కండరాలు దృఢంగా ఉండలా.. అయితే ఈ యోగాసనాలు వేయండి!
చాలామంది మహిళలు కండరాల సమస్యతో బాధపడుతుంటారు. ఈ నేపథ్యంలో కండరాలను దృఢంగా మార్చి నొప్పుల నుండి విముక్తి కలిగించడానికి ఈ యోగసనాలను ట్రై చేయెుచ్చు.
చాలా మంది మహిళల్లో తీరిక లేకుండా పని చేయడం వల్ల కండరాల సమస్య ఏర్పడుతుంది. నిర్లక్ష్యం చేస్తే ఆ సమస్య తీవ్రమవుతుంది. బాధ్యతలు ఎంత ముఖ్యమో.. ఆరోగ్యానికి ప్రాధాన్యమివ్వడమూ అంతే ముఖ్యం!. ప్రధాన కండర వ్యవస్థ దృఢంగా ఉండాలంటే.. కోర్ కండరాలను బలోపేతం చేయడం చాలా కీలకం. ఈ నేపథ్యంలోనే ఈ కండరాల దృఢంగా ఎలా చేసుకోవాలో తెలపుతూ ప్రముఖ యోగ నిపుణులు అన్షుకా ఇటీవలే ఓ వీడియోను పోస్ట్ చేసింది. బోట్ పోజ్ లేదా నౌకాసనా, ముంజేయి స్టాండ్, క్రో పోజ్ లేదా బకాసనా అనే మూడు భంగిమల గురించి ఈ వీడియోలో ప్రస్తావించారు.
మహిళలు వారి సౌలభ్యాన్ని బట్టి ప్రతిరోజూ ఈ భంగిమలను చేయడం వల్ల ఫలితం ఉంటుందని తెలిపింది. "15-20 సెకన్లు నుండి 3 నిమిషాల వరకు ఈ భంగిమాలు చేయవచ్చిన వివరించింది.
బోట్ పోజ్ లేదా నౌకాసన:
నౌకాసనా ఛాతీ కండరాల బలోపేతానికి సహాయపడుతుంది. హిప్ ఫ్లెక్సర్‌లు, అడక్టర్ కండరాలను బలంగా మారుస్తోంది. హామ్ స్ట్రింగ్‌లను సాగదీస్తుంది. అలాగే వాటిని బిగుతును లేదా గాయం అయ్యే అవకాశాలను కూడా తగ్గిస్తుంది.
ముంజేయి స్టాండ్ :
ముంజేయి స్టాండ్ భంగిమ కోర్, వీపును బలపరుస్తుంది. సమతుల్యత, సమన్వయాన్ని పెంచుతుంది. శరీర అమరికను మెరుగుపరుస్తుంది.మెదడుకు రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
కాకి భంగిమ లేదా బకాసనా:
కాకి భంగిమ చేతులు, మణికట్టు, ఎగువ వీపు ఉదర కండరాలను బలపరుస్తుంది. ఉదర అవయవాలను టోన్ చేస్తుంది. బకాసనా అనేది మధ్యస్థ బ్యాలెన్సింగ్ భంగిమ. శరీర బరువు మొత్తం చేతులపై సమతుల్యంగా ఉంచి కోర్ని బలపరుస్తుంది.
సంబంధిత కథనం