Thokkudu Laddu: హోమ్ మేడ్ తొక్కుడు లడ్డు రెసిపీ అదిరిపోతుంది, దీపావళికి ఈ స్వీట్ చేసేయండి-thokkudu laddu recipe for deepavali know how to make this sweet in telugu ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Thokkudu Laddu: హోమ్ మేడ్ తొక్కుడు లడ్డు రెసిపీ అదిరిపోతుంది, దీపావళికి ఈ స్వీట్ చేసేయండి

Thokkudu Laddu: హోమ్ మేడ్ తొక్కుడు లడ్డు రెసిపీ అదిరిపోతుంది, దీపావళికి ఈ స్వీట్ చేసేయండి

Haritha Chappa HT Telugu
Oct 28, 2024 05:30 PM IST

Thokkudu Laddu: తొక్కుడు లడ్డూలను కొనడమే కాదు, ఇంట్లోనే చాలా సులువుగా చేసుకోవచ్చు. హోమ్ మేడ్ లడ్డూ రుచిగా ఉంటుంది. దీపావళికి స్పెషల్ స్వీట్ గా ఈ లడ్డూ చేసి చూడండి.

తొక్కుడు లడ్డూ రెసిపీ
తొక్కుడు లడ్డూ రెసిపీ (Pixabay)

లడ్డూలు పేరు చెబితేనే నోరూరిపోతుంది. అలాంటిది తొక్కుడు లడ్డూ పేరు చెబితే ఇక ఆగగలమా? దీపావళికి స్వీట్స్ ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? సింపుల్ గా తొక్కుడు లడ్డు చేయండి. మీ ఇంటిల్లిపాదికి నచ్చుతుంది. పైగా దీన్ని చాలా తక్కువ సమయంలోనే రెడీ చేయొచ్చు. తొక్కుడు లడ్డు రెసిపీని ఇక్కడ ఇచ్చాము. ఫాలో అయి చూడండి. మీరు కేవలం అరగంటలో మీ ఇంటిల్లిపాదికి సరిపడా లడ్డులను చుట్టేయొచ్చు.

yearly horoscope entry point

తొక్కుడు లడ్డూ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

శెనగపిండి - అరకిలో

నెయ్యి - ఆరు స్పూన్లు

యాలకుల పొడి - ఒకటిన్నర స్పూను

పంచదార పొడి - ఒక కప్పు

నూనె - డీప్ ఫ్రై వేయించడానికి సరిపడా

ఉప్పు - చిటికెడు

తొక్కుడు లడ్డూ రెసిపీ

1. ఒక గిన్నెలో శెనగపిండి, ఉప్పు, నీళ్లు వేసి చేతితోనే కలపండి. ఇది గట్టిగా ఉండేలా చూసుకోవాలి.

2. దీన్ని చపాతీ పిండిలా కలుపుకోవాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేయాలి.

4. కలుపుకున్న పిండిని జంతికల గొట్టంలోకి వేసి పెద్ద పెద్ద జంతికల్లాగా వేసుకోవాలి.

5. అన్నింటినీ అలా వేసుకున్నాక చేత్తోనే చిన్న ముక్కలుగా విరుపుకోవాలి.

6. ఆ ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.

7. ఈ మొత్తం పొడిని ఒక గిన్నెలో వేసుకోవాలి.

8. ఆ పొడిలోనే పంచదార పొడి, యాలకుల పొడి, చిటికెడు ఉప్పు కూడా వేసి బాగా కలపాలి.

9. అందులో కొద్దిగా నెయ్యి కూడా వేసి చేతికి కాస్త నెయ్యిని రాసుకొని వాటిని లడ్డూల్లా చుట్టుకోవాలి.

10. అంతే టేస్టీ తొక్కుడు లడ్డు రెడీ అయినట్టే. ఇది వండుతున్నప్పుడే నోరూరిపోతుంది. చాలా రుచిగా ఉంటుంది.

బందరు లడ్డూ చరిత్ర

తొక్కుడు లడ్డూలనే వీటినే బందరు లడ్డు అని కూడా పిలుచుకుంటారు. దీపావళికి ఎప్పుడూ ఒకేలాంటి లడ్డూలు కాకుండా ఇలా స్పెషల్ లడ్డూలను వండి చూడండి. మీ ఇంటిల్లిపాదికి నచ్చడం ఖాయం. వీటిని తింటేనే నోట్లో ఇట్టే కరిగిపోతాయి. ఈ లడ్డు చరిత్ర ఈనాటిది కాదు. ఉత్తర భారతదేశానికి చెందినవారు వీటిని మన దక్షిణ భారతానికి పరిచయం చేశారని చెప్పుకుంటారు. ఉత్తర భారతదేశం నుంచి వలస వచ్చిన కుటుంబాలు బందరులో స్థానికంగా ఉండేవి. అప్పట్లో వారు వీటిని బొందిలీలు అని పిలిచేవారట. ఆ తర్వాత అది బందరు లడ్డుగా, తొక్కుడు లడ్డుగా మారింది.

బందరు వాళ్ళు ఈ లడ్డూలను చాలా ప్రత్యేకంగా వండుతారు. బుందేల్ ఖండ్ ప్రాంతం నుంచి వచ్చిన రాజపుత్రుల వంశానికి చెందినవారు ఈ బందరు లడ్డూలను తొలిసారిగా బందరు వాస్తవ్యులకు పరిచయం చేశానని చెబుతారు. ఇప్పటికీ బందరులో ఈ లడ్డులు ఎంతో ప్రత్యేకంగా. అక్కడ ఈ లడ్డు లేకుండా ఏ వేడుక కూడా పూర్తికాదు. విందు వినోదాల్లో కచ్చితంగా ఈ స్వీట్ ఉండాల్సిందే.

Whats_app_banner