Sushmita Sen with Hearth Attack: సుస్మితా సేన్‌‌కు గుండెపోటు.. ఎమోషనల్ పోస్టు పెట్టిన నటి-sushmita sen reveals two days back she was suffered with heart attack ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sushmita Sen With Hearth Attack: సుస్మితా సేన్‌‌కు గుండెపోటు.. ఎమోషనల్ పోస్టు పెట్టిన నటి

Sushmita Sen with Hearth Attack: సుస్మితా సేన్‌‌కు గుండెపోటు.. ఎమోషనల్ పోస్టు పెట్టిన నటి

Maragani Govardhan HT Telugu
Mar 02, 2023 07:41 PM IST

Sushmita Sen with Hearth Attack: బాలీవుడ్ హీరోయిన్, మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్‌ గుండెపోటుకు గురయ్యారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ మేరకు ఎమోషనల్ పోస్టును షేర్ చేశారు.

సుస్మితా సేన్‌కు గుండెపోటు
సుస్మితా సేన్‌కు గుండెపోటు

Sushmita Sen with Hearth Attack: బాలీవుడ్ హీరోయిన్ సుస్మితా సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రిలేషన్‌షిప్‌లతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఈ ముద్దుగుమ్మ మోడల్ రోహ్మన్‌తో కొన్నాళ్లపాటు ప్రేమాయాణం కొనసాగించి గతేడాది అతడితో విడిపోయింది. దీంతో అప్పటి నుంచి సింగిల్‌గానే ఉన్న ఈ ముద్దుగుమ్మ ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీతో ప్రేమలో పడ్డారంటూ వార్తలు వచ్చాయి. తాజాగా సుస్మితా సేన్ మరోసారి వార్తల్లో నిలిచింది. తనకు హార్ట్ ఎటాక్ వచ్చిందంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టు పెట్టింది. ఈ మేరకు తన తండ్రితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది.

“నీ హృదయాన్ని ఎప్పుడూ సంతోషంగా, ధైర్యంగా ఉంచడానికి ప్రయత్నించు. కష్టకాలంలో అది నీకు అండగా నిలుస్తుంది. అని మా నాన్న సుబీర్ సేన్ చెప్పిన విలువైన మాటలివి. రెండు రోజుల క్రితం నేను గుండెపోటుకు గురయ్యా. యాంజియో ప్లాస్టీ పూర్తయింది. స్టంట్ వేశారు. నాకు చికత్స చేసిన కార్డియాలజీస్ట్ మీది చాలా గట్టి గుండే అని చెప్పారు. నా ఆరోగ్యం గురించి నా అభిమానులు, శ్రేయోభిలాషులకు తెలియాలనే ఈ పోస్టు పెడుతున్నా. ప్రస్తుతం నేను ఆరోగ్యంగా ఉన్నా. కొత్త జీవితానికి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నా.” అని సుస్మితా సేన్ తెలిపారు.

సుస్మిత గుండెపోటుకు గురి కావడంతో సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

ప్రముఖ మోడల్ రోహ్మన్‌తో కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన సుస్మితా సేన్ గతేడాది అతడితో విడిపోయింది. ఆ తర్వాత ఆమె ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీతో ప్రేమలో పడ్డారంటూ వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని లలిత్ మోదీనే ప్రకటించే సరికి అంతా నిజమేనని అనుకున్నారు. ఈ అంశంపై తర్వాత సుస్మిత స్పష్టతనిచ్చే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం తను మరో రిలేషన్‌లో పడే ఆలోచనే లేదంటూ చెప్పుకొచ్చింది.

సినిమాల విషయానికొస్తే సుస్మిత సేన్ 2015 నుంచి వెండితెరకు దూరంగా ఉంది. అనంతరం ఓటీటీల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే ఆర్య అనే వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను అలరించిన ఆమె తాలి అనే మరో సిరీస్‌లోనూ నటించారు. త్వరలోనే ఈ సిరీస్ విడుదల కానుంది.

IPL_Entry_Point

టాపిక్