Foods To Soak Overnight । మామిడిపండ్లు తినేముందు నీటిలో నానబెట్టాలి.. ఎందుకంటే?!-mangoes to be soaked in water before you eat know list of foods to soak overnight ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Foods To Soak Overnight । మామిడిపండ్లు తినేముందు నీటిలో నానబెట్టాలి.. ఎందుకంటే?!

Foods To Soak Overnight । మామిడిపండ్లు తినేముందు నీటిలో నానబెట్టాలి.. ఎందుకంటే?!

HT Telugu Desk HT Telugu
May 04, 2023 09:43 AM IST

Foods To Soak Overnight: నానబెట్టిన ఆహార పదార్థాలను రోజూ ఉదయం తీసుకోవడం వలన మంచి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. రాత్రంతా నానబెట్టి ఉదయం పూట తీసుకోగలిగే కొన్ని గింజలు, ధాన్యాల గురించి ఇక్కడ తెలుసుకోండి.

Soaked Mangoes
Soaked Mangoes (Stock Pic)

Foods To Soak Overnight: నానబెట్టుకొని తినడం వలన కొన్ని ఆహార పదార్థాల పోషక విలువలు పెరుగుతాయని మనం చాలా సార్లు వినే ఉంటాం. ఈ జాబితాలో ముఖ్యంగా పప్పుధాన్యాలు (Soaked Lentils), గింజలు, విత్తనాలు, బీన్స్ మొదలైనవి ఉంటాయి. నానబెట్టడం వలన పోషకాల సాంద్రత పెరగటం మాత్రమే కాకుండా వాటిలోని వేడి గుణాలను తగ్గించవచ్చు, త్వరగా జీర్ణమయి పోషకాల శోషణ కూడా వేగంగా జరుగుతుంది. తద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అందుకే నానబెట్టడం సిఫారసు చేస్తారు.

మరోవైపు ఇలా నానబెట్టిన ఆహార పదార్థాలను రోజూ ఉదయం తీసుకోవడం వలన మంచి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. రాత్రంతా నానబెట్టి ఉదయం పూట తీసుకోగలిగే కొన్ని గింజలు, ధాన్యాల గురించి ఇక్కడ తెలుసుకోండి.

Soaked Grains- నానబెట్టిన ముతక ధాన్యాలు

కాయధాన్యాలు, బీన్స్ మొదలైన ముతక ధాన్యాలు తినడానికి ముందు తప్పనిసరిగా నీటిలో నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల వాటి పొట్టులో ఉండేటువంటి ఫైటేట్ లేదా ఫైటిక్ యాసిడ్ తగ్గుతుంది. ఫైటేట్ ఉంటే అది కడుపులో చికాకు కలిగించడమే కాకుండా పోషకాలను అడ్డుకుంటుంది. అందుకే ఫైటిక్ యాసిడ్‌ను యాంటీ న్యూట్రియంట్ అంటారు.అయితే ఇటువంటి ధాన్యాలను రాత్రి నానబెట్టి ఉదయం తినడం వలన మీ శరీరానికి అవసరమయిన మొత్తంలో ఐరన్, జింక్, కాల్షియంలతో పాటు ఇతర ఖనిజాలు, ప్రోటీన్లు లభిస్తాయి.

Soaked Fenugreek - నానబెట్టిన మెంతులు

మెంతి గింజలను నీటిలో నానబెట్టడం వల్ల వాటి ఫైబర్ శాతం పెరుగుతుంది, ఔషధ గుణాలను పెంచుతుంది. అంతేకాదు నీటిలో తడిసిన తర్వాత తింటే కడుపులో సులభంగా జీర్ణమవుతుంది, మన జీర్ణవ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే ఆకలిని నియంత్రిస్తుంది, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది, తద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది.

Soaked Almonds- నానబెట్టిన అవిసెలు- బాదంపప్పులు

అవిసె గింజలు (Soaked Flaxseeds) , బాదంపప్పులను రాత్రంతా నానబెట్టి ఉదయం తినడం మంచిది. నానబెట్టడం ద్వారా వీటిలోని హానికర టానిన్ సమ్మేళనాన్ని నివారించవచ్చు. నానబెట్టిన తర్వాత ఈ రెండింటిని తినడం వల్ల వాటిలో ఫైబర్, పోషకాలు పెరుగుతాయి. అలాగే వాటి ప్రోటీన్ కడుపులో వేడిని ఉత్పత్తి చేయదు.

Soaked Raisins- నానబెట్టిన ఎండు ద్రాక్ష

ప్రతిరోజూ ఉదయాన్నే నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఎండుద్రాక్షలో కూడా అధిక మొత్తంలో ఫైబర్ ఉన్నందున, ఇది ప్రేగు కదలికను సాఫీగా చేసి, కడుపు ఉబ్బరం లేకుండా చేస్తుంది. మీరు జీర్ణ సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, రాత్రంతా నానబెట్టిన ఎండుద్రాక్షను ఉదయం తినండి,ఆశ్చర్యకరమైన ఫలితాలు ఉంటాయి.

Soaked Mangoes- నానబెట్టిన మామిడిపండు

మామిడిని ఉదయం పూట మొదటి ఆహారంగా తినకూడదు. ఇందులో చక్కెర అధికంగా ఉంటుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలలో గణనీయమైన హెచ్చుతగ్గులకు కారణం అవుతుంది. మామిడి పండ్లలో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. కాబట్టి, మామిడిపండ్లను తినేముందు కొన్ని గంటలపాటు నీటిలో నానబెట్టడం వల్ల శరీరంలో వేడిని ఉత్పత్తి చేసే అదనపు ఫైటిక్ యాసిడ్‌ను తొలగించడంలో సహాయపడుతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం