Vitamin B-Complex: శరీరంలో విటమిన్ B లోపిస్తే ఎంత ప్రమాదమో తెలుసా?
బి-కాంప్లెక్స్ విటమిన్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటి లోపం కారణంగా శరీరంలోని అవయవాల పని తీరు దెబ్బ తింటుంది.
విటమిన్ B శరీరానికి కావాల్సిన అత్యంత ముఖ్యమైన విటమిన్‌లో ఒకటి. ఇది మధుమేహ ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు శరీరంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఈ విటమిన్ లివర్,గుండె, కిడ్నీ, బ్రెయిన్‌లకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. సాధరణంగా విటమిన్ బి ఎనిమిది రకాలుగా ఉంటుంది. B1, B2, B3, B5, B6, B7, B9తో పాటు B12తో కలిపి ఇలా మెుత్తం బీ కాంప్లెక్స్ రూపంలో శరీరానికి అందుతాయి. అయితే ఇంత ముఖ్యమైన బీ కాంప్లెక్స్ శరీరానికి కావలసినంత లభించకపోతే ఏమవుతుందో ఒక్క సారి చూద్దాం.
అలసట - ఎవరికైనా విటమిన్ B12 లోపిస్తే, వారు తొందరగా అలసిపోతారు. నిజానికి శరీరంలోని కణాలు సక్రమంగా పనిచేయాలంటే విటమిన్ బి12 అవసరం. విటమిన్ B12 లోపం వల్ల ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గిపోతుంది, దీని ఫలితంగా శరీర అవయవాలకు ఆక్సిజన్ తక్కువగా అందుతుంది. అలసట ఏర్పడుతుంది. విటమిన్ B12 లేదా B9 లోపించడం కారణంగా మెగాలోబ్లాస్టిక్ అనీమియాకు దారితీస్తుంది.
కండరాల తిమ్మిరి, బలహీనత - విటమిన్ B12 లోపం వల్ల నరాల పనితీరును ప్రభావితం చేస్తుంది, ఇది కండరాలలో తిమ్మిరి, బలహీనతకు దారితీస్తుంది.
పసుపు చర్మం - శరీరంలో విటమిన్ B12 లేకపోవడం వల్ల చర్మం పసుపు రంగులోకి మారుతుంది. విటమిన్ బి12 లోపం వల్ల కామెర్లు రావచ్చు. చర్మంతో పాటు కళ్లు కూడా పసుపు రంగులోకి మారుతాయి.
తలనొప్పి - విటమిన్ B12 లోపం పెద్దలు, పిల్లలలో తలనొప్పికి కారణమవుతుంది. తరచుగా తలనొప్పులు వచ్చేవారిలో విటమిన్ బి12 లోపం ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి . 2019లో 140 మందిపై జరిపిన సర్వే ప్రకారం, సాధారణ జనాభా కంటే మైగ్రేన్ సమస్యలు ఉన్నవారిలో విటమిన్ బి12 లోపం ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
ఉదర సమస్యలు - విటమిన్ B12 లోపం అతిసారం, వికారం, మలబద్ధకం, ఉబ్బరం, గ్యాస్, ఇతర ప్రేగు సమస్యలకు దారితీస్తుంది. విటమిన్ B12 లోపం కారణంగా పెద్దలు, పిల్లలలో అనేక సమస్యలు ఏర్పడుతాయి.
నోరు, నాలుక వాపు-నొప్పి - గ్లోసిటిస్ వల్ల నాలుక వాపు, నొప్పికి దారి తీస్తోంది. ఇది విటమిన్ B12 లేకపోవడం వల్ల రావచ్చు.
చేతులు, కాళ్ళలో చికాకు - పరేస్తేసియా చేతులు, కాళ్ళు లేదా జలదరింపుకు కారణమవుతుంది. శరీరంలోని కొన్ని భాగాలలో వణుకుతూ ఉంటాయి
సంబంధిత కథనం