Cold Water Bath In Winter | చలికాలంలో చన్నీటి స్నానం, ఉంచుతుంది రోగాల నుంచి దూరం!-bathing with cold water in winter has these benefits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Cold Water Bath In Winter | చలికాలంలో చన్నీటి స్నానం, ఉంచుతుంది రోగాల నుంచి దూరం!

Cold Water Bath In Winter | చలికాలంలో చన్నీటి స్నానం, ఉంచుతుంది రోగాల నుంచి దూరం!

HT Telugu Desk HT Telugu
Published Oct 31, 2022 07:23 AM IST

చలికాలంలో వేడినీటితో స్నానం చేయటం కంటే చన్నీటి స్నానం చేయడమే ఉత్తమం అని నిపుణులు అంటున్నారు. అయితే కొంతమంది మాత్రం చల్లటి నీటితో అస్సలు స్నానం చేయవద్దు. ఆ విషయాలు ఇక్కడ తెలుసుకోండి.

bathing with cold water
bathing with cold water (Pixabay)

చలికాలం వచ్చిందటే బాత్ రూంలోకి వెళ్లి కుళాయిని తిప్పాలన్నా, చల్లటి నీటిని తాకాలన్నా జంకుతాం. ఉదయం వేళ చల్లటి నీటిని తాకగానే మన బాడీలో వెబ్రేషన్స్ వచ్చేస్తాయి. ఉదయం లేవటానికి కూడా బద్దకంగా ఉంటుంది. చాలా ఆలస్యంగా లేచి, వేడివేడి నీళ్లతో స్నానం చేస్తే ఎంత సేపైనా చేయాలన్నంత వెచ్చగా ఉంటుంది. కొంతమంది అసలు స్నానం చేయటానికే ఇష్టపడరు. కానీ సీజన్‌తో సంబంధం లేకుండా, ఉదయాన్నే లేచి స్నానం చేయడం చాలా అవసరం. అది కూడా చల్లటి నీటితో స్నానం చేస్తే ఎన్నో విధాలుగా మేలు కలుగుతుందని నిపుణులు అంటున్నారు.

స్నానం చేయడం వలన శరీరం పరిశుభ్రం అవడమే కాక, అది కండరాల ఒత్తిడిని తగ్గిస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది, ఆందోళనను తగ్గిస్తుంది.

చలికాలం చన్నీటి స్నానం చేయడం వలన కలిగే ప్రయోజనాలు

చలికాలంలో చల్లటి నీటితో స్నానం చేయడం వేడి నీళ్లతో చేసిన దాని కంటే మరింత ఉపయోగకరంగా ఉంటుంది. వ్యక్తిగతంగా అనేక సమస్యలను పరిష్కరించుకోవడానికి అది సహాయపడుతుంది.

రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది

శరీరంపై పడే చల్లని నీటి జల్లులు మిమ్మల్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచేలా చేస్తాయి. రక్తాన్ని వివిధ అవయవాలకు తరలించేలా చేస్తాయి. అదే వేడినీటితో చేసినపుడు ఈ ప్రభావం రివర్స్ ఉంటుంది. అంటే పైన చర్మం వెచ్చని అనుభూతి పొందినప్పటికీ, రక్తం చర్మం ఉపరితలం వైపు కదులుతుంది. ఇది చల్లని షవర్ ప్రభావాన్ని తిప్పికొడుతుంది. కానీ, చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల ధమనులు బలంగా తయారవుతాయి, రక్తపోటు తగ్గుతుంది. అందువలన, మీరు ఫిట్‌గా ఉండాలంటే చల్లటినీటితో స్నానం చేయండి.

చర్మం, జుట్టు ఆరోగ్యానికి మంచిది

చలికాలంలో వేడి నీటి స్నానం చేస్తే చర్మం పొడిబారుతుంది. చర్మంపై మొటిమలు, దద్దుర్లు కూడా ఏర్పడతాయి. చుండ్రు సమస్యలతో కూడా ఇబ్బందిపడతారు. అయితే చల్లటి షవర్ క్యూటికల్స్ చర్మంపై రంధ్రాలను బిగిస్తుంది. చర్మం, స్కాల్ప్‌లోని రంధ్రాలను కూడా మూసివేస్తుంది, ఇలా మురికి చేరకుండా అడ్డుకుంటుంది. అందువల్ల, సహజ నూనెలు చర్మం నుండి బయటకు వెళ్లవు.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

చల్లని నీరు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. మీరు చల్లటి నీటితో స్నానం చేస్తే, తెల్ల రక్త కణాల శాతం పెరుగుతుంది, జీవక్రియ రేటు మెరుగవుతుంది. ఎందుకంటే చల్లటి స్నానంతో శరీరం దానంతటదే వేడెక్కడానికి ప్రయత్నిస్తుంది, ఆ ప్రక్రియలో తెల్ల రక్త కణాలను విడుదల చేస్తుంది. ఇలా రోగనిరోధక వ్యవస్థను సక్రియం చేస్తుంది.

కండరాల రికవరీ

కండరాలు పట్టుకుంటే చన్నీటి స్నానంతో వేగంగా కండరాలను పూర్వస్థితికి తేవచ్చు. కండరాల నొప్పిని అధిగమించడానికి చల్లని జల్లులు సహాయపడతాయి. ఇది కోల్డ్ కంప్రెషన్ లాంటిది.

డిప్రెషన్‌ మాయం

చల్లటి నీరు సానుకూల ప్రభావాన్ని కలిగి ఉంటుంది, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మీరు ఒత్తిడిలో ఉంటే చల్లటి షవర్ కింద కాసేపు ఉండండి. బయటికి వచ్చిన తర్వాత మీరు మరింత రిలాక్స్‌గా ఉంటారు.

వీరికి చన్నీటి స్నానం మంచిది కాదు

మీకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే, చల్లటి నీటితో స్నానం చేయడం మంచి ఆలోచన అనిపించుకోదు. ఎందుకంటే చల్లటి నీటితో జలుబు, దగ్గు, న్యుమోనియా, గొంతులో చికాకు, జ్వరం వంటి అనేక ఆనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి, చల్లటి నీటిని ఎంచుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి.

అలాగే దీర్ఘకాలిక వ్యాధులు కలిగి ఉన్నవారు చన్నీటి స్నానాన్ని నివారించాలి. మీకు జ్వరం, గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటు ఉన్నట్లయితే, చల్లటి నీటితో స్నానం చేయవద్దు, అలా చేయడం వల్ల మీ ఆరోగ్యం మరింత దిగజారుతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం