High BP In Sleeping : ఈ లక్షణాలు మీలో ఉంటే నిద్రలో అధిక రక్తపోటు అని అర్థం
High Blood Pressure In Sleeping Reasons : రక్తపోటు అనేది చాలా ఇబ్బందికరమైన సమస్య. దీనితో శారీరక, మానసిక ఇబ్బందులు వస్తాయి. అయితే నిద్రలో అధిక రక్తపోటు కొందరిని ఇబ్బంది పెడుతుంది. దీని గురించి కొన్ని లక్షణాలు ఉంటాయి.
అధిక రక్తపోటు అనేది ఒక వ్యక్తిని నిశ్శబ్దంగా చంపే ఒక ప్రాణాంతక సమస్య. ఎందుకంటే అధిక రక్తపోటు చివరికి గుండెకు దారితీసే ధమనులను దెబ్బతీస్తుంది. గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. అధిక రక్తపోటు సమస్యను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీనిని అదుపు చేయకుండా వదిలేస్తే, గుండె సమస్యలే కాకుండా మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది. దృష్టి కోల్పోవడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం కూడా జరుగుతుంది.
ఈ అధిక రక్తపోటు అనేది కొన్నిసార్లు అర్థమయ్యేలా ఉంటుంది. మరి కొన్నిసార్లు ఇది ఎటువంటి లక్షణాలను బహిర్గతం చేయకపోవచ్చు. కానీ చాలా సందర్భాలలో ఈ అధిక రక్తపోటు కొన్ని లక్షణాలను చూపిస్తుంది. అందుకే శరీరం చూపుతున్న లక్షణాలపై ఎల్లప్పుడూ శ్రద్ధ వహించాలి. పట్టించుకోకపోతే.. అది ప్రతికూల ప్రభావాలకు దారితీయవచ్చు.
చాలా లక్షణాలు ఉన్నాయి
అధిక రక్తపోటు సమస్య అయితే గురక నుండి రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన వరకు లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు హెచ్చరిక సంకేతాలు. అధిక రక్తపోటు ఉన్నవారు రాత్రిపూట ఎక్కువగా గురక పెడతారని ఒక అధ్యయనంలో తేలింది. అధిక రక్తపోటు తీవ్రంగా ఉంటే రాత్రిపూట కనిపించే కొన్ని లక్షణాలను తెలుసుకుందాం..
గురక కూడా అధిక రక్తపోటుకు కారణమే
గురక అనేది అధిక రక్తపోటు సాధారణ లక్షణం. ఊపిరి పీల్చుకునే సమయంలో శ్వాసనాళాలు మూసుకుపోయి, బయటకు పంపే గాలి చిన్న చిన్న మార్గాల ద్వారా వెళ్లి గొంతులోని కణజాలాలను కంపించినప్పుడు ఈ గురక వస్తుంది. నిజానికి అధిక రక్తపోటు ఉన్నవారు బిగ్గరగా గురక పెట్టవచ్చు. దీంతో అధిక రక్తపోటు సమస్యను తెలుసుకోవచ్చు.
రక్తపోటు ఉన్నవారికి నిద్ర సమస్యలు
ఒక వ్యక్తిలో నిద్రలేమి అనేది ఒత్తిడి, ఆందోళన, సరైన నిద్ర అలవాట్లు మాత్రమే కాకుండా అధిక రక్తపోటు కారణంగా కూడా సంభవిస్తుంది. అధిక రక్తపోటు ఉన్నవారికి తరచుగా నిద్ర భంగం కలిగించవచ్చు. రాత్రంతా మేల్కొని ఉంటారు. మీరు ఈ లక్షణాన్ని అనుభవిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
రాత్రి మెలకువ
తరచుగా రాత్రి మేల్కొనడం, విరామం లేని నిద్రను అనుభవిస్తే అధిక రక్తపోటు సమస్య ఉండవచ్చు. ఎందుకంటే అధిక రక్తపోటు తీవ్రంగా ఉన్నప్పుడు, అది తరచుగా ఒక వ్యక్తిని గాఢ నిద్ర నుండి మేల్కొల్పుతుంది.
ఎక్కువసార్లు మూత్ర విసర్జన
రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జన చేయడం అనేక ఆరోగ్య సమస్యల లక్షణం. ఒక వ్యక్తి పగటిపూట మాత్రమే కాకుండా రాత్రిపూట కూడా తరచుగా మూత్ర విసర్జన చేయడానికి నిద్రలేస్తే అది అధిక రక్తపోటుకు సంకేతం. రక్తపోటు స్థాయిలలో అసమతుల్యత ఉన్నప్పుడు మూత్రపిండాలపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ కారణంగా ఎక్కువ మూత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది. రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జనను ప్రేరేపిస్తుంది.
తరచుగా తలనొప్పి
మీరు తరచుగా తలనొప్పితో బాధపడితే.. పగలు, రాత్రి తేడా లేకుండా ఉంటే ఇది అధిక రక్తపోటుకు కారణంగా చెప్పవచ్చు. తలనొప్పి ఎప్పుడు వస్తుందో గమనించి వైద్యుడిని సంప్రదించండి. పైన చెప్పిన లక్షణాలను అనుభవిస్తే రక్తపోటు గురించి వైద్యుడిని సంప్రదించాలి. తగిన చికిత్స తీసుకోవాలి.