ఎన్నో రోగాలకు మన వంటింట్లోనే దివ్యౌషధాలు ఉంటాయి. అందులో ఒకటి నల్ల మిరియాలు.
Unsplash
By Anand Sai Jun 15, 2024
Hindustan Times Telugu
మిరియాలలోని పోషకాలతోపాటు ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. మిరియాలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
Unsplash
మిరియాల్లో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి.
Unsplash
రోజూ ఉదయం పరగడుపున ఒకటి లేదా రెండు మిరియాలను నమిలి మింగడం వల్ల అధిక ప్రయోజనాలు పొందవచ్చు.
Unsplash
మిరియాలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉంటాం..
Unsplash
అజీర్తి సమస్యతో బాధపడే వారు మిరియాలను పాత బెల్లంతో కలిపి తింటే ఫలితం ఉంటుంది. ఒక గ్లాస్ మజ్జిగలో మిరియాల పొడిని వేసి కలిపి తీసుకోవడం సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది.