K Craze In India : కొరియన్ కంటెంట్‌కు ఇక్కడ భారీ క్రేజ్.. ఏది వచ్చినా వదలట్లేదట-india is the biggest market for korean contest says korean minister yu byung chae k craze in india ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  K Craze In India : కొరియన్ కంటెంట్‌కు ఇక్కడ భారీ క్రేజ్.. ఏది వచ్చినా వదలట్లేదట

K Craze In India : కొరియన్ కంటెంట్‌కు ఇక్కడ భారీ క్రేజ్.. ఏది వచ్చినా వదలట్లేదట

Anand Sai HT Telugu
Aug 26, 2023 12:33 PM IST

K Craze In India : కొరియన్ కంటెంట్‍కు ఇండియాలో ఇప్పటికే పెద్ద మార్కెట్ క్రియేట్ అయింది. కొరియన్ సినిమాలు వస్తే వదలకుండా చూసేవారూ ఉన్నారు. ఇప్పుడు ఈ విషయాన్ని ఆ దేశ మంత్రి కూడా చెప్పారు.

కొరియన్ కంటెంట్‌‍కు ఇండియాలో క్రేజ్
కొరియన్ కంటెంట్‌‍కు ఇండియాలో క్రేజ్ (Twitter)

కొరియాలో తీసిన కంటెంట్‌కు భారతదేశంలో విపరీతమైన డిమాండ్ ఉంది. ఎక్కువమంది వీక్షకులు ఇక్కడ నుంచే ఉన్నారు. ప్రస్తుత యువ తరం కొరియన్ సిరీస్‌లపై ఎక్కువ ఆసక్తి చూపుతోంది. BTS గ్రూప్ భారతదేశంలో కూడా చాలా ఫేమస్. దీని గురించి కొరియా సంస్కృతి, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి యు బైయుంగ్ ఛాయ్ మాట్లాడారు. ఢిల్లీలో జరిగిన 'కే సాంస్కృతిక సదస్సు'లో ఇందుకు సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నారు. కొరియన్ కంటెంట్‍ను అత్యధికంగా వీక్షించే దేశంగా భారతదేశం ఉందని వెల్లడించారు.

'K-కల్చర్ ప్రజాదరణ కారణంగా కొరియా, భారతదేశం మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యం గతంలో కంటే బలంగా పెరుగుతోంది. BTS మరియు Netflix సిరీస్ 'స్క్విడ్ గేమ్' ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకుంది. కొరియన్ కంటెంట్ చూసే దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది.' అని యు బైయుంగ్ చే అన్నారు.

'అంతేకాదు కొరియాకు రావడానికి భారతీయ విద్యార్థులు కొరియన్ భాష నేర్చుకుంటున్నారు. ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల భవిష్యత్తులో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయి.' అని యు బైంగ్ ఛాయ్ అన్నారు.

భారతదేశంలో కొరియన్ కంటెంట్ ఎక్కువగా చూస్తున్నారని కొరియా మంత్రి వెల్లడించారు. కొందరు కొరియన్ కంటెంట్‌ని ఇంగ్లీష్, హిందీలోకి డబ్ చేసి చూస్తున్నారని తెలిపారు. మరికొందరు కొరియన్ కంటెంట్‌ని ఇంగ్లీష్ సబ్‌టైటిల్‌లతో చూస్తున్నట్టుగా పేర్కొన్నారు. అంతేకాదు.. ఇలా అక్కడి భాషను నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా వివరించారు మంత్రి.

ఇండియాలో BTSకి భారీ అభిమానులు ఉన్నారు. కొరియన్ స్క్విడ్ గేమ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. చాలా దేశాల్లో ఈ సిరీస్‍కు ఫ్యాన్స్ ఉన్నారు. ఇంగ్లీష్ డబ్‌గా విడుదలై ప్రశంసలు అందుకుంది. ఇండియన్స్ కూడా కొరియన్ కంటెంట్ చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కాలం యువతకు దీనిపై ఇంట్రస్ట్ ఎక్కువగా ఉంది. చాలామంది ఫోన్లలో కొరియన్ సినిమాలే కనిపిస్తున్నాయి. అక్కడ ఏదైనా విడుదలైతే.. వాటి కోసం ఇండియాలో సెర్చింగ్ కూడా ఎక్కువే జరుగుతుందట.

Whats_app_banner