Sushmita Sen |బాలీవుడ్‌లో హీరోయిన్ల పై వివ‌క్ష ఉందంటున్న సుస్మితాసేన్‌-sushmita sen shocking comments on bollywood ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sushmita Sen |బాలీవుడ్‌లో హీరోయిన్ల పై వివ‌క్ష ఉందంటున్న సుస్మితాసేన్‌

Sushmita Sen |బాలీవుడ్‌లో హీరోయిన్ల పై వివ‌క్ష ఉందంటున్న సుస్మితాసేన్‌

Nelki Naresh HT Telugu
Mar 10, 2022 07:02 AM IST

సినీ ప‌రిశ్ర‌మలో లింగ‌వివ‌క్ష చాలా ఉంద‌ని అంటోంది బాలీవుడ్ సీనియర్ న‌టి సుస్మితాసేన్‌. టాలెంట్ ఉన్నా కూడా ఈ అస‌మానాత‌ల్ని త‌ట్టుకొని క‌థానాయిక‌లు రాణించ‌డం సుల‌భం కాద‌ని అంటోంది.

సుస్మితా సేన్
సుస్మితా సేన్ (instagram)

బాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ సుస్మితా సేన్ వ్య‌క్తిత్వం డిఫ‌రెంట్‌గా ఉంటుంది. త‌న మ‌న‌సులో ఉన్న‌ది ఏదైనా కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లుగా నిర్మొహ‌మాటంగా వెల్ల‌డిస్తుంది. సినీ ప‌రిశ్ర‌మ‌లోని క్యాస్టింగ్ కౌచ్‌, వివ‌క్ష‌పై చాలా సార్లు నిర‌స‌న గ‌ళాన్ని వినిపించింది సుస్మితాసేన్‌. సినీ ప‌రిశ్ర‌మ‌లో హీరోయిన్ల టాలెంట్ కు విలువ ఇవ్వరంటూ గతంలో ఆమె చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. మరోసారి సినీ పరిశ్రమపై విమర్శలు గుప్పించింది సుస్మితాసేన్. త‌న కూతురు స్కూల్ మ్యాగ‌జైన్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మ‌రోసారి సినీ ప‌రిశ్ర‌మ‌లోని వివ‌క్ష ను గురించి వెల్ల‌డించింది సుస్మితాసేన్‌. సినీ ప‌రిశ్ర‌మ‌లో లింగ‌వివ‌క్ష చాలా ఉంటుంద‌ని చెప్పింది. హీరోల‌కు ఉండే సౌల‌భ్యాల‌తో పోలిస్తే క‌థానాయిక‌ల విష‌యంలో చాలా తేడాలు ఉంటాయ‌ని తెలిపింది. పారితోషికం, అధికారాలు, అవ‌కాశాల‌తో పాటు చాలా విష‌యాల్లో  హీరోయిన్లు అస‌మాన‌త‌లకు గురవుతూనే ఉంటార‌ని చెప్పింది. ‘ఈ వివ‌క్ష‌ను ఎదుర్కొంటూ ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకోవ‌డం సుల‌భం కాదు. ప్ర‌తిరోజు ఓ పోరాట‌మే చేయాల్సివ‌స్తుంది. లింగ వివ‌క్ష‌ను దాటుకొని న‌టిగా నాకంటూ ఓ గుర్తింపును సొంతం చేసుకోవ‌డానికి చాలా ఏళ్లు ప‌ట్టింది’ అని సుస్మితాసేన్ చెప్పింది. ఇప్ప‌టికీ ఇండస్ట్రీలో వివ‌క్ష క‌నిపిస్తూనే ఉందని,  అది తొల‌గిపోయే రోజు వ‌స్తుంద‌నే న‌మ్మ‌క‌ముందని,  కానీ అందుకు చాలా ఏళ్లు పడుతుందని సుస్మితాసేన్ పేర్కొన్న‌ది. 2010 త‌ర్వాత సినిమాల‌కు దూర‌మైన సుస్మితాసేన్ ఇటీవ‌లే ‘ఆర్య -2’ వెబ్‌సిరీస్ తో సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లుపెట్టింది. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ వెబ్ సిరీస్‌లో మాఫియా నుంచి త‌న కుటుంబాన్ని కాపాడుకునే త‌ల్లిగా సుస్మితాసేన్ న‌ట‌న‌కు విమ‌ర్శ‌ల‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. 

 

IPL_Entry_Point