Rose Green Tea Recipe : గ్రీన్ టీ చేదుగా ఉందనిపిస్తే.. రోజ్ గ్రీన్ టీ ట్రై చేయండి
Rose Green Tea Recipe : గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచి చేస్తుందని మన అందరికీ తెలుసు. కానీ దాని రుచి చేదుగా ఉంటుంది. రుచి మార్చుకోవడం కోసం షుగర్ వేస్తే.. దానిలోని పోషకాలు మనం పొందలేము. అయితే ఈ గ్రీన్ టీ మరింత టేస్టీగా, హెల్తీగా మార్చే చక్కని టీ ఇక్కడ ఉంది. అదే రోజ్ గ్రీన్ టీ.
Rose Green Tea Recipe : మీ రోజును ప్రారంభించడానికి.. ఓ హెల్తీ, టేస్టీ టీ ఉండాలి. అది గ్రీన్ టీ అనుకుంటాము కానీ.. దాని రుచి అందరికీ నచ్చుదు. కానీ దాని రుచి మార్చుతూ.. దాని శక్తిని మరింత పెంచే రోజ్ గ్రీన్ టీని మీరు ట్రై చేయవచ్చు. ఇది మీకు రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఈ చలికాలంలో మీకు మంచి వెచ్చదనాన్ని ఇస్తుంది. మరి దీనిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* గ్రీన్ టీ బ్యాగ్ - 1
* రోజ్ వాటర్ - 1 టీస్పూన్
* నీళ్లు - 1 1/2 కప్పు
* రోజ్ వాటర్ - 1 టేబుల్ స్పూన్
* తేనె - 1 టీస్పూన్
* ఎండిన గులాబీ రేకులు - 5
తయారీ విధానం
రోజ్ గ్రీన్ టీ తయారీ కోసం ముందుగా ఓ గిన్నె తీసుకోవాలి. దానిలో నీటిని వేసి మరిగించండి. ఇప్పుడు దానిలో ఎండిన గులాబీ రేకులను వేయండి. గులాబీ రేకుల నుంచి సారాంశం విడుదలైన తర్వాత.. తేనె వేసి.. స్టవ్ ఆపేయండి. ఆ నీటిని ఓ కప్పులో తీసుకుని.. దానిలో రోజ్ వాటర్, గ్రీన్ టీ బ్యాగ్ వేయండి. కాసేపు అలా ఉంచేసి.. గ్రీన్ టీ బ్యాగ్‌ని తీసివేయండి. అంతే వేడి వేడి రోజ్ గ్రీన్ టీ రెడీ.
సంబంధిత కథనం