Control Cholesterol : ఈ నట్స్ తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుందట.. మీకు తెలుసా?
కొలెస్ట్రాల్ సమస్య ఈ రోజుల్లో చాలా మందికి ప్రధాన సమస్యగా మారింది. ఆహారపు అలవాట్లు, క్రమరహిత జీవనశైలిలో వివిధ సమస్యల వల్ల ఈ సమస్య పెరుగుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ రెండు రకాలు. ఒక రకమైన కొలెస్ట్రాల్ శరీరానికి మంచిది, మరొక రకం శరీరానికి మంచిది కాదు. ఈ రెండవ రకం కొలెస్ట్రాల్ ఆందోళన కలిగిస్తుంది. కాబట్టి దానిని తగ్గించుకోవాలి. కొన్ని నట్స్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది అంటున్నారు ఆహార నిపుణులు.
Control Cholesterol : చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పెరిగితే గుండె జబ్బుల ప్రమాదం పెరిగిపోతుంది. ఫలితంగా శరీరంలో ఈ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించాలి. లేకుంటే ఆరోగ్య సమస్యలు పెరిగిపోతాయి. మరి ఈ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడానికి కొన్ని నట్స్ ఉపయోగపడతాయి అంటున్నారు నిపుణులు. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి.. కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి అంటున్నారు. అయితే వీటిని తినడానికి కొన్ని నియమాలు పాటించాలి. గింజలు ఎక్కువగా తినడం మంచిది కాదని గుర్తుంచుకోవాలి. రోజుకు ఒక పిడికెడు బాదంపప్పు తీసుకుంటే సరిపోతుంది. ఏ నట్స్ తింటే ఎలాంటి ప్రయోజనాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వేరుశెనగ..
వేరుశెనగలో విటమిన్ బి3, నియాసిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది ప్రోటీన్, ఫైబర్‌కు మంచి మూలం. వాటిలో ఫైటోస్టెరాల్స్ ఉంటాయి. ఈ కొవ్వు ఆమ్లాలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.
వాల్‌నట్‌లు..
వాల్‌నట్‌లు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌తో నిండి ఉంటాయి. సాల్మన్, ట్యూనా చేపల్లోఈ కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఒమేగా-3లు గుండె జబ్బులను తగ్గించడంలో, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
బాదం
ఈ బాదంలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్. ఇది శరీర కణాలను ఫ్రీ రాడికల్ నష్టం నుంచి రక్షిస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఫలితంగా మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అయితే బాదం పప్పు తినే ముందు రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. అవి ఏమిటో తెలుసుకోండి.
* వీటిని చిరుతిండిగా.. సలాడ్స్‌తో కలిపి తీసుకోండి. పాలు, స్మూతీస్, కూరలలో బాదం కలపవచ్చు. మీరు ఏ రకమైన బాదంపప్పునైనా రాత్రంతా నీటిలో నానబెట్టి తినవచ్చు.
* అయితే చక్కెర లేదా చాక్లెట్‌లో చుట్టిన బాదం అస్సలు తినకూడదు. ఇది శరీరంలో సోడియం, కొవ్వు, చక్కెర స్థాయిలను పెంచుతుంది.
పిస్తా
వీటిలో ఫైటోస్టెరాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది సహజంగా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడే సమ్మేళనం.
జీడిపప్పు
జీడిపప్పు.. జింక్, కాపర్, మెగ్నీషియం, సెలీనియం, విటమిన్ కె వంటి అనేక ఖనిజాలను కలిగి ఉంటుంది. ఇందులో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు మంచి స్థాయిలో ఉంటాయి. అవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
టాపిక్