Weight loss recipe: మీ పొట్ట కొవ్వు కరిగించి, బరువు తగ్గించే రెసిపీ.. వారంలోనే బెస్ట్ రిజల్ట్స్
Weight loss recipe: బరువు తగ్గడానికి, పొట్ట కొవ్వు కరిగిపోవడానికి ఆకలితో మాడిపోవక్కర్లేదు. ఈ సింపుల్ రెసిపీ చేసుకుని తినండి. దాన్నెలా తయారు చేయాలో చూడండి.
ఈ రోజుల్లో అధిక బరువు చాలా మంది ఎదుర్కుంటున్న సమస్య. అనరోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయకపోవడం, రోజంతా ఒకే చోట కూర్చుని పనులు చేయడం.. ఇలా అధిక బరువుకు కారణాలెన్నో. దీనికోసం జిమ్ కు వెళ్లడం, ఖరీదైన సప్లిమెంట్లు తీసుకోవడంతో పాటు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. రకరకాల డైట్లు ఫాలో అవుతారు కూడా. డైటింగ్ పేరుతో ఆకలితో అలమటించడం అస్సలు సరికాదు. అందుకే ఒకసారి ఈ రెసిపీని ప్రయత్నించండి. మీరు బరువు తగ్గడంలో ఇది సాయపడుతుంది. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులువు.
కావాల్సిన పదార్థాలు:
1 ఉల్లిపాయ
2 టమాటాలు
కప్పు క్యాబేజీ ముక్కలు
1 క్యాప్సికం, ముక్కలుగా కోసుకోవాలి
2 క్యారట్ల ముక్కలు
పావు టీస్పూన్ ఉప్పు
పావు టీస్పూన్ మిరియాల పొడి
తయారీ విధానం:
వీటిలో ఏమున్నా లేకపోయినా క్యాబేజీ మాత్రం తప్పకుండా అవసరం. మిగతా వాటిలో ఏమైనా లేకపోతే కూడా ఈ రెసిపీ తయారు చేసుకోవచ్చు. లేదా మీకిష్టమైన ఇంకా వేరే కూరగాయలు కూడా వేసుకోవచ్చు.
ఇప్పుడు కూరగాయలన్నింటినీ శుభ్రంగా కడుక్కోవాలి. అన్నింటినీ సన్నటి ముక్కల్లాగా తరిగి పెట్టుకోవాలి.
కుక్కర్ ను గ్యాస్ మీద పెట్టి అందులో కూరగాయలు మునిగేంత అవసరం అయ్యే నీళ్లు పోసుకోవాలి. నీళ్లు కొద్దిగా వేడి అయ్యాక ఆ నీటిలో ఉల్లిపాయ ముక్కలు వేయాలి.
ఉల్లిపాయ ముక్కలను రెండు నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత ఒక్కోటి మిగిలిన కూరగాయలను వేయాలి. ఇప్పుడు అందులో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి కలపాలి. దీన్ని 15 నిమిషాలు సన్నం మంటపై ఉడికించండి. లేదంటే రెండు విజిల్స్ వచ్చేదాకా అయినా ఉడికించొచ్చు. అంతే.. మీ బరువు తగ్గించే రెసిపీ సిద్ధంగా ఉంది.
ఎప్పుడు తినాలి?
ఈ రెసిపీని మీ భోజనంలో ఏ పూట అయినా చేర్చుకోవచ్చు. ఒక సూప్ లాగా తినేయొచ్చు. కూరగాయ ముక్కలు ఎంత సన్నగా తరుగుకుంటే తినేటప్పుడు అంత సులభంగా రుచిగా ఉంటుంది. ఇది రాత్రి భోజనం సమయంలో తింటే చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. మీరు వేగంగా బరువు తగ్గాలని ప్లాన్ చేస్తుంటే, ఈ బరువు తగ్గించే రెసిపీని రాత్రి భోజనంలో ఒక వారం పాటు తినండి. ఎంత కావాలంటే అంత తినొచ్చు.
మరిన్ని లాభాలు:
ఇది మీ శరీరంలో కొవ్వు కరిగించడానికి పనిచేస్తుంది. ఎటువంటి బలహీనత రాకుండా చేస్తుంది. వారం రోజుల పాటు కూడా ఈ రెసిపీని డైట్ లో చేర్చుకుంటే ఎన్నో లాభాలు కనిపిస్తాయి. ఇది మీ బరువును తగ్గిస్తుంది. పొట్టను తగ్గిస్తుంది. ఈ కూరగాయలలో లభించే యాంటీఆక్సిడెంట్ల కారణంగా మీ చర్మం కూడా ప్రకాశిస్తుంది. శరీరం మొత్తం ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనం చేకూరుతుంది.