Chicken Korma: చికెన్ కర్రీకి బదులు ఓసారి చికెన్ కుర్మాను ఇలా వండి చూడండి, చపాతీ అన్నంలోకి అదిరిపోతుంది-chicken korma recipe in telugu know how to make this curry ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chicken Korma: చికెన్ కర్రీకి బదులు ఓసారి చికెన్ కుర్మాను ఇలా వండి చూడండి, చపాతీ అన్నంలోకి అదిరిపోతుంది

Chicken Korma: చికెన్ కర్రీకి బదులు ఓసారి చికెన్ కుర్మాను ఇలా వండి చూడండి, చపాతీ అన్నంలోకి అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu
Oct 19, 2024 11:30 AM IST

Chicken Korma: చికెన్ కర్రీ, చికెన్ కుర్మా ఒకటే అనుకుంటారు. నిజానికి చికెన్ కర్రీ వేరు, చికెన్ కుర్మా వేరు. ఓసారి చికెన్ కుర్మా వండుకొని చూడండి. చపాతీలోకి, అన్నంలోకి రెండిట్లోకి అదిరిపోతుంది. రెసిపీ ఇదిగో.

చికెన్ కుర్మా రెసిపీ
చికెన్ కుర్మా రెసిపీ

చికెన్ కుర్మా పేరు చెప్పగానే అందరూ చికెన్ కూరేగా అంటారు. నిజానికి చికెన్ కుర్మా వండే పద్ధతి వేరు. చికెన్ కూర ఉండే పద్ధతి వేరు మొఘల్ వంశస్థుల వంటకం చికెన్ కుర్మా. దీన్ని మొఘల్ స్టైల్ లోనే వండితే రుచి అదిరిపోతుంది. చపాతీతో తిన్నా, అన్నంతో తిన్నా రుచిగా ఉంటుంది. దీన్ని సరైన పద్ధతిలో వండడం తెలుసుకోవాలి. ఇక్కడ మేము చికెన్ కుర్మా రెసిపీ ఎలాగో ఇచ్చాము. ఇలా వండి చూడండి, మీకు కచ్చితంగా నచ్చి తీరుతుంది.

చికెన్ కుర్మా రెసిపీకి కావాల్సిన పదార్థాలు

చికెన్ - ఒక కిలో

టమోటోలు - రెండు

ఉల్లిపాయలు - రెండు

పెరుగు - ఒక కప్పు

కొబ్బరి పేస్ట్ - రెండు స్పూన్లు

నువ్వులు పేస్టు - రెండు స్పూన్లు

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

నూనె - తగినంత

కారం - ఒక స్పూను

గరం మసాలా - ఒక స్పూను

పసుపు - అర స్పూను

ధనియాల పొడి - ఒక స్పూను

జీలకర్ర పొడి - అర స్పూను

అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు

పచ్చిమిర్చి - నాలుగు

ఉప్పు - రుచికి సరిపడా

చికెన్ కుర్మా రెసిపీ

1. ముందుగా చికెన్ ముక్కలను పరిశుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి.

2. ఆ చికెన్ ముక్కలపై పసుపు, ఉప్పు, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి.

3. పచ్చిమిర్చిని ముద్దలా చేసి ఆ ముద్దను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఒక అరగంట పాటు మ్యారినేట్ చేయాలి.

4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

5. ఆ నూనెలో ఉల్లిపాయలను వేసి అవి రంగు మారేవరకు వేయించుకోవాలి.

6. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టును, కరివేపాకులను వేసి బాగా కలుపుకోవాలి.

7. టమోటో ముక్కలను సన్నగా కోసి వేసి బాగా కలపాలి.

8. పైన మూత పెట్టే టమాటాలు మెత్తగా అయ్యేవరకు ఉంచాలి.

9. ఆ తర్వాత మూత తీసి కొబ్బరి పేస్టు, నువ్వులు పేస్టు వేసి బాగా కలుపుకోవాలి.

10. ఈ మిశ్రమంలో ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలను వేసి బాగా కలపాలి.

11. పైన మూత పెట్టి పది నిమిషాలు పాటు ఉడికించాలి.

12. చికెన్ ముక్కల్లో నుంచి నీరు దిగి ఇంకి పోతుంది. అవి ఇంకిపోయాక ధనియాల పొడి, కారం, గరం మసాలా, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి.

13. ఒక పది నిమిషాలు పాటు మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి.

14. దీన్ని చిన్న మంట మీద ఉడికిస్తే మాడిపోకుండా ఉడుకుతుంది.

15. ఆ తర్వాత ఒక గ్లాసు నీళ్లు పోసి రుచికి సరిపడా ఉప్పును వేసి 20 నిమిషాల పాటు ఉడికించాలి.

16. చివరగా అది దగ్గరగా ఇగురులాగా అవుతుంది. అప్పుడు పైన కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే చికెన్ కుర్మా రెడీ అయినట్టే. ఇది చాలా రుచిగా ఉంటుంది.

చికెన్ కూర తిని బోర్ కొట్టిన వారు అప్పుడప్పుడు చికెన్ కుర్మాను వండి చూడండి. దీన్ని చపాతీతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది. అన్నంలో వేసుకుని తిన్నా బాగుంటుంది. బగారా రైస్ కు జోడిగా కూడా చికెన్ కుర్మా అదిరిపోతుంది. ఎవరైనా అతిథులు ఇంటికి వచ్చినప్పుడు అప్పుడప్పుడు చికెన్ కుర్మా వండి పెట్టండి, ఖచ్చితంగా వారి మనసులను మీరు దోచుకుంటారు.

Whats_app_banner