Sitting Risks : కూర్చొని పని చేస్తున్నారా? అయితే లేచి కాస్త నడవండి.. లేదంటే..
Side Effects of Sitting : నేను చేసే పని ఏమిటి కుర్చొని చేసే పని ఆ మాత్రం పొట్టరాదా అని ఓ సినిమాలో బ్రహ్మానందం చెప్తారు. అలాగే ఎక్కువ సేపు కూర్చొంటే.. వచ్చే సమస్యలు అన్ని ఇన్ని కాదు. ఈ మధ్య మనం చేసే పనులన్నీ.. కూర్చొని చేసేవే. దీనివల్ల వచ్చే సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మరి దీనిని ఎలా నివారించాలో ఇప్పుడు తెసుకుందాం.
Side Effects of Sitting : మనలో చాలా మంది ఆఫీసు కుర్చీలకు అతుక్కుపోతుంటాం. పని మధ్య విరామం తీసుకోవడం కూడా మర్చిపోతాం. పైగా 'వర్క్ ఫ్రమ్ హోమ్' అనేది చాలా మందికి కొత్త నార్మల్‌గా మారడంతో.. మనకు తెలియకుండానే మన రోజులో ఎక్కువ భాగం వాటితోనే గడుపుతున్నాం. అయితే ఈ నిశ్చల జీవనశైలి అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. దీనిపై అవగాహన పెంచుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మీరు ఇప్పటినుంచే దీనిపై శ్రద్ధ తీసుకుంటే.. దీర్ఘకాలిక సమస్యలకు గురికాకుండా ఉండగలుగుతారు. మరి ఆ సమస్యలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
గుండె సమస్యలు
ఎక్కువసేపు కూర్చోవడం మీ హృదయానికి హాని కలిగిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎక్కువ గంటలు కూర్చునే వారికి గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 2011లో లాఫ్‌బరో యూనివర్సిటీ, యూనివర్శిటీ ఆఫ్ లీసెస్టర్ ప్రచురించిన ఒక అధ్యయనంలో.. ఎక్కువసేపు కూర్చున్నవారిలో హృదయ సంబంధ వ్యాధుల మరణాలు 90% పెరుగుతాయని వెల్లడించింది.
నరాల సమస్యలు
ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల మీ కాళ్లలో రక్తం చేరుతుంది. దీని పరిస్థితిని వెరికోస్ వెయిన్స్ అంటారు. స్పైడర్ సిరలు అని కూడా పిలుస్తారు. ఈ పరిస్థితి సాధారణంగా హానికరం కాదు. కానీ చివరికి రక్తం గడ్డకట్టడంతో కూడిన తీవ్రమైన అనారోగ్యానికి దారి తీస్తుంది. దీనితో పాటు ఇది మీ సిరల గోడలను బలహీనపరుస్తుంది. కవాటాలను కూడా దెబ్బతీస్తుంది.
బరువు పెరుగుట
మీరు కుర్చీకి అతుక్కుని ఉండటం వల్ల కచ్చితంగా బరువు పెరుగుతారు. మీరు కదులుతున్నప్పుడు మీ కండరాలు లిపోప్రొటీన్ లిపేస్ వంటి అణువులను విడుదల చేస్తాయి. ఇది మీరు తినే కొవ్వులు, చక్కెరను ప్రాసెస్ చేయడంలో సహాయం చేస్తాయి.
మీరు కూర్చుని మాత్రమే సమయం గడిపినప్పుడు ఈ అణువుల విడుదల తగ్గుతుంది. ఇది బరువు పెరుగుటకు దారితీస్తుంది. అందుకే ఎక్కువ కూర్చొని ఉండే పురుషులు ఎక్కువ బరువు పెరుగుతారని ఒక అధ్యయనంలో తేలింది.
నొప్పులు
మీ మెడ, వీపు లేదా భుజాలు ఎందుకు నొప్పిగా ఉన్నాయా? లేదా ఎలాంటి గాయం లేకుండా మీ కండరాలు బిగుసుకుపోతున్నాయని మీకు అనిపిస్తుందా? ఎక్కువగా కుర్చోవడం వల్లనే ఇలా జరుగుతుంది. నిరంతరం కూర్చోవడం మీ వీపుపై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. ప్రత్యేకించి మీరు రోజంతా చెడు భంగిమలో కూర్చున్నప్పుడు. వాస్తవానికి మీరు దీనిని సరిదిద్దకపోతే.. మీరు భంగిమ సిండ్రోమ్‌ను కూడా అభివృద్ధి చేయవచ్చు.
కాళ్లలో బలహీనత
మీరు రోజంతా కూర్చున్నప్పుడు లేదా ఎక్కువ సమయం కూర్చొని ఉన్నప్పుడు మీ కాళ్ల కండరాలు, దిగువ శరీరం క్రియారహితంగా మారతాయి. ఇది కండరాల క్షీణతకు దారితీస్తుంది. ఇది మీ కండరాలను క్షీణించేలా చేస్తుంది.
కాబట్టి మీకు సమయం కుదిరినప్పుడల్లా నడవడం, నిలబడటం, పరిగెత్తడం, ఇతర కార్యకలాపాలలో బిజీగా ఉండండి. వ్యాయామం చేయండి. యోగా చేయండి. ఎంత వీలైతే అంత బిజీగా మారిపోండి. ప్రతి అరగంటకి ఒకసారి 5 నిముషాలు నడవండి. దీనివల్ల ఈ సమస్యలు తగ్గుతాయి.
సంబంధిత కథనం