ఉల్లిపాయలో అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. మీ ఆహారం నుండి వాటిని తొలగించడం వలన ఆ పోషకాల లోపం ఏర్పడుతుంది.

Unsplash

By Anand Sai
Jun 08, 2024

Hindustan Times
Telugu

ఉల్లిపాయలను నివారించడం వల్ల మాంగనీస్, పొటాషియం, విటమిన్ సి, బి6 మరియు ఫోలేట్ వంటి ఖనిజాలు శరీరానికి అందకుండా పోతాయి.

Unsplash

ఉల్లిపాయ తినకుంటే రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. అలసట, రక్తం గడ్డకట్టడం, ఎర్ర రక్త కణాలు వంటి సమస్యలు సాధారణం.

Unsplash

ఉల్లిపాయలు కేవలం రుచి కోసమే కాదు. అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉన్నాయి. మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఇవన్నీ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

Unsplash

ఉల్లిపాయల నుండి విటమిన్ సి, బి6, ఫోలేట్ లభ్యమవుతాయి. బలమైన రోగనిరోధక వ్యవస్థ, కణాల పెరుగుదల, ఆరోగ్యకరమైన జీవక్రియకు ఇవి అవసరం.

Unsplash

ఉల్లిపాయలు అల్లైల్ ప్రొపైల్ డైసల్ఫైడ్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉన్నాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి.

Unsplash

ఉల్లిపాయలు డైటరీ ఫైబర్ మంచి మూలం. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు ఫైబర్ అవసరం. ఉల్లిపాయలు తినడం మానేయడం మలబద్ధకం లేదా ఇతర జీర్ణ సమస్యలకు దారితీస్తుంది.

Unsplash

ఉల్లిపాయల్లో అల్లిసిన్, క్వెర్సెటిన్ ఉంటాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం మానేస్తే అది కాలక్రమేణా దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.

Unsplash

అందాలతో కాకా రేపుతోన్న కల్కి 2898 ఏడీ హీరోయిన్ దిశా పటానీ

Instagram