Fitness Tips : వెయిట్ లిఫ్టింగ్ వ్యాయామం తర్వాత కార్డియో చేయవచ్చా?
Fitness Tips : జిమ్‌కు వెళ్లినవాళ్లంతా ఒకేరకమైన వ్యాయామాలు చేయరు. కొంతమంది జిమ్‌లో చేసే తప్పుల వల్ల లేనిపోని ఆరోగ్య సమస్యలను వస్తాయి. అలాగే కార్డియో, వెయిట్ లిఫ్టింగ్ ఒకేరోజు చేయొచ్చా, ఏది ముందు చేయాలి?
ఈరోజుల్లో ఫిట్‌గా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ దాని కోసం ఎలాంటి మార్గాన్ని ఎంచుకోవాలనేదే గందరగోళం, జిమ్‌కు వెళ్లి కష్టపడటం, యోగా చేయడం, బరువు తగ్గే డైట్‌లు ఫాలో అవడం, కార్డియో ఎక్సర్‌సైజులు ఇలాంటివి చాలా ఉన్నాయి. వెయిట్ లిఫ్టింగ్ తర్వాత లేదా ముందు కార్డియో చేయాలా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. మీరు ఈ ప్రశ్నకు అందరి నుండి ఒకే సమాధానాన్ని పొందలేరు.
ఎందుకంటే మీరు ఎప్పుడు ఏ వ్యాయామం చేస్తారు అనేది మీ లక్ష్యం ఏమిటో దానిపై ఆధారపడి ఉంటుంది. బరువు తగ్గడానికి వ్యాయామం చేస్తుంటే వేరే విధానాన్ని అనుసరించాలి. కొవ్వు తగ్గడానికి చేసే వ్యాయామం భిన్నంగా ఉంటుంది. ఈరోజు మనం వెయిట్ లిఫ్టింగ్ తర్వాత కార్డియో చేయొచ్చా లేదా తెలుసుకుందాం.
వెయిట్ లిఫ్టింగ్ వర్కౌట్ తర్వాత ఇంటర్వెల్ ట్రైనింగ్ లేదా కార్డియో కూడా మిమ్మల్ని క్యాటాబోలిజం స్థితిలో ఉంచుతుంది. దాని వల్ల లావు తగ్గదని ఫిట్‌నెస్ నిపుణులు అంటున్నారు. స్ట్రక్చర్డ్ అండ్ ఫోకస్డ్ డైట్ ఫాలో అయితే ఫలితాలు కనిపిస్తాయట. వెయిట్ లిఫ్టింగ్ వ్యాయామాలు శరీరం జీవక్రియను పెంచడానికి, కండరాల పెరుగుదలను పెంచడానికి పని చేస్తాయి. రక్త ప్రవాహాన్ని పెంచడం ద్వారా ఊపిరితిత్తులు, గుండెను బలోపేతం చేయడానికి కార్డియో వ్యాయామం పనిచేస్తుంది.
ఒక వ్యక్తి ఫిట్‌నెస్, సరైన ఆరోగ్యం కోసం మాత్రమే వ్యాయామం చేస్తే, అతను తన వ్యాయామ షెడ్యూల్‌లో వెయిట్ లిఫ్టింగ్ వ్యాయామాలు, కార్డియో వ్యాయామాలు రెండింటినీ చేర్చాలి. ఇది అతని కండరాలను బలపరుస్తుంది. కార్డియోకు ముందు వెయిట్ లిఫ్టింగ్ వ్యాయామాలు చేయడం వల్ల కొవ్వును కరిగించవచ్చు. బరువులు ఎత్తడం వల్ల మొదట మీ శరీరం ఏరోబిక్ మోడ్‌లోకి ప్రవేశించడానికి అనుమతిస్తుంది.
మీరు బరువులు ఎత్తిన తర్వాత వ్యాయామం చేయడం వల్ల కలిగే లాభాలు, నష్టాలను లిస్ట్ చేస్తే.. వెయిట్ లిఫ్టింగ్, కార్డియో రెండింటినీ ఒకేసారి చేయడం వల్ల జిమ్‌లో మీ సమయాన్ని ఆదా చేయవచ్చు. వెయిట్ లిఫ్టింగ్ వ్యాయామాల తర్వాత కార్డియో వ్యాయామాలలో పాల్గొనడం వల్ల క్యాలరీ బర్న్ పెరుగుతుంది. ఇది కొవ్వు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. అయితే ఈ రెండూ కలిపి ఎక్కువగా చేయకూడదు.
ఓవర్‌ట్రైనింగ్ మిమ్మల్ని ప్రమాదంలో పడేస్తుంది. బరువులు ఎత్తిన వెంటనే ఎక్కువ కార్డియో చేయడం వల్ల కండరాల పునరుద్ధరణ, పెరుగుదలకు ఆటంకం కలుగుతుంది. ఈ రెండు వ్యాయామాలు చేసే ముందు, మీరు ఆహారంపై దృష్టి పెట్టాలి. పోషకాహారం తీసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. బరువులు ఎత్తిన తర్వాత వ్యాయామం చేయాలా వద్దా అనేది మీ ఫిట్‌నెస్ లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణుడిని సంప్రదించాలి.