సాయంత్రం ఈ పనులు చేస్తే ఒత్తిడి హార్మోను ఉత్పత్తి తగ్గుతుంది, ప్రశాంతంగా ఉంటారు-if you do these things in the evening the production of stress hormones will decrease and you will feel calm ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  సాయంత్రం ఈ పనులు చేస్తే ఒత్తిడి హార్మోను ఉత్పత్తి తగ్గుతుంది, ప్రశాంతంగా ఉంటారు

సాయంత్రం ఈ పనులు చేస్తే ఒత్తిడి హార్మోను ఉత్పత్తి తగ్గుతుంది, ప్రశాంతంగా ఉంటారు

Published Feb 20, 2024 02:36 PM IST Haritha Chappa
Published Feb 20, 2024 02:36 PM IST

  • సాయంత్రం పూట చేసే కొన్ని పనులు మీలో ఒత్తిడిని పెంచేస్తాయి. దీనివల్ల నిద్ర సరిగా పట్టదు. ఒత్తిడి హార్మోను ఉత్పత్తిని తగ్గిస్తే మీరు ప్రశాంతంగా ఉండగలరు.

కార్టిసాల్ అనేది ఒత్తిడి హార్మోన్. ఇది శరీరంలో అధికంగా ఉత్పత్తి అయితే ఒత్తిడి, ఆందోళన వంటివి ఎక్కువ అవుతాయి. కార్టిసాల్ స్థాయిలు పెరిగితే ఒత్తిడికి ఎక్కువైపోతాయి. సాయంత్రం పూట కొన్ని పనులు మానేయడం ద్వారా , కొన్ని పనులు చేయడం ద్వారా ఒత్తిడి హార్మోను అధికంగా ఉత్పత్తి కాకుండా అడ్డుకోవచ్చు. 

(1 / 6)

(Unsplash)

రాత్రి పూట భోజనంలో పోషకాలు అధికంగా ఉండేలా చూసుకోండి. పోషకాలు నిండుగా ఉన్న భోజనం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. దీని వల్ల ఒత్తిడి పెరగకుండా ఉంటుంది. రాత్రి ప్రశాంతంగా నిద్రపడుతుంది. 

(2 / 6)

సాయంత్రం నుంచి ఫోన్ వాడకం తగ్గించండి. ఆ ఫోన్ నుంచి వచ్చే నీలి కాంతివల్ల సమస్యలు వస్తాయి. టీవీ, ల్యాప్ టాప్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇవన్నీ కూడా కార్టిసాల్ ఉత్పత్తిని పెంచేస్తాయి.

(3 / 6)

కొంతమందికి పదేపదే ఫోన్ లేదా ఇ-మెయిల్‌ని తనిఖీ చేయడం అలవాటుగా ఉంటుంది. దీని వల్ల మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇది కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది, ఇది ఒత్తిడికి దారితీస్తుంది. కాబట్టి పదేపదే ఫోన్ చెక్ చేయడం మానేయాలి. 

(4 / 6)

మీరు ప్రశాంతంగా ఉండాలంటే సాయంత్రం పూట ప్రశాంతంగా కాసేపు గడపండి. మీకిష్టమైన సంగీతం వినడం వంటి పనులు చేయండి. డైరీ రాయడం మాత్రం మర్చిపోవద్దు. అందులో ఆ రోజు మీరు చేసిన మంచిపనులు తప్పకుండా రాయండి. మనసులో ఉన్నదంతా రాసేస్తే ప్రశాంతంగా ఉంటారు. 

(5 / 6)

గోడపైకి కాళ్లను పెట్టే యోగా భంగిమను సాయంత్రం పూట చేస్తూ ఉండాలి. ఇది పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

(6 / 6)

ఇతర గ్యాలరీలు