Workout Tips : వ్యాయామం చేసేప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి-muscle training to above 40 age people and never do these mistakes ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Workout Tips : వ్యాయామం చేసేప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి

Workout Tips : వ్యాయామం చేసేప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి

Anand Sai HT Telugu

Muscle Training Tips : వ్యాయామం చేసేప్పుడు సాధారణంగా కొన్ని తప్పులు చేస్తాం. 40 ఏళ్లపైబడినవారు ఈ తప్పులు అస్సలు చేయకండి.

వ్యాయామం చిట్కాలు (Freepik)

ఎప్పుడు, ఎలా వ్యాయామం చేయాలో కచ్చితంగా తెలిసి ఉండాలి. ముఖ్యంగా 40 ఏళ్ల తర్వాత వ్యాయామం చేసేటప్పుడు మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రతి వయస్సు కోసం సరైన వ్యాయామాన్ని ఎంచుకోవడం చాలా అవసరం. 40 ఏళ్లలోపు ఎక్కువ బరువు ఎత్తడం వల్ల మీ కండరాలకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఈ రకమైన వ్యాయామ తప్పులు తరువాత ప్రమాదంలో పడేస్తాయి. 40 ఏళ్లు పైబడిన వారు వ్యాయామ సమయంలో నాలుగు తప్పులు చేయకూడదు.

వ్యాయామంలో అత్యంత ముఖ్యమైన భాగం శరీరం వేడెక్కడం. కొన్ని వార్మప్స్ చేయకుండా మీ వ్యాయామాన్ని ప్రారంభించడం మంచిది కాదు. 40 ఏళ్లు దాటిన వారు కండరాల వ్యాయామాలు చేయడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ ప్రారంభించే ముందు శరీరం వేడెక్కేలా చేసుకోవాలి. ఈ వార్మప్ వ్యాయామం మీ శరీరాన్ని ఒత్తిడి చేయకూడదు. మీ శరీరానికి చెమటలు పట్టడంతో మీరు ఏది కావాలంటే అది చేయవచ్చు. జాగింగ్, లైట్ జాగింగ్ మొదలైనవి చేయాలి.

ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయడానికి తగినంత బలం కలిగి ఉండటం అవసరం. 20 ఏళ్ల వయస్సులో ఉన్న వారికి ఇది సులభంగా ఉండవచ్చు. కానీ 40 ఏళ్ల వయస్సు వచ్చేవారికి అదనపు బలం ఉండాలి. కానీ ఎక్కువ బరువు ఎత్తడం, ఎక్కువ వ్యాయామం చేయడం అస్సలు మంచిది కాదు. బెంచ్‌ప్రెస్ చేసేటప్పుడు మీరు చేయలేకపోతే మధ్యలో ఆపేయడమే మంచిది.

జిమ్‌లో ఇతర వ్యక్తులు వర్కౌట్స్ చేయడం మీరు గమనించవచ్చు. అయితే మిమ్మల్ని వారితో పోల్చుకోకండి. ప్రతి శరీర వ్యవస్థ భిన్నంగా ఉంటుంది. వేర్వేరు విరామాలతో వర్కౌట్స్ చేసుకుంటే మంచి జరుగుతుంది. అవతలివారు అధిక బరువు ఎత్తుతున్నారు కదా అని మనం కూడా అలా బరువు ఎత్తకూడదు.

వయస్సు ఆధారంగా వ్యాయామాలు చేయాలి. 40 ఏళ్లలోపువారు కండరాలను పొందడం, సిక్స్ ప్యాక్ ట్రై చేయడం చాలా ఇబ్బంది లుగుతుంది. కానీ మీరు మీ వయస్సుతో సంబంధం లేకుండా జిమ్‌లో చేరవచ్చు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం వలన కొన్ని తీవ్రమైన పరిణామాలను నివారించవచ్చు. 40 ఏళ్లపైన వారు వ్యాయామాలు చేసేప్పుడు ఏ చిన్న తప్పు చేసినా కండరాల మీద ప్రభావం పడుతుంది.