Healthy Foods to Reduce Anxiety : స్ట్రెస్​గా ఉన్నప్పుడు.. ఈ ఫుడ్స్ తీసుకోండి..-healthy foods add to reduce anxiety may help you calm your nerves ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Healthy Foods Add To Reduce Anxiety May Help You Calm Your Nerves

Healthy Foods to Reduce Anxiety : స్ట్రెస్​గా ఉన్నప్పుడు.. ఈ ఫుడ్స్ తీసుకోండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 15, 2022 09:51 AM IST

Healthy Foods to Reduce Anxiety : ఆందోళన, ఒత్తిడి అనేవి ఈరోజుల్లో చాలా కామన్ అయిపోయాయి. కొందరికి ఎవరినైనా కలవాలన్నా.. ఇంటర్వ్యూలకు వెళ్లేప్పుడు.. మాట్లాడేప్పుడు.. ఇలా కొన్ని సందర్భాల్లో ఒత్తిడి, ఆందోళన ఎక్కువైపోతాయి. ఆ సమయంలో కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల ఆందోళన అదుపులో ఉంటుందంటున్నారు నిపుణులు.

ఈ ఫుడ్స్ తీసుకుంటే ఒత్తిడి తగ్గుతుందట
ఈ ఫుడ్స్ తీసుకుంటే ఒత్తిడి తగ్గుతుందట

Healthy Foods to Reduce Anxiety : నేటి బిజీ, అస్సలు ఖాళీ లేని సమయాల్లో.. చాలా మంది పని ఒత్తిడికి లోనవుతున్నారు. కొన్ని దినచర్యల కారణంగా ఆందోళనకు గురవుతున్నారు. ఇది వారిని మానసికంగా, శారీరకంగా కృంగ దీసేస్తుంది. మీరు ఇలాంటి సమస్యలో ఉన్నారని అనిపిస్తే.. మీరు ఇప్పటినుంచే శ్రద్ధ తీసుకోవడం అవసరం. యోగా చేయడం, వైద్యుడిని సంప్రదించడం, జీవనశైలిలో మార్పులు కచ్చితంగా తీసుకురావాల్సిన సమయం ఇదే. మీరు దీనిని ఎంత ఇగ్నోర్ చేస్తే.. అన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి ముందే జాగ్రత్తలు తీసుకోండి.

ఆందోళన, నిరాశను పెంచడంలో మనం తీసుకునే ఆహారం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆహారం, పోషకాహారం కూడా మన మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. అయితే ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడే కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

హెర్బల్ టీ

ఒక కప్పు వేడి టీ మిమ్మల్ని తక్షణమే రిలీఫ్ అందిస్తుందని అందరికీ తెలుసు. అందుకే చాలామంది ఒత్తిడిలో ఉన్నప్పుడు టీ తాగుతారు. అయితే ఆ సమయంలో హెర్బల్ టీ తీసుకుంటే.. ఫలితాలు ఇంకా మెరుగ్గా ఉంటాయి అంటున్నారు. లావెండర్, చమోమిలే టీలు మీకు మానసిక విశ్రాంతిని ఇస్తాయని నివేదికలు చెప్తున్నాయి.

ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు

కొవ్వు ఆమ్లాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అధ్యయనాల ప్రకారం.. ఒమేగా-3 డిప్రెషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి ట్యూనా, సాల్మన్, మాకేరెల్, సార్డినెస్ వంటి చేపలను తినడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

పాలు

నిద్రపోయే ముందు వేడి పాలు తాగాలని వైద్యులు సలహా ఇస్తారు. ఎందుకంటే రాత్రిపూట ఒత్తిడి తగ్గి.. మంచి నిద్ర వస్తుంది కాబట్టి. గోరువెచ్చని పాలు శరీరానికి ఉపశమనం అందిస్తాయి. అధ్యయనాల ప్రకారం.. కాల్షియం అధికంగా ఉండే పాలు కండరాలను విశ్రాంతి తీసుకోవడానికి, మానసిక స్థితిని స్థిరీకరించడానికి సహాయపడతాయి. మీరు పాలు తాగడానికి ఇష్టపడకపోతే.. పెరుగు, జున్ను కూడా తీసుకోవచ్చు.

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్ చాలా రిలాక్సింగ్‌గా ఉంటుంది. అందుకే దీన్ని తినడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. డార్క్ చాక్లెట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ శరీరంలోని ఒత్తిడిని తగ్గించగలవు. కానీ దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల కూడా హాని కలుగుతుంది.

నట్స్

విటమిన్లు, జింక్, మెగ్నీషియం కలిగి ఉన్నందున నట్స్ మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. B విటమిన్లు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయని చెప్తారు. అయితే మెగ్నీషియం ఒత్తిడిని తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. అధ్యయనాల ప్రకారం.. బాదం, పిస్తా, వాల్‌నట్‌లు కూడా రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి.

గుడ్లు

గుడ్లలో విటమిన్లు, మినరల్స్, అమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. గుడ్లలో కోలిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇది ఒత్తిడి నుంచి రక్షించడంలో సహాయపడుతుంది.

(మీరు ఒత్తిడి తగ్గించుకోవడానికి వీటిని ఫాలో అయ్యే ముందు మీ వైద్యుని సలహాలు తీసుకోండి. అందరికీ అన్ని ఒకే రియాక్షన్ ఇవ్వవు కాబట్టి.. డాక్టర్ సలహా తీసుకోవడం మీకు మెరుగైన ఫలితాలు ఇస్తుంది.)

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్