Yoga for Digestion । తిన్న వెంటనే ఈ ఒక్క ఆసనం వేయండి.. ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది!-5 yoga asanas that helps you aid better digestion vajrasanam to be specially mentioned ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  5 Yoga Asanas That Helps You Aid Better Digestion, Vajrasanam To Be Specially Mentioned

Yoga for Digestion । తిన్న వెంటనే ఈ ఒక్క ఆసనం వేయండి.. ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది!

Yoga Asanas for Digestion- Vajrasanam
Yoga Asanas for Digestion- Vajrasanam (iStock)

Yoga Asanas for Digestion: తిన్న వెంటనే కొన్ని యోగాసనాలు వేయవచ్చు. అవి ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సహాయపడతాయి. అజీర్తి, మలబద్దకం సమస్యలు కూడా ఉండవు.

మానవ శరీరం ఒక సంక్లిష్టమైన వ్యవస్థ, ఒక అధునాతనమైన యంత్రం. ఇది నమ్మశక్యం కాని ఎన్నో రకాల విన్యాసాలు చేయగలదు. అటువంటి శరీరం సరిగ్గా పనిచేయడానికి సరైన ఇంధనం అవసరం. ఆ ఇంధనం మనం రోజూ తీసుకొనే ఆహార, పానీయాల ద్వారా లభిస్తుంది. కేవలం తినడం వల్ల మాత్రమే శరీరం పనిచేయదు, తిన్నది సరిగ్గా జీర్ణమైనప్పుడే శక్తి విడుదల అవుతుంది. జీర్ణక్రియ మీ శరీరానికి విటమిన్లు, ఖనిజాలతో పాటు ప్రోటీన్లు, లిపిడ్లు, కార్బోహైడ్రేట్లను అందిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

మీరు ఆరోగ్యంగా ఉండాలంటే, మీ శరీరంలోని వ్యవస్థలన్నీ సరిగ్గా పనిచేయాలంటే అందుకు పైన పేర్కొన్న పోషకాలన్నీ అవసరం. జీర్ణవ్యవస్థ మాత్రమే పోషకాలను విచ్ఛిన్నం చేసి శక్తిని విడుదల చేస్తుంది, ఆ శక్తిని మీ శరీరం గ్రహించి వివిధ పనులు చేసుకోడానికి అవకాశం ఇస్తుంది. మరి ఇంతటి కీలకమైన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎంతో అవసరం.

Yoga Asanas for Digestion-మెరుగైన జీర్ణక్రియకు యోగా ఆసనాలు

HT లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రపంచ యోగా సంస్థ వ్యవస్థాపకులు సిద్ధా అక్షర్, జరాఫ్‌షాన్ షిరాజ్‌ జీర్ణక్రియకు అవసరమయ్యే అద్భుతమైన కొన్ని యోగాసనాల గురించి తెలియజేశారు, మరి అవేమిటో మీరు తెలుసుకొని ప్రతిరోజూ ఆచరించండి.

ప్రతి ఆసనాన్ని ఐదు సెట్లు ఆచరించడానికి ప్రయత్నించాలని, అలాగే ఒక్కో ఆసనం 30 సెకన్ల కంటే తక్కువ కాకుండా వేయాలని అభ్యాసకులను వీరు సూచించారు.

వజ్రాసనం- Thunderbolt Pose

యోగాసనాలలో వజ్రాసనం తిన్న వెంటనే చేయగలిగే ఏకైక భంగిమ. మీరు మీ మోకాళ్లపై మోకరిల్లి, మీ అరచేతులను మీ మోకాళ్లపై ఉంచి, మీ మడమలను కొద్దిగా దూరంగా ఉంచి, మీ కటిని వాటిపై ఉంచండి. మీ వీపు నిటారుగా నిటారుగా ఉంచండి. ముందుకు చూడండి, ఇలా 30 సెకన్ల పాటు ఉండి, రిలాక్స్ అయి మళ్లీ దీనినే పునరావృతం చేస్తూ మొత్తంగా ఐదు సార్లు వేయండి.

సుఖాసనం - Happy Pose

ఇది చాలా తేలికైన భంగిమ. సుఖాసనం వేయడానికి ఒక ప్రశాంతమైన చోట సౌకర్యంగా ధ్యాన ముద్రలో నిటారుగా కూర్చోవాలి. మీ అరచేతులను మోకాళ్లపై ఉంచండి. మీ ఎడమ కాలును మడిచి కుడి తొడ లోపల పెట్టండి. ఆ తర్వాత, కుడి కాలును మడిచి ఎడమ తొడ లోపలికి పెట్టండి.

దండాసనం- Staff Pose

కింద కూర్చుని, మీ కాళ్లను మీ ముందు చాచండి. రెండు కాళ్ళను కలపండి, మీ మడమలు రెండు ఒకదానికొకటి తాకేలా ఒకచోట ఉంచండి. వీపుని నిటారుగా ఉంచండి. మీ కటి, తొడ కండరాలను బిగించండి. మీ వెన్నెముకకు మద్దతు ఇవ్వడానికి, మీ అరచేతులను మీ తుంటి పక్కన నేలపై ఉంచండి. అలాగే, మీ భుజాలను రిలాక్స్ చేయండి.

మలాసనం - Garland or Squat Pose

ఇది పేరులో సూచించిన విధంగా సాంప్రదాయ పద్ధతిలో మల విసర్జనకు కూర్చున్న భంగిమలో కూర్చోవాలి. అనంతరం మీ రెండు చేతులను జోడించి ప్రార్థన చేస్తున్నట్లు నమస్కార ముద్రలో ఉండండి. మీ రెండు చేతులను మోకాళ్లకు బిగించినట్లుగా ఉండాలి.

మార్జరియాసనం- Cat Cow Pose

దీనినే ఊర్ధ్వ ముఖి మర్జారి ఆసనం లేదా పిల్లి ఆవు భంగిమ అంటారు. పేరుకు తగినట్లుగా నాలుగు కాళ్ల జంతువు లాగా మోకాళ్లు, చేతులు వంచి అంబాడుతున్నట్లుగా ఉండాలి. ఊపిరి పీల్చుకోండి, మీ మొఖంతో పైకి చూసేందుకు మీ వెన్నెముకను వక్రీకరించండి. ఆపై మళ్లీ ఊపిరి పీలుచుకుని, మీ మెడ క్రిందికి వంచి మీ చూపులను మీ ఛాతీ వైపు కేంద్రీకరించండి.

క్రమం తప్పకుండా ఈ 5 యోగాసనాలు వేస్తే మీరు కొండలు తిన్నా, పిండిపిండిగా జీర్ణం అవుతుంది. మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు ఉండవు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్