Weight Loss Naturally : బరువు తగ్గేందుకు కొరియన్ పద్ధతి ఫాలో అవ్వండి.. చాలా ఈజీ
Weight Loss With Korean Food Habits : కొరియన్స్ చూసేందుకు చాలా స్లిమ్‌గా ఉంటారు. వారి చర్మం కూడా మెరుస్తూ ఉంటుంది. ఇందుకు వారి ఆహారపు అలవాట్లే కారణం.
కొరియన్లకు ఇండియాలోనూ ఫ్యాన్ బేస్ ఉంది. అక్కడి వెబ్ సిరీస్, సినిమాలను ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది భారతీయులు ఫాలో అవుతున్నారు. అయితే వారిని గమనిస్తే చాలా స్లిమ్‌గా కనిపిస్తూ ఉంటారు. వారి ఆహారపు అలవాట్లతోనే ఇది సాధ్యం.
ప్రజల ఆహారాలు, కొన్ని అలవాట్లు ఆ ప్రాంత ప్రజలు చాలా కాలం పాటు ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. ఊబకాయంతో బాధపడుతూ బరువు తగ్గాలని ప్రయత్నిస్తుంటే కొరియన్ల అలవాట్లను పాటిస్తే త్వరలోనే శరీర బరువులో మంచి మార్పు కనిపిస్తుంది.
ఎందుకంటే కొరియన్ ప్రజల ఆహారపు అలవాట్లు వారి శరీర బరువును అదుపులో ఉంచుకోవడానికి ఎంతగానో ఉపయోగడుతుంది. అందుకే వారు చాలా అందంగా కనిపిస్తారు. కొరియన్ స్టైల్ స్కిన్ కూడా చాలా ఫేమస్. దగదగ మెరుస్తూ ఉంటారు. మీరు కూడా బరువు తగ్గాలనుకుంటే.. ఫిట్ బాడీ కోసం కొరియన్లు అనుసరించే కొన్ని అలవాట్లు ఉన్నాయి. వాటిని చూడండి.. వాటిని ఫాలో అవ్వండి.. మార్పును చూస్తారు.
కొరియన్లకు మాంసాహారం, సముద్రపు ఆహారం చాలా ఇష్టం. అలాఅని వారు కూరగాయలకు దూరంగా ఉండరు. మాంసాహారం ఎంత తిన్నా సరే రోజూ సరిపడా కూరగాయలు తింటారు. ఇది వారి స్లిమ్, ఆరోగ్యకరమైన శరీరానికి ప్రధాన కారణం. ఈ అలవాటును మీరూ అలవర్చుకోండి.
కిమ్చీ అనేది కొరియాలో అత్యంత ప్రసిద్ధ, సాంప్రదాయ వంటకం. పులియబెట్టిన కూరగాయలను ఉపయోగించి ఈ కిమ్చీని తయారు చేస్తారు. ఇందులో క్యాబేజీ, ముల్లంగి, పచ్చి ఉల్లిపాయలు వంటివి ఎక్కువగా ఉపయోగిస్తారు. దాని పైన ఉప్పు, పంచదార, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, కారం, మిరియాలు మొదలైనవి కలుపుతారు. పులియబెట్టిన ఆహారాలు సాధారణంగా జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేస్తాయి. వేగంగా బరువు తగ్గడంలో సహాయపడతాయి.
కొరియన్లు ఫాస్ట్ ఫుడ్ కంటే ఇంట్లో వండిన భోజనం ఎక్కువగా తింటారు. వారి ఆహారంలో ఎక్కువ భాగం ఇంట్లో వండుతారు. బయట భోజనం చేయడం చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ అలవాటు వల్లనే వారి శరీరం ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంటుంది.
కొరియన్ ప్రజల జీవనశైలిని తీసుకుంటే ఈ దేశ ప్రజలు ఎక్కువగా నడిచి, సైకిల్ మీదనే వెళ్తుంటారు. తక్కువ దూర ప్రయాణాల కోసం నడుస్తారు. ఈ అలవాటు వల్లనే వారు ఆరోగ్యంగా, పొట్ట లేకుండా ఉంటారు. మనం పక్కన ఉన్న దుకాణం వెళ్లాలి అనుకున్నా.. బైక్ తీస్తాం. ఇది సరైన పద్ధతి కాదు.
కొరియన్ ప్రజలు కూరగాయలు, సముద్రపు ఆహారాన్ని ఎక్కువగా తింటారు. సీఫుడ్‌లో అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వారి రోజువారీ ఆహారంలో కచ్చితంగా సీఫుడ్ ఉంటుంది. సీఫుడ్‌లో లీన్ ప్రొటీన్ పుష్కలంగా దొరుకుతుంది. కొవ్వు, కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇతర మాంసాహారాల కంటే చేపలను తీసుకుంటే, అది సులభంగా జీర్ణమవుతుంది. చాలా సేపు కడుపు నిండుగా ఉంటుంది.
సాధారణమైన ఆ అలవాట్లతోనే కొరియన్ ప్రజల ఫిట్, ఆరోగ్యకరంగా ఉంటారు. వారి ఆరోగ్యానికి ఇవే ప్రధాన కారణాలు. మీరు ఒత్తిడి లేకుండా సులభంగా బరువు తగ్గాలనుకుంటే కొరియన్ అలవాట్లను ఫాలో అవ్వండి. ఈజీగా బరువు తగ్గించుకోవచ్చు.
టాపిక్