Selfies Health Benefits : సెల్ఫీలతో ఆరోగ్యం పదిలం.. ఇక మెుదలెట్టండి సెల్ఫీ దండయాత్ర-do you take selfies experts says selfies health benefits ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Do You Take Selfies Experts Says Selfies Health Benefits

Selfies Health Benefits : సెల్ఫీలతో ఆరోగ్యం పదిలం.. ఇక మెుదలెట్టండి సెల్ఫీ దండయాత్ర

Anand Sai HT Telugu
Apr 02, 2024 02:00 PM IST

Selfies Health Benefits In Telugu : సెల్ఫీ తీసుకోవడం అనేది ఈరోజుల్లో ఒక ట్రెండ్. కానీ దీనితో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని చాలా మందికి తెలియదు. వాటి గురించి కచ్చితంగా తెలుసుకోవాలి.

సెల్ఫీ ఆరోగ్య ప్రయోజనాలు
సెల్ఫీ ఆరోగ్య ప్రయోజనాలు (Unsplash)

ప్రస్తుతం మనం సాంకేతిక యుగంలో జీవిస్తున్నాం. ఒకప్పుడు ఫొటోలు తీసుకోవాలంటే ఓ పెద్ద సెటప్ కావాలి. కానీ ఇప్పటి పరిస్థితులు వేరు. చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఆ సెల్ ఫోన్ తోనే అంతా. ముందు బ్యాక్ కెమెరాతో ఫొటోలు తీసుకునేవాళ్లం. తర్వాత ఫ్రంట్ కెమెరా వచ్చింది. ఇక సెల్ఫీల ట్రెండ్ షురూ అయింది. కాలానికి అనుగుణంగా చాలాసార్లు సెల్ఫీలు తీసుకున్నాం.

మనలో చాలా మంది సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు. ఈ కోరిక చాలా మందిలో ఉన్నప్పటికీ, సెల్ఫీలు ఆరోగ్యకరమైన అలవాటు అని నిపుణులు అంటున్నారు. గతంలో ఒకప్పుడు ఈ పదం కూడా లేదు. కానీ రానురాను సెల్ఫీ అనే పదం మన దైనందిన జీవితంలో భాగమైపోయింది. కొన్నిసార్లు మీ ఫొటోలను మీరు తీసుకోవడం ఆనందంగా ఉంటుంది. మీ అందం, మీ చిరునవ్వు ఇలా.. ప్రతీదీ మీరు చూసుకుని మురిసిపోతారు. లుక్స్, రూపురేఖల గురించి కొంచెం ఎక్కువ శ్రద్ధ ఉంటుంది.

అయితే సెల్ఫీలు మీకు ఒక విధంగా మంచివని చెబితే మీరు ఆశ్చర్యపోవచ్చు. అయితే సెల్ఫీలు మీ శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. సెల్ఫీలు మీ ఆరోగ్యానికి ఎందుకు మంచిదో తెలుసుకుందాం..

మీ ఆరోగ్యానికి మంచివి

సెల్ఫీ మీ ప్రాణాలను కాపాడుతుందని మీరు నమ్ముతారా? ఎహే అంతలేదు అని కొట్టిపారేస్తారు. కానీ సెల్ఫీలు వ్యాధులను నిర్ధారించడంలో సహాయపడతాయని కొత్త పరిశోధనలు సూచిస్తున్నాయి. ఎవరికైనా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటే గుర్తించవచ్చు. ఎందుకంటే కొన్ని ముఖ లక్షణాలు ఇతరులకన్నా ఎక్కువ ప్రమాదంలో ఉంటాయి. మీ పాత సెల్ఫీలు, కొత్త సెల్ఫీలు పోల్చి చూస్తే ఇది తెలుస్తుంది. కళ్ల కింద ఉబ్బుగా ఉండటంలాంటి లక్షణాలను గుర్తించవచ్చు. అప్పుడే మీకు అనుమానం ఉంటే వైద్యుడిని సంప్రదించవచ్చు.

ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి

సెల్ఫీలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. స్వీయ ప్రేమ అనేది ఒక పెద్ద విషయం. ఇతరులతో ప్రేమించబడటం మంచిదే. అయినప్పటికీ ముందుగా నిన్ను నీవు ప్రేమించుకోవాలి. సెల్ఫీలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతోపాటు ఆత్మగౌరవాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి. సెల్ఫీలు తీసుకునే వ్యక్తులు మరింత ఆత్మవిశ్వాసంతో పాటు ఆకర్షణీయంగా ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. మిమ్మల్ని మీరు చూసుకుంటే ఓ కాన్ఫిడెన్స్ వస్తుంది. అదే కదా జీవితానికి కావాల్సింది.

మీ కష్టాన్ని చెబుతాయి

సెల్ఫీలు కూడా మీ జీవితాన్ని ప్రతిబింబించే గొప్ప మార్గం. సెల్ఫీలు మీ పురోగతిని చెప్పడంలో సహాయపడతాయి. మీరు జీవితంలో ఎంత దూరం వచ్చారో చూడగలరు. సెల్ఫీలు చూస్తుంటే ఎవరికైనా తమ కష్టకాలం గుర్తుకు వస్తుంది. అదే సమయంలో ఆ కష్ట సమయాలను ఎలా అధిగమించారో తెలుస్తుంది. ఇది మీరు మరింత ముందుగు వెళ్లేందుకు సాయపడుతుంది. ఆ కష్టాలు అన్నీ చిన్న విషయాలే కదా.. ఇంకా చాలా సాధించాలనే కాన్ఫిడెన్స్ మీలో పెరుగుతుంది.

ఒత్తిడి తగ్గిస్తాయి

సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ అవుతున్న చిత్రాలలో సెల్ఫీలు ఒకటి. మీరు సెల్ఫీలను షేర్ చేయడం ద్వారా వ్యక్తులను బాగా తెలుసుకోవచ్చు. సంభాషణలను ప్రారంభించవచ్చు. మీ మానసిక ఆరోగ్యానికి సెల్ఫీలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మిమ్మల్ని మీరు చూసుకుంటే గర్వంగా ఫీలవుతారు. ఒత్తిడి నుంచి బయటపడతారు.

మానసిక ఆరోగ్యం బాగుంటుంది

సెల్ఫీలు గడిచిన క్షణాన్ని శాశ్వతంగా ఉంచేందుకు గొప్ప మార్గం. నోస్టాల్జియా మూమెంట్ అన్నమాట. గతంలోని సెంటిమెంట్. అదోరకమైన హ్యాపినెస్. ఈ భావన మన మానసిక ఆరోగ్యానికి మంచిదని అధ్యయానాలు చెబుతున్నాయి. గతం గురించి సానుకూల భావాలను సృష్టించడంలో సహాయపడుతాయి సెల్ఫీలు. గొప్ప జ్ఞాపకాలను దాచుకునేందుకు, వాటిని తిరిగి చూసి ఆనందించడానికి సెల్ఫీలు గొప్ప మార్గం.

కానీ సెల్పీలతో జాగ్రత్త

అయితే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మంది సెల్ఫీలు కోసం ప్రమాదకరమైన ప్రదేశాలకు వెళ్తారు. ఇది చాలా పెద్ద తప్పు. అలా వెళ్లి సెల్ఫీలు తీసుకుంటూ ప్రాణాలు కోల్పోయినవారు అనేకమంది ఉన్నారు. మన జీవితాన్ని నాశనం చేసే ప్రదేశంలో సెల్ఫీలు తీసుకోవాల్సిన అవసరం అస్సలే లేదు. కొండలు, సముద్రాలు, కాలువలులాంటి ప్రమాదకరమైన ప్రదేశాల్లో సెల్ఫీలు తీసుకునేప్పుడు జాగ్రత్త..

WhatsApp channel