Walnuts Benefits: రోజూ 2 నానబెట్టిన వాల్‌నట్‌లను తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?-walnuts making everyday healthy ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Walnuts - Making Everyday Healthy

Walnuts Benefits: రోజూ 2 నానబెట్టిన వాల్‌నట్‌లను తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

HT Telugu Desk HT Telugu
Oct 01, 2022 10:37 PM IST

Walnuts health Benefits:వాల్ నట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో చాలా విటమిన్లు ఉంటాయి.

Walnuts
Walnuts

నేటి బిజీ లైఫ్‌లో చాలా మందికి తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం లేదు. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే కొద్దిగా ఆరోగ్యం పట్ల శ్రద్ద వహిస్తే సంపూర్ణ అరోగ్యం మీ సొంతమవుతుంది. ముఖ్యంగా డ్రై ప్రూట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వాటిలో వాల్‌నట్స్ చాలా స్పెషల్ అని చెప్పాలి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల హెల్త్‌గా ఉండవచ్చు. ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉన్న వాల్‌నట్‌లు మెదడు ఆరోగ్యానికి, జ్ఞాపకశక్తికి చాలా మంచిది. వాల్ నట్స్ లో ప్రొటీన్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, సెలీనియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. వాల్‌నట్‌లో ఉండే అనేక ప్రయోజనాల కారణంగా డ్రై ఫ్రూట్స్‌లో రారాజు అని కూడా పిలుస్తారు. వీటిని నానబెట్టి ఖాళీ కడుపుతో తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందుకోసం రాత్రంతా రెండు అక్రోట్లను నీటిలో నానబెట్టి రోజూ తినాలి. వాల్‌నట్స్ వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలను తెలుసుకుందాం ..

మధుమేహంలో మేలు చేస్తుంది

మధుమేహ రోగులు నానబెట్టిన వాల్‌నట్‌లను తినడం వల్ల ప్రయోజనం పొందుతారు. వాల్‌నట్‌లను రోజూ తినేవారిలో టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. వాల్‌నట్‌లు రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతాయి.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

వాల్‌నట్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకాన్ని నివారించడానికి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో రోజూ వాల్ నట్స్ తీసుకుంటే క్లీన్ గా ఉంటారు.

ఎముకలు దృఢంగా మారుతాయి

వాల్‌నట్స్‌లో మీ ఎముకలు, దంతాలను బలంగా మార్చే అనేక భాగాలు మరియు లక్షణాలు ఉన్నాయి. వాల్‌నట్స్‌లో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ ఉంటుంది, ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, వాల్‌నట్స్‌లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు కూడా వాపును తగ్గిస్తాయి.

గుండెకు మేలు చేస్తుంది

వాల్ నట్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మీ హృదయానికి ఇది చాలా మంచిది. అధిక రక్తపోటు ఉన్నవారికి వాల్‌నట్‌లు ప్రయోజనకరంగా ఉంటాయని అనేక అధ్యయనాలు కూడా నిరూపించాయి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. మంచి కొలెస్ట్రాల్‌ను ఉత్పత్తి చేస్తాయి, ఇది గుండెకు మేలు చేస్తుంది.

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

వాల్‌నట్‌ల వినియోగం రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి. వాల్‌నట్స్‌లో పాలీఫెనాల్ ఎల్లాగిటానిన్‌లు ఉంటాయి, ఇది అనేక రకాల క్యాన్సర్‌ల నుండి రక్షించడంలో సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తి పెంచుతుంది

వాల్‌నట్స్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తాయి. కాబట్టి ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి మీ ఆహారంలో నానబెట్టిన వాల్‌నట్‌లను ఎల్లప్పుడూ చేర్చుకోండి.

WhatsApp channel

సంబంధిత కథనం