Healthy Fat Foods : మీ ఆహారంలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఎంత చేర్చాలి? ఎలా?
Healthy Fat Foods : మీ ఆహారంలో ఆరోగ్యకరమైన కొవ్వుల సరైన మోతాదులో చేర్చాలి. అప్పుడే మెుత్తం ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. అనేక దీర్ఘకాలిక వ్యాధులను నివారించవచ్చు. మీ ఆహారంలో చేర్చాల్సిన టాప్ ఆహారాలు, వాటి ప్రయోజనాలు చూద్దాం.
కొవ్వు అంటే లావుగా మారుస్తుందని, అనేక దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతుందని అందరి నమ్మకం. కానీ శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వు కూడా అవసరమే. చాలా మంది ఫిట్నెస్, బరువు పెరగడంతో వచ్చే సమస్యల పేరు చెప్పి కొవ్వు తినడం మానేస్తున్నారు. అయితే అనారోగ్యకరమైన కొవ్వు తినకూడదు. కానీ ఆరోగ్యకరమైన కొవ్వు తింటే మంచి జరుగుతుంది. ఆరోగ్యకరమైన కొవ్వులను తీసుకోవడం మెదడు పనితీరు, గుండె ఆరోగ్యం, చర్మం, జుట్టు ఆరోగ్యం, ఎముక ఆరోగ్యం, జీవక్రియకు అవసరం. కొలెస్ట్రాల్ నిర్వహించడానికి కొంత మొత్తంలో ఆరోగ్యకరమైన కొవ్వు కూడా ముఖ్యం.
ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా మొక్కల ఆధారిత ఆహారాల్లో దొరుకుతాయి. గింజలు, విత్తనాలు, నెయ్యి, అవోకాడోస్, ఆలివ్, కొవ్వు చేపలు, నువ్వులు, సోయాబీన్ నూనె అన్నీ ఆరోగ్యకరమైన కొవ్వుల వనరులు. డార్క్ చాక్లెట్లలోనూ ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. కానీ చక్కెర కంటెంట్ కారణంగా మితంగా తినాలి. ఆహారంలో కొవ్వులను చేర్చేటప్పుడు అనారోగ్య స్థితి గురించి జాగ్రత్తగా ఉండాలి. సమోసా, కచోరీ, పకోడా, పిజ్జా, బర్గర్ తదితర జంక్ ఫుడ్స్ తినొద్దు.
మెదడు పనితీరును పెంచడం, హార్మోన్ల సమతుల్యతకు మద్దతు ఇవ్వడం నుండి గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం, బరువు తగ్గడానికి సహాయపడటం వరకు మంచి కొవ్వులను మీ ఆహారంలో చేర్చడం అనేక ప్రయోజనాలను అందిస్తుందని పోషకాహార నిపుణురాలు భక్తి అరోరా కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
ఆరోగ్యకరమైన కొవ్వుల ప్రయోజనాలు
ఆరోగ్యకరమైన కొవ్వులు మీ మెదడు శక్తిని మెరుగుపరుస్తాయి. జ్ఞాపకశక్తి నుండి మానసిక స్థితి వరకు విధులను నిర్వహించడానికి సహాయపడతాయి. అభిజ్ఞా పనితీరు, జ్ఞాపకశక్తి, మానసిక స్థితి స్థిరీకరణను పెంచడానికి మీ మెదడుకు ఆరోగ్యకరమైన కొవ్వులను తీసుకోండి. మీ ఆహారంలో ఆరోగ్యకరమైన కొవ్వుల మోతాదును జోడించేందుకు గుప్పెడు నానబెట్టిన బాదం లేదా చేపలను తీసుకోండి.
ఆరోగ్యకరమైన కొవ్వులను క్రమం తప్పకుండా తీసుకోవడం మీ గుండె ఆరోగ్యానికి మంచిది. మీరు డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, చక్కెర తినొద్దు. పప్పుతో కాస్త నెయ్యి మీ శరీరానికి, హృదయ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను చురుకుగా తగ్గిస్తాయి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
రోజంతా స్థిరమైన శక్తి కోసం, తిండిపై కోరికలను అరికట్టడానికి మీ ఆహారంలో తగినంత మొత్తంలో ఆరోగ్యకరమైన కొవ్వులను చేర్చడం చాలా ముఖ్యం. కొవ్వులు తీసుకోవడం మీ కడుపు నిండుగా ఉంచుతుంది. రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. అనారోగ్యకరమైన చిరుతిండిని నిరోధిస్తుంది. ఆరోగ్యకరమైన కొవ్వులను తీసుకోవడం వల్ల మెరిసే చర్మం, బలమైన జుట్టుతో సంబంధం కలిగి ఉంటుంది.
ఆరోగ్యకరమైన కొవ్వులను రోజూ ఎంత తీసుకోవాలి? తీసుకునే మార్గాలు
బాదం - 14, గ్రాములు వాల్ నట్స్ - 18 గ్రాముల, చియా విత్తనాలు - 9 గ్రాములు, అవిసె గింజలు- 12 గ్రాములు, జనపనార గింజలు - 14, గ్రాముల పెకాన్స్ - 20 గ్రాములు, బ్రెజిల్ గింజలు - 19 గ్రాములు, జీడిపప్పు - 12 గ్రాములు, పిస్తా - 13 గ్రాములు, గుమ్మడికాయ గింజలు - 13 గ్రాములు, నువ్వులు - 14, అవొకాడో-4 గ్రాములు, ట్యూనా - 8 గ్రాములు, చికెన్ (తొడ, స్కిన్-ఆన్) - 9.3 గ్రాములు, ఆలివ్ ఆయిల్ - 14 గ్రాములు, కొబ్బరి నూనె - 14 గ్రాములు, అవోకాడో ఆయిల్ - 14 గ్రాములు, అవిసె గింజల నూనె - 14 గ్రాముల, నువ్వుల నూనె - 13.5 గ్రాములు, వాల్నట్ ఆయిల్ - 14 గ్రాములు, పొద్దుతిరుగుడు నూనె - 14, మొక్కజొన్న నూనె - 13.6 గ్రాములు, వేరుశెనగ నూనె - 13.