Liver Health: జీవనశైలిలో ఈ మార్పులు చేస్తే మీ కాలేయం సేఫ్..-how to keep your liver healthy with lifestyle changes ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Liver Health: జీవనశైలిలో ఈ మార్పులు చేస్తే మీ కాలేయం సేఫ్..

Liver Health: జీవనశైలిలో ఈ మార్పులు చేస్తే మీ కాలేయం సేఫ్..

HT Telugu Desk HT Telugu
Aug 27, 2023 09:12 AM IST

Liver Health: కంటి కనిపించని కాలేయం.. మొత్తం ఆరోగ్యంలో కీలకంగా వ్యవహరిస్తుంది. పూర్తిగా డ్యామేజ్ అయ్యేవరకు దానికి సమస్య ఉందని చెప్పదు. పరిస్థితి చేజారిపోతుందనే సమయంలోనే కాలేయ సమస్యలు బయటపడతాయి. కాబట్టి లివర్ పూర్తిగా డ్యామేజ్ కాకముందే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి.

కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి
కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి

కొవ్వు కాలేయ వ్యాధిని హెపాటిక్ స్టీటోసిస్ అని అంటారు. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ సమస్యకు వెంటనే చికిత్స ప్రారంభించాలి. లేదంటే కాలేయ, ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారిపోతుంది. అంతేకాదు జీవనశైలిలో కొన్ని మార్పులు చేయాల్సిందే. మందులు వ్యాధిని ఎంత నయం చేసినా.. జీవన శైలిలో మార్పులే మీ ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి మీ శారీరక ఆరోగ్యానికే కాదు.. మానసిక ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి రోజూవారీ జీవితంలో ఎలాంటి మార్పులు చేస్తే ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

పోషకరమైన ఆహారం..

ఫ్యాటీ లివర్ సమస్యను తిప్పికొట్టాలంటే అన్నింటికన్నా మీరు ముందు చేయాల్సింది ఆరోగ్యకరమైన ఆహారం. సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్‌లు, స్వీట్స్, ప్యాక్డ్ చేసిన ఆహారపదార్థాలను పూర్తిగా నివారిస్తే మీ ఆరోగ్యం ముందుగా గడిలోపడేందుకు ప్రయత్నిస్తుంది. వీటికి బదులుగా మీరు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ఆకుకూరలు వంటి ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

బెర్రీలు, ఆకుకూరలు, నట్స్ వంటి అధిక యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలతో కూడిన ఆహారాలు.. కాలేయ సమస్యలను కంట్రోల్ చేస్తాయి. పైగా కేలరీలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు.

బరువు కంట్రోల్​లో ఉండాలి..

అధిక శరీర బరువు, ముఖ్యంగా పొట్ట చుట్టూ ఏర్పడే కొవ్వు కాలేయ సమస్యలకు దారి తీస్తుంది. అందుకే కాలేయ సమస్య రాకూడదనుకునేవారు బరువు విషయంపై జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే కాలేయ సమస్యలతో బాధపడుతున్న వారు కచ్చితంగా స్థిరమైన పద్ధతిలో బరువు తగ్గడానికి ప్రాధాన్యతనివ్వాలి. దీనికోసం మీరు వ్యాయామాలు చేస్తూ బరువు తగ్గేందుకు ప్రయత్నించవచ్చు.

వ్యాయామం రెగ్యులర్​గా చేస్తే.. కాలేయంలోని కొవ్వు నిల్వలు తగ్గుతాయి. కాబట్టి వేగంగా నడవడం, జాగింగ్ చేయడం, స్విమ్మింగ్, సైక్లింగ్ వంటివి వారానికి కనీసం 150 నిమిషాలైనా చేయండి. తక్కువ సమయంతో వ్యాయామం మొదలుపెట్టి క్రమంగా దానిని పెంచుతూ ఉండండి. ఇది మీ కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

హెడ్రేటెడ్​గా ఉండండి..

మీ ఆరోగ్యం, కాలేయ పనితీరుకు మీరు హైడ్రేటెడ్​గా ఉండడం అవసరం. అందుకే రోజులో మీరు తగినంత నీటిని తాగాలి. ఇది శరీరంలోని మలినాలను శరీరం నుంచి బయటకు పంపిస్తుంది.

ఆల్కహాల్​కు బాయ్

అధిక ఆల్కహాల్ వినియోగం కొవ్వు కాలేయ వ్యాధికి, ముఖ్యంగా ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్​కు దారి తీస్తుంది. సమస్య లేదు కదా ఎక్కువగా తాగేయకండి. ఏదైనా లిమిటెడ్​గా తీసుకున్నంత వరకు ఎలాంటి సమస్యలు ఉండవు. ఏదైనా మితమైతే అది కచ్చితంగా విషంగా మారి మీ ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. సమస్య ఇప్పటికే ప్రారంభమైతే.. ఇప్పుడే ఆల్కహాల్​కు బాయ్ చెప్పేయండి.

ఒత్తిడిని తగ్గించుకోండి..

దీర్ఘకాలిక ఒత్తిడి లేదా సరైన నిద్ర లేకపోవడం వల్ల కూడా కాలేయ సమస్యలు వస్తాయి. ఈ రెండూ కాలేయ ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి. అధిక ఒత్తిడి తీసుకోవడం వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్లు ఎక్కువగా విడుదల అవుతాయి. ఇది కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని ప్రోత్సాహిస్తుంది. కొవ్వు కాలేయ వ్యాధిని మరింత తీవ్రతరం చేస్తుంది.

కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలు ఎంచుకోండి. ధ్యానం, యోగా లేదా ప్రకృతిలో ఎక్కువ సమయం గడిపండి. ఇవి మీ మనసుకు ప్రశాంతతను అందిస్తాయి. రాత్రి సుఖవంతమైన నిద్రను అందిస్తాయి. అంతేకాకుండా కాలేయ సమస్యలను దూరం చేస్తాయి. కాబట్టి రాత్రి నిద్ర 7 నుంచి 9 గంటలు నిద్రపోయేలా ప్లాన్ చేసుకుని కాలేయ సమస్యను దూరం చేసుకోండి.

Whats_app_banner