Weight Loss: ఊబకాయం తగ్గించే దివ్యౌషధం మీ వంటింట్లోనే ఉంది..
- తెలియకుండానే, చూస్తుండగానే బరువు పెరిగిపోతాం. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. అన్ని డ్రెసెస్ సూట్ కావు. ఈ సమస్యలను తగ్గించే దివ్యౌషధం మీ వంటింట్లోనే ఉంది. అదేంటంటే..
- తెలియకుండానే, చూస్తుండగానే బరువు పెరిగిపోతాం. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. అన్ని డ్రెసెస్ సూట్ కావు. ఈ సమస్యలను తగ్గించే దివ్యౌషధం మీ వంటింట్లోనే ఉంది. అదేంటంటే..
(1 / 7)
శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి దివ్యమైన ఔషధం మీ వంటింట్లో లభించే అల్లం. అల్లంతో కేవలం బరువు తగ్గడమే కాదు, ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
(2 / 7)
అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ. అలాగే, ఇందులో యాంటీఆక్సిడెంట్స్ కూడా పుష్కలం.ఈ రెండూ బరువు తగ్గడంలో సహాయపడుతాయి. అల్లంతో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అల్లం గౌట్ సమస్యను తగ్గిస్తుంది. బహిష్టు నొప్పిని తగ్గిస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
(3 / 7)
అల్లాన్ని ప్రతీరోజూ ఆహారంలో భాగం చేసుకోండి. అంతేకాదు,. బరువు తగ్గడం కోసం అల్లాన్ని వివిధరకాలుగా వినియోగించవచ్చు.
(4 / 7)
అల్లం రసం - అల్లం రసాన్ని కొంచెం నీటిలో కలపి, ఆ నీటిని తాగవచ్చు. ఖాళీ కడుపుతో ఉదయమే దీన్ని తాగాలి. ఇది బరువు తగ్గడానికి చాలా సహాయపడుతుంది.
(5 / 7)
అల్లం పొడి - శొంఠి పొడి కాంబినేషన్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కాబట్టి, కొద్దిగా అల్లం, శొంఠిని వేరువేరుగా ఎండబెట్టి పొడిగా చేసుకుని సిద్ధంగా ఉంచుకోండి. దీన్ని ఆహార పదార్ధాల తయారీలో వాడవచ్చు.
(6 / 7)
గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసం, అల్లం రసం కలిపి ఉదయం ఖాళీ కడుపుతో త్రాగాలి. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. ఈ పానీయం బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.
ఇతర గ్యాలరీలు