచ వ్యాప్తంగా ప్రేమాభిమానాలు పొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నాకోసం భగవంతుడిని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వైరల్ ఇన్‌ఫెక్షన్ కారణంగా మాట్లాడటానికి నా గొంత సహకరించటం లేదు. మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పడానికే ఈ వీడియోను షేర్ చేస్తున్నా. నా వాయిస్ విని అనారోగ్యంగా ఉన్నానని అనుకోకండి. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నా. గడిచిన కొంతకాలంగా ఎంతోమంది ఎన్నోరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఒక్కరిపై ప్రేమను చూపించండి. ఇటీవలే నేను తీవ్రమైన గుండెపోటుకు గురయ్యాను. ప్రదాన రక్తనాళం 95 శాతం మూసుకుపోయింది. ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నాను. అక్కడి వైద్యులు, ఇతర సిబ్బంది ఎంతగానో శ్రమించి నన్ను ఈ ప్రమాదం నుంచి బయటపడేలా చేశారు. నా కుటుంబ సభ్యులు, ఆప్తులకు మాత్రమే ఈ విషయం తెలుసు. చికిత్స జరుగుతున్న సమయంలో ఈ విషయం ఎవరికీ చెప్పదలచుకోలేదు. ట్రీట్మెంట్ పూర్తయి నేను కోలుకున్న తర్వాతానే సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెట్టాను. దాన్ని చూసి గెట్ వెల్ సూన్ అంటూ ఎంతోమంది పోస్టులు పెడుతున్నారు. నాపై ప్రేమను చూపించిన వారందరికీ మరోసారి కృతజ్ఞతలు. త్వరలోనే ఆర్య-3 షూటింగ్‌లో పాల్గొంటా." అని సుస్మిత సేన్ తెలిపారు.

సుస్మిత గుండెపోటుకు గురి కావడంతో సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

సినిమాల విషయానికొస్తే సుస్మిత సేన్ 2015 నుంచి వెండితెరకు దూరంగా ఉంది. అనంతరం ఓటీటీల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే ఆర్య అనే వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను అలరించిన ఆమె తాలి అనే మరో సిరీస్‌లోనూ నటించారు. త్వరలోనే ఈ సిరీస్ విడుదల కానుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.