Running Vs Weight Liftings : రన్నింగ్ వర్సెస్ వెయిట్ లిఫ్టింగ్.. బరువు తగ్గేందుకు ఏది మంచిది?
Running Vs Weight Liftings : ఆరోగ్యంగా ఉండేందుకు చాలా మంది జిమ్ వెళ్లి కష్టపడుతారు. వ్యాయామాలు చేస్తుంటారు. అయితే బరువు తగ్గడానికి బరువులు ఎత్తడం మంచిదా? నడక మంచిదా?
అనేక మంది బరువు తగ్గేందుకు రన్నింగ్, వెయిట్ ట్రైనింగ్ తీసుకుంటారు. కానీ బరువు తక్కువ అయ్యేందుకు ఈ రెండింటీలో ఏది మంచిదని మాత్రం ప్రశ్న ఎప్పుడూ ఉంటుంది
రన్నింగ్ అనేది కార్డియో ఇంటెన్సివ్ వ్యాయామం. అనేక రకాల కండరాలను ప్రభావితం చేస్తుంది. హృదయ స్పందన రేటును కూడా పెంచుతుంది. రన్నింగ్ వ్యాయామం ద్వారా గణనీయమైన మొత్తంలో కేలరీలు కరిగిపోతాయి. మీ శరీర బరువు, పరిగెత్తే వేగం, పరిగెత్తగల సమయాన్ని బట్టి ఎన్ని కేలరీలు బర్న్ చేయవచ్చో లెక్కించుకోవచ్చు. ఒక గంట పరుగు సగటున 300 నుండి 600 కేలరీలు బర్న్ చేయగలదు. అయితే రన్నింగ్ స్పీడ్‌ని బట్టి ఇది మారుతుంది.
రన్నింగ్ అనేది కార్డియో-స్టిమ్యులేటింగ్ వ్యాయామం. స్థిరమైన శక్తిని పొందాలనుకునే వారు ఈ వ్యాయామం చేయెుచ్చు. రన్నింగ్ వల్ల గుండె వేగం పెరిగి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రన్నింగ్ గణనీయమైన మొత్తంలో కేలరీలను బర్న్ చేస్తుంది. మీరు బరువు తగ్గడానికి రన్నింగ్ శిక్షణపై మాత్రమే ఆధారపడితే ఫలిదం ఉండదు.
బరువు శిక్షణ కూడా ఒక తీవ్రమైన వ్యాయామనే చెప్పాలి. డంబెల్స్, బార్‌బెల్స్, ఇతర బరువు పరికరాలను ఎత్తడం ద్వారా బరువు శిక్షణ తీసుకోవచ్చు. వెయిట్ ట్రైనింగ్ రన్నింగ్ లాగా కేలరీలను బర్న్ చేయదు. ఇది శరీర బరువును గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది. బరువు శిక్షణ లీన్ కండరాలను బలపరుస్తుంది. కండర ద్రవ్యరాశిని పెంచుతుంది. విశ్రాంతిగా ఉన్నప్పుడు మీ జీవక్రియ రేటును పెంచుతుంది. మీరు బరువులు ఎత్తిన తర్వాత విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా మీ శరీరం కేలరీలను బర్న్ చేస్తుంది. రోజూ వెయిట్ ట్రైనింగ్ చేస్తే శరీరంలోని కొవ్వు తగ్గిపోయి కండర ద్రవ్యరాశి పెరుగుతుంది.
బరువు శిక్షణలో నిమగ్నమైనప్పుడు అదనపు కేలరీలు కరగనివిగా మారవచ్చు. వెయిట్ లిఫ్టింగ్ కండరాల పెరుగుదలను ప్రేరేపిస్తుంది. ఇది వ్యాయామం పూర్తయిన తర్వాత కూడా కేలరీలను కరిగిస్తుంది. బరువు శిక్షణ తర్వాత 48 గంటల వరకు మీ జీవక్రియ రేటును పెంచుతుంది. కేలరీలు తగ్గుతాయి, కొవ్వు కూడా తగ్గుతుంది.
బరువు తగ్గడం అనేది నిరంతర ప్రక్రియ. ఇది మీ జీవనశైలి, మీరు తినే పోషకమైన ఆహారాలు, మీరు చేసే వ్యాయామం మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఉంటే వ్యాయామం సాధ్యమవుతుంది. బరువు తగ్గడానికి మీరు రన్నింగ్ లేదా వెయిట్ లిఫ్టింగ్ వంటివి ప్రయత్నించవచ్చు. ఈ రెండు వ్యాయామాలను ప్రత్యామ్నాయంగా చేస్తే ఫలితాలను పొందుతారు. సమానంగా ఈ రెండూ చేయాలి. అప్పుడు ఈజీగా బరువు తగ్గుతారు.