Green Tea Benefits : గ్రీన్​ టీని ఎప్పుడు తీసుకుంటే బరువు తగ్గుతామో తెలుసా? -when to drink green tea for weightless process ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Green Tea Benefits : గ్రీన్​ టీని ఎప్పుడు తీసుకుంటే బరువు తగ్గుతామో తెలుసా?

Green Tea Benefits : గ్రీన్​ టీని ఎప్పుడు తీసుకుంటే బరువు తగ్గుతామో తెలుసా?

Geddam Vijaya Madhuri HT Telugu
Jun 28, 2022 10:35 AM IST

గ్రీన్ టీ అనేది ఆరోగ్యకరమైన, శక్తివంతమైన పానీయం. దీనిని బరువు తగ్గడానికి ఎక్కువమంది ఉపయోగిస్తారు. మరి గ్రీన్​ టీ వల్ల బరువు తగ్గుతారా? ఏవిధంగా బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రీన్ టీ బెనిఫిట్స్
గ్రీన్ టీ బెనిఫిట్స్

Green Tea Benefits : గ్రీన్​ టీని రోజు తీసుకోవడం వల్ల బరువు తగ్గడమే కాకుండా.. యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల అనేక ఆరోగ్యప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే గ్రీన్​ టీ వల్ల నిజంగానే బరువు తగ్గుతామా అనేది చాలా మందికి ఉండే ప్రశ్నే. గ్రీన్​ టీని ఎప్పుడు తీసుకుంటే బరువు తగ్గుతాము, బరువు తగ్గడంలో గ్రీన్​ టీ పాత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మెరుగైన జీవక్రియ రేటు

గ్రీన్​ టీ బరువు తగ్గడానికి దోహదం చేసే జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. గ్రీన్ టీలో కెఫీన్ వంటి ముఖ్యమైన బయోయాక్టివ్ పదార్థాలు, కాటెచిన్స్ అనే ఒక రకమైన పాలీఫెనాల్ ఉన్నాయి. ఇవి శరీర జీవక్రియ రేటును పెంచడంలో సహాయపడతాయి.

అధిక జీవక్రియ రేటు ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది. మీ శరీర శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా బరువు తగ్గడంలోనూ సహాయం చేస్తుంది. మీ రక్తప్రవాహంలో యాంటీఆక్సిడెంట్ స్థాయిలను కూడా పెంచుతుంది. అధ్యయనాల ప్రకారం గ్రీన్ టీ వినియోగం రోజుకు 75-100 కేలరీలు బర్న్ చేస్తుంది.

గ్రీన్ టీని వ్యాయామం చేసే సమయంలో తీసుకుంటే ఎక్కువ కొవ్వును బర్న్ చేస్తుంది. కొవ్వును బర్న్ చేసే ప్రక్రియను వేగవంతం చేయడంలో గ్రీన్ టీ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అందుకే ఈ రోజుల్లో వివిధ బరువు తగ్గించే సప్లిమెంట్లలో గ్రీన్ టీ సారాంశాలు ఉంటున్నాయి.

కొవ్వును కరిగించే ప్రభావాలను పెంచడానికి మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వాటితో పాటు గ్రీన్ టీని తీసుకోవాలి. ఒక అధ్యయనం ప్రకారం.. వ్యాయామానికి ముందు గ్రీన్ టీ సప్లిమెంట్లను తీసుకున్న పురుషులు, తీసుకోని వారి కంటే 17% శరీర కొవ్వును తగ్గించారు.

ఆకలిని అణిచివేస్తుంది..

అధిక మొత్తంలో చక్కెర తీసుకోవడం.. బరువు పెరగడానికి దోహదం చేస్తుంది. అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. గ్రీన్ టీకి చక్కెర అవసరం లేదు. పైగా కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది మీ ఆహారంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడుతుంది.

అంతేకాకుండా శరీరంలోని డోపమైన్, నోర్‌పైన్‌ఫ్రైన్‌లను ప్రభావితం చేయడం ద్వారా మీ ఆకలిని తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఇది అదనపు కిలోలను తగ్గించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

మంచి కొవ్వులు

మన శరీరంలో రెండు రకాల కొవ్వులు ఉన్నాయి. బ్రౌన్ ఫ్యాట్, వైట్ ఫ్యాట్. బ్రౌన్ ఫ్యాట్‌ను మంచి కొవ్వు అని పిలుస్తారు. ఇది బరువు తగ్గడానికి మీకు సహాయం చేస్తుంది. గ్రీన్ టీలోని కాటెచిన్ సమ్మేళనాలు మీ శరీరంలోని బ్రౌన్ ఫ్యాట్‌ను పెంచడంలో సహాయపడతాయి. ఇది బరువు తగ్గడాన్ని ప్రోత్సాహిస్తుంది. అయితే వైట్ ఫ్యాట్ అనేది మీరు బరువు పెరిగినప్పుడు కనిపించే చెడు కొవ్వు.

WhatsApp channel