Sweet Potato Benefits : చలికాలంలో చిలగడదుంప తింటే హెల్త్​కి చాలా మంచిదట..-consume sweet potato s in winter is good for health here is the benefits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sweet Potato Benefits : చలికాలంలో చిలగడదుంప తింటే హెల్త్​కి చాలా మంచిదట..

Sweet Potato Benefits : చలికాలంలో చిలగడదుంప తింటే హెల్త్​కి చాలా మంచిదట..

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 01, 2022 09:53 AM IST

Sweet Potato Benefits : చిలగడదుంపలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇది కణాలను నాశనం కాకుండా కాపాడుతుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న చిలగడదుంపను చలికాలంలో కచ్చితంగా డైట్​లో యాడ్ చేసుకోవాలి అంటున్నారు ఆహార నిపుణులు.

చిలగడదుంపలతో బెనిఫిట్స్ ఇవే..
చిలగడదుంపలతో బెనిఫిట్స్ ఇవే..

Sweet Potato Benefits : చలికాలంలో చిలగడదుంపలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చిలగడదుంపలలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ డి మంచి మొత్తంలో ఉంటాయి. బంగాళదుంపల కంటే ఎక్కువ పిండిపదార్థాలు దీనిలో ఉంటాయి. కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కేలరీలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇన్ని పోషకాలు కలిగి ఉన్న చిలగడదుంపను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది గుండె, మూత్రపిండాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

చిలగడదుంపలో ఉండే కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, థయామిన్, కెరోటినాయిడ్స్ ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. చిలగడదుంప కణాలను నాశనం కాకుండా కాపాడుతుంది. కాబట్టి మీరు ఇప్పటివరకు స్వీట్ పొటాటోని తినకపోతే.. వాటిని తినడానికి ఇదే సరైన సమయం. వీటిని ఉడకబెట్టి తీసుకోవచ్చు.. లేదా కాల్చి తినవచ్చు. వీటిని తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మధుమేహ వ్యాధి గ్రస్తులకు..

చిలగడదుంప మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది. దీనిలో ఉండే సమ్మేళనం రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. బ్లడ్ షుగర్ అదుపులో ఉండాలంటే చిలగడదుంపలను ఉడికించి తినవచ్చు. కానీ మీ రక్తంలో చక్కెర స్థాయి పెరిగితే.. చిలగడదుంపను డాక్టర్ సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి.

మెరుగైన కంటి చూపు కోసం..

కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చిలగడదుంప తీసుకోవడం చాలా మంచిది. బీటా కెరోటిన్, విటమిన్ ఎ వీటిలో పెద్ద మొత్తంలో ఉంటాయి. ఈ పోషకాలు కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. కంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. చిలగడదుంప రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

బరువు తగ్గాలనుకునేవారికి..

స్వీట్ పొటాటోలో ఫైబర్ ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది. చిలగడదుంపల్లోని కొవ్వు కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. చిలగడదుంపలు మీ శరీరంలో మంటను తగ్గిస్తాయి. కాల్చినవి తినడం ద్వారా.. ఆకలి తక్కువగా వేస్తుంది. ఇది క్రమంగా బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికై..

చిలగడదుంప క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. చిలగడదుంపలో ఉండే కెరోటినాయిడ్లు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అదనంగా వీటిలో ఆంథోసైనిన్స్ అనే మరొక సహజ సమ్మేళనం ఉంటుంది. ఇది క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. ఒకవేళ మీరు క్యాన్సర్ పేషెంట్ అయితే.. డాక్టర్ సలహా మేరకు మాత్రమే వీటిని తీసుకోండి. చిలగడదుంపలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది.

గుండె ఆరోగ్యానికై..

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మీ ఆహారంలో చిలగడదుంపలను తప్పనిసరిగా చేర్చుకోవాలి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం